అఖిల భారత కవితోత్సవానికి నిఖిలేశ్వర్‌ | All India Poetry festival NIKHILESHWAR | Sakshi
Sakshi News home page

అఖిల భారత కవితోత్సవానికి నిఖిలేశ్వర్‌

Mar 22 2018 4:01 AM | Updated on Mar 22 2018 4:01 AM

All India Poetry festival NIKHILESHWAR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కవితా దినోత్సవాన్ని (వరల్డ్‌ పొయెట్రీ డే) పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో అఖిల భారత కవితోత్సవం నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబార్‌ అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో 22 భాషల కవులు తమ కవిత్వాలను వినిపించారు. తెలుగు నుంచి హైదరాబాద్‌కు చెందిన కవి నిఖిలేశ్వర్‌ పాల్గొన్నారు. విశ్వ సంస్కృతిలో కవిత్వం ఒక భాగమని, దేశంలో మానవ సంస్కృతి అంతరాత్మగా కవిత్వం వెలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement