51 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 51 Gamblers arrested in tupran in medak district | Sakshi
Sakshi News home page

51 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Oct 24 2014 9:16 AM | Updated on Sep 2 2017 3:19 PM

మెదక్ జిల్లా తుప్రాన్లోని ఓ ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి... 51 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.

మెదక్: మెదక్ జిల్లా తుప్రాన్లోని ఓ ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి...  51 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లతోపాటు రూ. 65 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.  తుప్రాన్లో పేకాట రాయుళ్ల  ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తరచుగా పలు నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు.  ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement