చనిపోరుున వారికీ ‘అభయహస్తం’ ! | Abhaya hastham defaults | Sakshi
Sakshi News home page

చనిపోరుున వారికీ ‘అభయహస్తం’ !

Apr 19 2015 1:56 AM | Updated on Jul 6 2019 4:04 PM

అభయహస్తం జాబితాలో చనిపోరుునవారికీ చోటుదక్కింది. అదే సమయంలో అర్హులకు మొండి చేయే మిగిలింది.

పర్వతగిరి : అభయహస్తం జాబితాలో చనిపోరుునవారికీ చోటుదక్కింది. అదే సమయంలో అర్హులకు మొండి చేయే మిగిలింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఆరు నెలల తర్వాత అభయహస్తం పింఛన్ల డబ్బులు విడుదల కాగా... పంచాయతీ కార్యాలయంలో అధికారులు శనివారం ఆ పథకం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించారు. గ్రామంలో మొత్తం 55 మంది లబ్ధిదారులు ఉండగా... ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల డబ్బులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అభయహస్తం లబ్ధిదారుల జాబితా చూసిన స్థానిక సర్పంచ్ గోనె విజయలక్ష్మి, గ్రామస్తులు అవాక్కయ్యారు.

అర్హులైన వారిని పక్కనబెట్టి ఐదేళ్ల క్రితం చనిపోయిన తొమ్మిది మందికి డబ్బులు మంజూరు చేయడంపై  సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్కెర్ల వీరమ్మ, చెన్నూరి కట్టమ్మ, తోపుచర్ల అనసూర్య, తీగల సాయమ్మ, బాసాని సోమక్క, కొప్పు చంద్రమ్మ, ఉడుగుల కొంరమ్మ, చీదురు లక్ష్మి, ఎండీ.అంకూస్ ఎప్పుడో చనిపోయూరని, వారికి అభయహస్తం జాబితాలో చోటుకల్పించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అర్హులై ఉండి జాబితాలో పేర్లు రాని వారి వివరాలను ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అనంతరం ఆ తొమ్మిది మంది పోను మిగిలిన లబ్ధిదారులకు ఆరు నెలల పింఛన్ డబ్బులు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement