ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్ | acb officials are caughton municipal commissioner | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

Apr 10 2015 5:03 PM | Updated on Oct 16 2018 6:08 PM

వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కారు.

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వివరాలు..మహబూబాబాద్ కు చెందిన ఓంజీ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. అనుమతి కావాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం గత ఆరు నెలలుగా సాగుతున్నట్లు సమాచారం.

దీంతో విసుగు చెందిన ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం వేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ కార్యాలయంలో ఒంజీ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రాజలింగ్ నుపట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మహబూబాబాద్)

Advertisement
 
Advertisement
Advertisement