కేసీఆర్‌ లాగు తొడగక ముందే.. | Again Vote For Geetha Reddy Calls Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ లాగు తొడగక ముందే..

Nov 10 2018 7:01 PM | Updated on Nov 10 2018 7:07 PM

Again Vote For Geetha Reddy Calls Revanth Reddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్‌ లాగు తొడగక ముందే గీతారెడ్డి తల్లి ఈశ్వరీ బాయి తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పోరాటం చేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గీతారెడ్డికి మద్దతుగా శనివారం జహీరాబాద్‌లో జరిగిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. జహీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని అన్నారు. ఈ గడ్డపై కాంగ్రెస్‌ జెండా మరోసారి ఎగరాలని.. గీతారెడ్డి గెలిస్తే రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణకు కాపల కుక్కల ఉంటూ.. దళితున్ని సీఎం చేస్తానన్న దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. త్యాగమంటే ఎంటో సోనియా గాంధీని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. అక్కడ మోదీ, ఇక్కడ కేడీలు ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్‌ విమర్శించారు. మోదీ మెడలు వంచి జోనల్‌ వ్యవస్థను తీసుకువచ్చానని చెప్పున కేసీఆర్‌.. రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేకపోయ్యారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement