chekposts
-
చూసీచూడనట్లు..
జైనథ్(ఆదిలాబాద్): ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు గుండా అక్రమంగా నగదు, లిక్కర్, దేశీదారు, ఇతరాత్ర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చే కార్లను మాత్రమే తనిఖీ చేస్తుండడంతో ‘సగం తనిఖీలే’ జరుగుతున్నాయి. లారీలు, భారీ కంటైనర్లు, ఇతర వాహనాలను పట్టించుకోవడం లేదు. అంతర్ జిల్లా తనిఖీ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తనిఖీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఎస్ఎస్ టీం సిబ్బంది కొరత ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో తనిఖీల ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా గట్టి నిఘా కోసం మూడు అంతర్రాష్ట్రీయ, ఆరు జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా, బేల మండలం శంకర్‌గూడ, బోథ్ మండల ఘన్పూర్ వద్ద అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీటితో పాటు దేవాపూర్, రోల్మామడ, గుడిహత్నూర్, ఇచ్చోడ సిరికొండ ఎక్స్‌రోడ్, గంగాపూర్, ఇంద్రవెళ్లి వద్ద జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద మూడు బృందాలు, మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి. సరిపోని సిబ్బంది.. తనిఖీ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఒక్కొక్క షిఫ్టులో ఒక కెమెరామెన్, ఒక కానిస్టేబుల్, ఒక అధికారి మాత్రమే ఉండడంతో తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేవలం కార్లను మాత్రమే ఆపి తనిఖీలు చేస్తున్నారు. లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను దర్జాగా వెళ్లనిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తేగాని ఇతర వాహనాల జోలికి వెళ్లకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే ఆస్కారం కనిపించడం లేదు. లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తే కనీసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు సమయం పట్టడం, తనిఖీల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడం, సరిపడా సిబ్బంది కూడా లేకపోవడం వంటి కారణాలతో పూర్తిస్థాయి తనిఖీలు జరగడం లేదు. అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాల వద్ద.. జిల్లాలోని మూడు అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రా ల వద్ద పట్టుబడిన నగదు వివరాలు ఇలా ఉన్నా యి. బోథ్ మండలంలోని ఘన్పూర్ చెక్‌పోస్టు వద్ద రెండుసార్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి రూ.2.45లక్షలు, మరోసారి రూ.3.22లక్షలను పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ మొత్తం రూ.5.67లక్షలను సీజన్ చేశారు. అలాగే జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద ఇప్పటి వరకు రూ.10.14కోట్లు పట్టుబడ్డాయి. బేల మండలంలోని శంకర్‌గూడ తనిఖీ కేంద్రం వద్ద రూ.5.45లక్షల నగదు పట్టుబడింది. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.11.36కోట్ల నగదు, 1565 లీటర్ల మద్యం పట్టుబడింది. ఈ నాలుగు రోజులైనా.. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు సా ధారణంగా మద్యం, నగదు అక్రమరవాణా పెద్ద మొత్తంలో జరుగుతుందని పలువురి అభిప్రా యం. చివరి రోజుల్లోనే గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ రోజుల్లో గట్టి బందోబస్తుతో పాటు తనిఖీలు చేపడితే అక్రమ రవాణాను చాలా వరకు అరికట్టవచ్చని భావిస్తున్నారు. కేవలం కార్లలోనే కాకుండా ఇతర వాహనాల్లోనూ డబ్బు తరలించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని, లారీలు, కంటైనర్లను సైతం క్ష్ణు్ణంగాతనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు. అన్ని వాహనాలు తనిఖీ చేస్తాం.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 తనిఖీ కేంద్రాల్లో అన్నిరకాల వాహనాలను తనిఖీ చేసేలా ఆదేశిస్తాము. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాం. ఎన్నికల్లో ఎలాంటి అక్రమ ర వా ణాకు ఆస్కారం లేకుండా ఉం డేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఈ కేంద్రాలతో పాటు రాత్రి వేళలో అదనపు తనిఖీ బృందాలను కూడా తిప్పు తున్నాము. – నర్సింహారెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
రూ.13.43 లక్షలు పట్టివేత
వికారాబాద్ అర్బన్: ఎన్నికల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం వికారాబాద్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా రూ. 13.43 లక్షలు పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళితే.. షాబాద్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి తాండూరు వస్తున్నాడు. అదే సమయంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్ వద్ద సీఐ సీతయ్య, ఏఐఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి కారు తనిఖీ చేయగా అందులో రూ.13.43 లక్షలు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించి సంబంధిత కారు యజమాని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. విషయాన్ని సీఐ సీతయ్య ఉన్నతాధికారులకు చెప్పడంతో డీఎస్పీ శిరీష రాఘవేందర్ ఘటనా స్థలానికి వచ్చి వాహనాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు నగదును వికారాబాద్ తహసీల్దార్ చిన్న అప్పలనాయుడుకు అప్పగించారు. సీజ్ చేసిన నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తహసీల్దార్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.16.48లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 60లక్షలు విలువచేసే బంగారం, వెండి ఆభరణాలు సైతం తనిఖీల్లో పట్టుబడ్డాయి. అడుగడుగునా నిఘా.. ఎన్నికల సందర్భంగా అక్రమ డబ్బు, మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న ప్రతి ప్రైవేటు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రూ.50వేలకు మించి నగదును తరలిస్తే డబ్బుకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపిస్తే వదిలేస్తున్నారు. లేనిపక్షంలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రత్యేక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇటీవల కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఈ బృందంలో ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ అధికారితో పాటు పోలీస్, రెవెన్యూ అధికారి, వీడియో తీసేందుకు వీడియో గ్రాఫర్ ఉంటారు. ఈ బృందాలకు ఇచ్చే వాహనాలకు పూర్తిగా జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనికి తోడు పాత నేరస్తులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. వారందరినీ తీసుకొచ్చి తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. -
‘లెక్క’ తప్పిందా.. సొత్తు గోవిందా!
నాగర్‌కర్నూల్ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బెల్టు షాపులపై జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు బెల్టుషాపుల నిర్వాహకులను బైండోవర్ చేశారు. అధికారులు చెక్‌పోస్టుల వద్ద, బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యాపారి వాహనం నుంచి రూ.33,72,330 నగదు పట్టుబడటంతో తరలింపుపై నిఘా తీవ్రతరం చేశారు. వ్యాపారుల్లో ఆందోళన ఎన్నికల సీజన్ కావడంతో వ్యాపారులు, ప్రజలు నగదును ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే జంకుతున్నారు. వ్యాపారులు చాలా వరకు బ్యాం కు చెల్లింపుల ద్వారానే వ్యాపార లావాదేవీ లు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రులకు, షాపింగ్‌లు, ఇతర అవసరాల కోసం ప్రజలు నగదును తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలను చూయిస్తేనే వాటిని సీజ్ చేయమని అధికారులు చెబుతున్నా చాలామందికి ఆ విషయాలు తెలియక నగదుకు సంబంధించిన రశీదులు తీసుకువెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. లావాదేవీలపై సమాచార సేకరణ ఎన్నికలలో ఓటర్లకు నగదు పంచి ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉన్నందున నగదు తరలింపు పై నిఘా పెంచిన అధికారులు బ్యాంకు ఖా తాలపై దృష్టిసారించారు. అభ్యర్థులు నగదును నే రుగా కాకుండా బ్యాంకుల ద్వారా లావాదేవీలు జ రుపుతారనే ఉద్దేశంతో కొద్దిరోజుల నుంచి బ్యాం కుల్లో రూ.లక్షల్లో జరిగిన లావాదేవీలపై ఆదాయ పు పన్ను శాఖ, ఎన్నికల అధికారులుç Üసమాచా రం సేకరిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో మహిళా సంఘాలు అధికంగా ఉండటంతో వారు రూ.లక్ష ల్లో రుణాలు తీసుకుంటుంటారు. అభ్యర్థులు మ హిళా సంఘాలను ప్రభావితం చేయకుండా ఉం డేందుకు వారి ఖాతాల్లో ఇటీవల జరిగిన నగదు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో.. ఏ వ్యక్తి అయిన సొంత అవసరాలకు, వ్యా పార లావాదేవీల కోసం, షాపింగ్‌లకు ఇలా ఏ అవసరం నిమిత్తం నగదు తీసుకువెళ్తున్నామనే ఆధారాలను అధికారులకు చూయిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. తనిఖీలలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు. సరైన ఆధారాలు చూయించకపోతే సీజ్‌చేసి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. సదరు అధికారి నగదును జిల్లా ఎన్నికల మానిటరింగ్ కమిటీ విచారణ చేసి సరైన ఆధారాలు చూయించకుంటే ట్రెజరీలో డిపాజిట్ చేసి కోర్టులో కేసు వేస్తారు. తనిఖీలలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుకుంటే ఆ నగదును సీజ్ చేసి జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. జిల్లా ఎన్నికల అధికారి ఆ నగదును ఎస్టీఓలో జమ చేసి ఆదాయ శాఖాధికారులకు సమాచారం ఇస్తే నగదు పట్టుబడిన వ్యక్తికి ఆదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నగదుకు సంబంధించిన వ్యక్తి ఐటీ రిటరŠన్స్, సరైన ఆధారాలు చూయించి నగదు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీచేసే అవకాశం ఉంది. చెక్కులను అకౌంట్లో జమ కావడానికి చాలారోజులు పడుతుంది అనుకుంటే బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌లను తీసుకునే అవకాశం ఉంది. ఆధారాలు చూయించాలి ఎన్నికల కోడ్ ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకువెళితే నగదుకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలలో నగదుకు సంబంధించిన ఆధారాలు చూయించి అధికారులకు సహకరించాలి. ఎవరైనా సరైన ఆధారాలు చూయించకుంటే సీజ్ చేసి ట్రెజరీ కార్యాలయంలో జమ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – హన్మానాయక్, ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ -
ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
-
ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, ముత్తగూడెం, ఆదిలాబాద్ లోని వాంఖెడ్, బోరజ్ , మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం చెక్ పోస్టులో దాడులు కొనసాగుతున్నాయి. అశ్వారావు చెక్ పోస్టులో సిబ్బంది రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దాడులు చేపట్టారు. నల్గొండలోని దామరచర్ల మండల చెక్‌పోస్ట్‌లో ఆర్సీఏ, ఏసీటీఓ, వ్యవసాయ శాఖలకు చెందిన చెక్పోస్టులపై ఏసీబీ డీఎస్పీ ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ.34 వేలు, ఆదిలాబాద్ చెక్‌పోస్టుపై దాడి చేసి సుమారు రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ చెక్‌పోస్టుపై సోమవారం అర్ధరాత్రి దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు విధుల్లో ఉన్న వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్, కానిస్టేబుల్, హోంగార్డుల నుంచి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు.