నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని శక్కర్‌నగర్‌లో కృష్ణ(24) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
నిజామాబాద్ (బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని శక్కర్‌నగర్‌లో కృష్ణ(24) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆచన్‌పల్లికి చెందిన కృష్ణకు, అదే గ్రామానికి చెందిన రమ్యతో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో కృష్ణను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ మెడ చుట్టూ ఉరి బిగించిన గాయాలుండటంతో అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానపు కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.