కారు ఢీకొని 10నెలల బాలుడు మృతి | 10 months old boy dies in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని 10నెలల బాలుడు మృతి

Jul 27 2015 7:02 PM | Updated on Sep 28 2018 3:41 PM

కారు ఢీకొని 10నెలల బాలుడు మృతి - Sakshi

కారు ఢీకొని 10నెలల బాలుడు మృతి

వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో 10 నెలల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

అశోక్‌నగర్ (హైదరాబాద్) : వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో 10 నెలల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోడలు స్నేహ ఆదివారం సాయంత్రం నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడు నవదీప్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో అశోక్‌నగర్‌కు చెందిన నాగమణి కుమారుడు నవదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో స్నేహ చికిత్స చేయించింది. అయితే బాలుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు స్నేహను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement