సీటు కోసం బస్సులో రచ్చ చేసిన మహిళ | Woman Fight For Seat In RTC Bus | Sakshi
Sakshi News home page

సీటు కోసం బస్సులో రచ్చ చేసిన మహిళ

Apr 22 2026 10:54 AM | Updated on Apr 22 2026 12:53 PM

Woman Fight For Seat In RTC Bus

ధారూరు: హైదరాబాద్‌–తాండూర్‌ ప్రయాణిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్‌లో మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ గొడవ ధారూరు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బస్సు వికారాబాద్‌కు చేరుకోగా ధారూరు మండల పరిధిలోని అల్లిపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు. కాగా బస్సులో తాండూర్‌కు వెళుతున్న ఓ ప్రయాణికురాలితో పంచాయితీ ఏర్పడింది. 

సీటులో చిన్న పిల్లను తీసుకుని సీటు ఇవ్వాలని అల్లిపూర్‌ మహిళలు కోరారు. ఇందుకు ఆమె నేను ఇవ్వనంటూ గొడవపడింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో డ్రైవర్‌ నేరుగా బస్సును ధారూరు ఠాణాకు తీసుకెళ్లారు. బస్సు ఆపగానే తాండూర్‌కు చెందిన మహిళ బస్సులోంచి కిందకు దిగి పరుగుపెట్టింది. దీంతో పోలీసులు అల్లిపూర్‌ మహిళలకు సర్దిచెప్పి పంపించారు. గొడవ సద్దుమణగడంతో బస్సు తాండూర్‌కు వెళ్లింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement