వడదెబ్బతో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన బి.రాంబాయి (63), ఖమ్మం నగర శివారులోని ధంసలాపురం అగ్రహారం కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(36), రఘునాధపాలెం మండలం రేగులచెలకకు చెందిన కె.భాగమ్మ(60), నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంకు చెందిన చుక్కమ్మ(95), చింతకాని మండలం నాగులవంచకు చెందిన గంధం ఏసు(37), దమ్మపేటకు చెందిన అగ్గిరాములు(70), కొత్తగూడెం మండలం రామవరం ప్ర
ఖమ్మం/ నల్లగొండ/ వరంగల్ : వడదెబ్బతో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన బి.రాంబాయి (63), ఖమ్మం నగర శివారులోని ధంసలాపురం అగ్రహారం కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(36), రఘునాధపాలెం మండలం రేగులచెలకకు చెందిన కె.భాగమ్మ(60), నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంకు చెందిన చుక్కమ్మ(95), చింతకాని మండలం నాగులవంచకు చెందిన గంధం ఏసు(37), దమ్మపేటకు చెందిన అగ్గిరాములు(70), కొత్తగూడెం మండలం రామవరం ప్రాంతానికి చెందిన మణికంట భద్రమ్మ (50) శనివారం వడదెబ్బతో మృతి చెందారు.
అలాగే, నల్లగొండ జిల్లా నారాయణపురానికి చెందిన బూర నాగమణి(55), చిల్లేపల్లికి చెందిన బండా ఈశ్వరమ్మ(52), చల్లూరు చెందిన అయిలయ్య(55), మిర్యాలగూడకు చెందిన పార్వతమ్మ(65), వల్లాపురంనకు చెందిన తిరపమ్మ(70), కాప్రయపల్లికి చెందిన మందడి నర్సిరెడ్డి(48), పగిడిమర్రికి చెందిన సుంకిరెడ్డి చంద్రారెడ్డి(62), వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన ఇడ్లీ బండి కార్మికుడు బొల్లం దేవేందర్(30), పుప్పాలగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ ప్రవీణ్ కుమార్(35) కూడా మృతి చెందినవారిలో ఉన్నారు. కాగా, సీమాంధ్ర జిల్లాల్లో కూడా వడదెబ్బకు 22మంది మృతి చెందారు.