ఆదిలాబాద్ జిల్లా ఖాసీపేట మండలం దేవాపూర్ గ్రామంలోని ఓరియెంట్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది.
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
Dec 25 2015 12:31 PM | Updated on Apr 3 2019 7:53 PM
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా ఖాసీపేట మండలం దేవాపూర్ గ్రామంలోని ఓరియెంట్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం కోల్ వాషరీ ప్రదేశం వద్ద కార్మికులు పనిచేస్తుండగా... ప్రమాదవశాత్తూ కిందపడి కొమరయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కంపెనీకి సంబంధించిన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిహారం చెల్లించాలంటూ మృతుడు కొమరయ్య కుటుంబ సభ్యులు కంపెనీ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement