4 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | 4 sand tractors seized in karimnagar distirict | Sakshi
Sakshi News home page

4 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Feb 5 2015 1:12 PM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియా అగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.

కరీంనగర్ :  ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఇసుక  క్వారీలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు.  కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల తనిఖీలతో  ట్రాక్టర్లను వదిలి నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
(కమలాపూర్)

Advertisement
 
Advertisement
Advertisement