12 మంది బాలకార్మికులకు విముక్తి | 12 child labor freed | Sakshi
Sakshi News home page

12 మంది బాలకార్మికులకు విముక్తి

Jan 25 2016 5:50 PM | Updated on Mar 28 2018 11:26 AM

వివిధ పనులు చేస్తున్న బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు.


వివిధ పనులు చేస్తున్న బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ స్మైల్‌ల్లో భాగంగా ఎస్‌ఐ ఖలీల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పలు దుకాణాలతో పాటు పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.హోటల్‌తో పాటు అక్కడక్కడ చెత్త సేకరిస్తున్న బాలికాలను కూడా గుర్తించారు. మొత్తం 12 మంది బాలకార్మికులను గుర్తించి వారిని తాండూరు ఎమ్మార్సీ కార్యాలయంలో ఏంఈఓ శివకుమార్‌కు అప్పగించారు.
వీరిలో 8 మంది బాలురు, 4గురు బాలికలు ఉన్నారని చెప్పారు. పట్టుబడిన బాలల్లో సగం మంది మధ్యలో బడి మానేసిన వారేన ని గుర్తించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు ఏంఈఓ శివకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామి ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement