రేవంత్కు బెయిలా...కస్టడీనా? | ACB files petition seeking custody of revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్కు బెయిలా...కస్టడీనా?

Jun 5 2015 11:18 AM | Updated on Aug 17 2018 12:56 PM

రేవంత్కు బెయిలా...కస్టడీనా? - Sakshi

రేవంత్కు బెయిలా...కస్టడీనా?

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి.

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఇవాళే విచారణకు రానుంది. దీంతో ఆయనను కోర్టు... ఏసీబీ కస్టడీకి అనుమతిస్తుందా, లేక బెయిల్ ఇస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రేవంత్‌రెడ్డిని కోర్టు కస్టడీకి అప్పగిస్తే ఆయన్ని ప్రశ్నించడానికి ఏసీబీ ప్రశ్నావళిని రూపొందించింది.

వాటికి రేవంత్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అవసరమైన ఆధారాలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్నట్లు చెబుతున్న నాలుగో నిందితుడు మత్తయ్యను కూడా అరెస్టు చేసి మిగతా నిందితులతో కలిపి విచారించే అవకాశముంది. ఇక రేవంత్ కస్టడీ గడువు ముగిసిన తర్వాతే చంద్రబాబును విచారించవచ్చని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement