అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు 

Amit Shah Telangana Tour On September 17 Is Cancelled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 17వ తేదిన జరగబోయే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రావడం లేదని బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పటాన్‌చెరులో జరిగే ఈ సభకు తొలుత అమితాషా రానున్నట్లు బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం వీలు కావడం లేదని ప్రేమేందర్‌ పేర్కొన్నారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్వం మజ్లిస్‌ పార్టీనే నడుపుతోందని, మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ‍వ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమేనని మండిపడ్డారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను స్మరించుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజున  అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top