
సినీనటుడు తొట్టెంపూడి వేణు ఎన్నికల ప్రచారాం
సాక్షి, ఖమ్మం అర్బన్: సినీనటుడు తొట్టెంపూడి వేణు సోమవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తన బంధువు ఖమ్మం కూటమి(టీడీపీ) అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని 27, 49వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానికులు, కూటమి కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.