నైతిక బాధ్యత కోసం అఫిడవిట్‌: మల్లు రవి

 Affidavit Asks for Moral Responsibility from Congress candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి నైతిక బాధ్యత కోసమే అఫిడవిట్‌ అడుగుతున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా సీఎం కేసీఆర్‌ చేతుల్లోనే ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ అందరినీ నిర్వీర్యం చేసేలా కేసీఆర్‌ వ్యవహారశైలి ఉందన్నారు. మేము సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top