చాదర్‌ఘాట్ పరిధిలో ద్విచక్రవాహనం వెళ్తున్న వ్యక్తి మెట్రో బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న క్రేన్‌ను ఢీకొనటంతో అవినాష్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ : చాదర్‌ఘాట్ పరిధిలో ద్విచక్రవాహనం వెళ్తున్న వ్యక్తి మెట్రో బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న క్రేన్‌ను ఢీకొనటంతో అవినాష్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మెట్రోక్రేన్ అక్కడ ఉన్నట్లు ఎలాంటి సైన్‌బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.