ప్రబలిన అతిసార | 25 injured from diarrhea in sc girls hostel | Sakshi
Sakshi News home page

ప్రబలిన అతిసార

Aug 3 2015 7:10 PM | Updated on Sep 15 2018 3:07 PM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అతిసార వ్యాధి ప్రబలింది.

25 మంది బాలికలకు అస్వస్థత
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో అక్కడ ఉండే 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం నుంచి నేటికే 25 మంది అస్వస్థతకు గురైతే.. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారికి అతిసార సోకినట్లు నిర్ధరించారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 10 మంది టాబ్లెట్లు, ఇంజక్షన్‌లు తీసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హాస్టల్‌లో ఆహారం, మంచినీరు కలుషితం కావటం వల్లే అతిసార వ్యాపించిందని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లోని 170 మందిలో 25 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది మిగతా వారిని ఇంటికి తీసుకు పోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement