500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...! | 500 designs to the batukhamma sarees | Sakshi
Sakshi News home page

500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...!

Sep 3 2017 3:32 AM | Updated on Nov 9 2018 5:56 PM

500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...! - Sakshi

500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...!

ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సిరిసిల్ల, సూరత్‌ నుంచి తయారు చేయించి తెప్పిస్తున్న ప్రభుత్వం 
 
ఇందూరు (నిజామాబాద్‌అర్బన్‌): ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేదింటి మహిళలకు కానుకగా చేనేత చీరలను ఉచితంగా అందించనుంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిరిసిల్లా, సూరత్‌లలో 500 డిజైన్‌లలో నేత చీరలను తయారు చేయించింది. అన్ని జిల్లాలకు సరఫరా చేయడం కూడా ప్రారంభమైంది.  

రేషన్‌ కార్డుల ఆధారంగా రేషన్‌ కార్డు కలిగిన కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కో కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళల వివరాలను ప్రభుత్వం సేకరించింది.  బతుకమ్మ పండుగ ఈ నెల మూడో వారంలో వస్తున్న నేపథ్యంలో చీరల పంపిణీ క్షేత్ర స్థాయిలో 18,19 తేదీల్లో పూర్తి చేయాలని, ఇంకా మిగిలిన వారుంటే 20వ తేదీన కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement