ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం | ABVP Formation Day In Kamareddy | Sakshi
Sakshi News home page

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

Jul 10 2018 1:12 PM | Updated on Oct 3 2018 7:02 PM

ABVP Formation Day In Kamareddy - Sakshi

 జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు 

కామారెడ్డి టౌన్‌: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఆర్‌కే కళాశాలలో విద్యార్థులకు సెమినార్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్‌మోహన్‌ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటి సభ్యుడు బాల్‌రాజ్, నాయకులు స్వామి, నరేందర్‌రెడ్డి, రాహుల్, నారాయణ, నరేశ్, రాజాగౌడ్, అనిల్, ప్రవీన్, భాను తదితరులు పాల్గొన్నారు. 

ఏబీవీపీ జెండా ఆవిష్కరణ 

దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం ఏబీవీపీ నాయకు లు జెండాను ఎగురువేశారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు కళాశాల ఆవరణలో స్వచ్చభారత్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల ప్రతినిధులు మనిదీప్, రణదీర్, రాజు, వేణులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement