ఏకంగా 47 నాగు పాములు ... | 47 Cobra Snakes Found In House In Medak District | Sakshi
Sakshi News home page

ఏకంగా 47 నాగు పాములు ...

Apr 12 2020 8:07 PM | Updated on Apr 12 2020 8:11 PM

47 Cobra Snakes Found In House In Medak District - Sakshi

సాక్షి, మెదక్‌ :  సాధారణంగా  పాము మన కంటపడితేనే గుండె అదిరి అల్లంత దూరం పారిపోతాం. అలాంటి ఏకంగా 47 నాగుపాములు ఓ ఇంట్లో దర్శనమిస్తే..! నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి  గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొంక లచ్చల్‌ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేసేందుకోసం మెట్లకింద ఉన్న పాత సామగ్రిని తీస్తుండగా 47 నాగు పాములు బయట పడ్డాయి. ఒకేసారి అన్ని పాములు బయట పడడంతో భయాందోళకు గురైన లచ్చల్‌, ఇరుగుపొరుగు వారి సాయంతో వాటిని మట్టుబెట్టాడు. 

Advertisement
 
Advertisement
Advertisement