వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది.
నల్లగొండ: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోతె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం - సూర్యాపేట రహదారి మార్గంలో ఉన్న మోతె సమీపంలోని వ్యవసాయ బావి నుంచి దుర్గంధం వస్తుండటంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో నుంచి గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బావిలోని నీటిని మొత్తం తీసివేయడంతో బావిలో ద్విచక్రవాహనం ప్రత్యేక్షమయింది. దీంతో అతివేగంగా వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందినది ఎవరా అనేది ఇంకా తెలియరాలేదు.