వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి | A boy died of neglect of doctors | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

Jun 22 2017 3:18 AM | Updated on Sep 5 2017 2:08 PM

వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది.

కెరమెరి(ఆసిఫాబాద్‌): వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కుమ్రం భీం జిల్లాలోని కెరమెరి మండలం గోండ్‌ కరం జివాడ గ్రామానికి చెందిన సిడాం బ్రహ్మ (11)ను బుధవారం వేకువజామున పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు సిడాం యాదోరావు, దుర్పాబాయిలు వెం టనే కెరమెరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుడు సుంకన్న వైద్యం చేయ కుండానే ఆదిలాబాద్‌కు రిఫర్‌ చేశారు. 108 వాహనం లేకపోవడంతో  తిరిగి ఇంటికి తీసుకువెళ్తుండగా బ్రహ్మ మృతి చెందాడు.

దీంతో కుటుం బీకులు, గ్రామస్తులు పీహెచ్‌సీ తిరిగి వెళ్లి గేటు ఎదుట మృత దేహంతో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందిని బయటికి వెళ్ల కుండా అడ్డుకు న్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం వచ్చి  కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వ డంతో కుటుంబీకులు శాంతించారు. బ్రహ్మ సిర్పూర్‌(యూ) పంగిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement