ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ | 7 gamblers arrested | Sakshi
Sakshi News home page

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

Sep 21 2015 7:15 PM | Updated on Aug 29 2018 4:16 PM

వ్యవసాయ భూముల్లో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసిన పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

దామరచర్ల (నల్లగొండ) : వ్యవసాయ భూముల్లో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసిన పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 9 బైకులు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కాల్వపల్లి వద్ద సోమవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement