స్కూల్ బస్సు, వ్యాన్ ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు | 3 injured critically in a school bus - van collisioned | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు, వ్యాన్ ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

Sep 16 2015 6:24 PM | Updated on Sep 15 2018 4:05 PM

ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో ఓ స్కూల్ బస్సును కోళ్ల వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఓ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో ఓ స్కూల్ బస్సును కోళ్ల వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఓ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు వెళుతుండగా, భద్రాచలం వైపు నుంచి కోళ్లతో వస్తున్న వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7వ తరగతి విద్యార్థి సాయివినేష్, ఎనిమిదో తరగతి విద్యార్థిని స్నేహ భావ్‌తోపాటు వ్యాన్ డ్రైవర్ సాయి (30)కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement