మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్తీకల్లు బారినపడి 14 మంది అస్వస్థతకు గురయ్యారు.
మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్తీకల్లు బారినపడి 14 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని దోబీ గల్లీకి చెందిన కొందరు మంగళవారం కల్తీకల్లు సేవించారు. అనంతరం ఆరుగురు అస్వస్థతతో ఏరియా ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం వరకు మరో ఎనిమిది మంది అస్వస్థతతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించారు. దీంతో ఎకై్సజ్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.