
చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దాడులు చేపట్టారు. నల్గొండలోని దామరచర్ల మండల చెక్‌పోస్ట్‌లో ఆర్‌సీఏ, ఏసీటీఓ, వ్యవసాయ శాఖలకు చెందిన చెక్‌పోస్టులపై ఏసీబీ డీఎస్పీ ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ.34 వేలు, ఆదిలాబాద్ చెక్‌పోస్టుపై దాడి చేసి సుమారు రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నారు.
జహీరాబాద్ చెక్‌పోస్టుపై సోమవారం అర్ధరాత్రి దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు విధుల్లో ఉన్న వెహికల్ ఇన్స్‌పెక్టర్ సుభాష్, కానిస్టేబుల్, హోంగార్డుల నుంచి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు.