అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం | andaman express running 5 hours late | Sakshi
Sakshi News home page

అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం

Mar 30 2015 7:55 PM | Updated on Sep 2 2017 11:36 PM

జమ్ముకాశ్మీర్‌లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి

రామగుండం (కరీంనగర్ జిల్లా): జమ్ముకాశ్మీర్‌లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం జమ్ముతావి నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, ఐదు గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement