విత్తన సబ్సిడీకి ఆధార్‌ లింక్‌ | aadhaar link tie with subsidy seeds | Sakshi
Sakshi News home page

విత్తన సబ్సిడీకి ఆధార్‌ లింక్‌

Apr 4 2017 2:14 AM | Updated on Sep 5 2017 7:51 AM

సబ్సిడీ విత్తన సరఫరాను ఆధార్‌తో అనుసంధానించా లని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్‌: సబ్సిడీ విత్తన సరఫరాను ఆధార్‌తో అనుసంధానించా లని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తేనే సబ్సిడీ వర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించినట్లు ఆ శాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌ తెలిపారు. తద్వారా సబ్సిడీ అక్ర మార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకోగల మని వివరించారు.

మండలాల్లోని సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాల్లో రైతులు.. విత్త నాల పరిమాణం, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌ కార్డు వివరాలు తెలిపి సబ్సిడీ పోను మిగిలిన సొమ్ము చెల్లించాలని, రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాకే విత్తనాలు అందజేస్తారన్నారు. గతంలో ఈ పద్ధతి లేక రైతుల పేరుతో అనేకమంది విత్తనాలను కొనుగోలు చేసి పక్కదారి పట్టించారని, ఆన్‌లైన్‌తో అవినీతికి అవ కాశం ఉండదన్నారు. ఈ ఏడాది వరి, సోయాబీన్, కంది, పెసర తదితర విత్తనా లను సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, కొత్త విధానంతో ఆధార్‌ కార్డున్న రైతులకే విత్తన సబ్సిడీ లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement