కోణార్క్‌లో మరోసారి గంజాయి స్వాధీనం | 30 kg ganja seized From Konark Express | Sakshi
Sakshi News home page

కోణార్క్‌లో మరోసారి గంజాయి స్వాధీనం

Aug 18 2017 1:09 PM | Updated on Sep 12 2017 12:25 AM

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మధిర: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో 30 కేజీల గంజాయి తరలిస్తుండగా మధిర రైల్వే స్టేషన్లో ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, పట్టుబడిన గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement