breaking news
-
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్‌సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్‌రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్‌రావు హెచ్చరికలు జారీ చేశారు. -
కొత్త తరానికి చేరువవుదాం! : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది. టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు. బనకచర్లతో జరిగే నష్టంపై.. నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు. దృష్టి మళ్లించేందుకే విచారణలు ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్‌కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.BRS welcomes the decision of the Honorable Supreme Court and we thank the Honorable CJI for ensuring that the democratic structure of this country isn't eroded by malicious methodsI hope @rahulgandhi who in his Panch Nyay advocated for stronger anti-defection laws and automatic…— KTR (@KTRBRS) July 31, 2025పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు. -
రాహుల్, ప్రియాంక వయనాడ్‌లో పుట్టి పెరిగారా?
కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ మొదలైంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెంచడం.. స్థానికుడికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడం.. గతంలో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్‌కే టికెట్ దాదాపు ఖాయమనే సంకేతాలు అందిస్తోంది. ఈ తరుణంలో మరో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారాయన. ‘‘సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు’’... అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్‌తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి(హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్‌కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్‌లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కూడా టికెట్‌ను పార్టీ లోకల్ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ల పేర్లు కాంగ్రెస్ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిశారు. కేబినెట్లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్‌ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు సీఎం రేవంత్‌తో చర్చిస్తున్నారు.బీఆర్ఎస్ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.ఇదీ చదవండి: హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం -
‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’
ఖమ్మం: దేశం కోసం, రైతుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డా కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, జూలై 29) ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. ‘ బీజేపీలో చేరేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. నాతో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉనికిని కోల్పోతుంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూనే ముస్లింలకు 10 శాతం ఇవ్వడం న్యాయం కాదు. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగని మేము ముస్లిలకు వ్యతిరేకం కాదు. ఓబీసీ ద్వారా 10 శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఉంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. రాష్ట్రంలో రైతు బంధు అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెరమీదకు రైతు బంద్‌ను తీసుకొచ్చారు. ఖమ్మం మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మనలో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలి. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’ అని రాంచందర్ రావు జోస్యం చెప్పారు. -
నన్ను బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చు: రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని.. కాబట్టి మూడేళ్లు ఎమ్మెల్యే తానేనని అంటున్నారాయన. మంగళవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడుతూ..నేను పార్టీకి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. గోషామహల్లో ఉప ఎన్నిక రాదు. కాబట్టి నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు అని అన్నారాయన. అలాగే.. పార్టీ పరిణామాలపైనా ఆయన స్పందించారు. మా పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. నా తప్పులు కూడా ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. మోదీ, అమిత్ షా ఫోన్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.అలాగే మీడియా లీకులు ఇస్తున్నారని మా వాళ్లే ఢిల్లీకి పిర్యాదు చేశారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాకు ఆమోదం తెలిపారు. బీజేపీ నా ఇల్లు. రాజాసింగ్ రా అంటే మళ్లీ వెళ్తా’’ అని రాజాసింగ్ అన్నారు. అంతకుముందు.. తాను తిరిగి బీజేపీ చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ వచ్చిన ప్రచారాన్ని సోమవారం ఆయన ఖండించారు. నా రాజీనామా వెనుక ఏ కుట్రా లేదు. ఎవరితో పార్టీకి నష్టం జరిగిందో అధిష్ఠానానికి చెప్పాలనుకున్నా. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా నాకు ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసేంత పెద్దవాడిని నేను కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాంటే ఒక ఫైటర్ కావాలి అని రాజాసింగ్ అన్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ జూన్ 30వ తేదీన రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
జూబ్లీహిల్స్ టికెట్.. బయటివాళ్లకు ఇవ్వబోం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్‌కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం అన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పని చేసిన వాళ్లకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయటి నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదు అని అన్నారాయన. జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆరు నెలల లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, 2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో విడుదలై.. అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంతదాకా అభ్యర్థులను ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సతీమణి సునీత పేరు గతకొంతకాలంగా ప్రచారంలో వినిపిస్తోంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే.. పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజహారుద్దీన్ పోటీ చేసి ఓడారు. అయితే ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారాయన. హస్తం పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్నందున స్వతంత్రంగా పోటీ చేయడమా? లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందా? అనే దానిపై ఎంఐఎం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
‘లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేస్తాం’
హైదరాబాద్: చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోదీనేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోదీనేనని ఆయన తెలిపారు. ఈరోజు(సోమవారం, జూలై 28) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశారు.. కానీ నివేదిక బయటపెట్టలేదు, తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారు. కేసీఆర్ కూడా 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారు. కానీ ఆయన 38 శాతం ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారు. ఇక కాంగ్రెస్ కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు. ఎలా పూర్తి చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం. 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని రాంచందర్ రావు విమర్శించారు. -
‘డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. సీఎంపై సిట్‌కు ఫిర్యాదు చేశా’
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన. -
ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ చెప్పారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళితే తప్పు ఏంటి? మమ్మల్ని ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని..మేం ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ మాతో చెప్పారు’ అని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నీ జీవితకాలంలో ఎక్కువ రోజులు.. చంద్రబాబు ఇంట్లో, ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజీ తీద్దాం పదా.. నువ్వు, నీ తమ్ముడు ఎన్ని రోజులు తుగ్లక్ రోడ్‌లోని నివాసంలో ఉన్నారో చూద్దాం’ అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.ఆదివారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడా రు. ‘రేవంత్‌రెడ్డి మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గోబెల్స్‌ను మించిపోయారు. జైపాల్‌రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి..నాడు నోట్ల కట్టలతో దొరికినట్టు..నేడు బనకచర్ల విషయంలో దొరికిపోయారు. రేవంత్‌రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ, ఆయనన్ను ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఎవరెవరు రెచి్చపోతున్నారో వాళ్ల సంగతి మేం చూసుకుంటాం’అని జగదీశ్‌రెడ్డి అన్నారు.‘పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు..బీజేపీ భావజాలం వేరు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడు తున్న రేవంత్‌రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తున్న వారు రేవంత్‌రెడ్డి పరువు తీస్తున్నారు. సహచర మంత్రులంటే భయంతోనే సీఎం వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అందుకే ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు’అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. -
‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’
వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్ఎస్ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. -
అందుకే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్‌ని కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్‌పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, అనకాపల్లి: ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీ యం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచి్చంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికిమాలిన కథలు చెబుతున్నారని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టును అనుకున్న వారికి కట్టబెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేశ్‌కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్లు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఏ పారీ్టలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే రూ.10 వేల కోట్ల హెచ్‌సీయూ భూముల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధం’అని కేటీఆర్ ప్రకటించారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ అంతకుముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025 -
వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయంటూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం అని.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.కాళేశ్వరం నిర్మించి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాలంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని.. గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది.. నా చెంచాగాడు రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ ట్యాపింగ్‌లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
‘కాంగ్రెస్ కులగణన బూటకం’
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చేపట్టిన కులగణన బూటకమని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది బీసీలను మోసం చేయటమేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారాయన. ఈ రోజు(శనివారం, జూలై 26) మహబూబ్‌నగర్‌లో పర్యటించిన రాంచందర్‌రావు.. గతంలో ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పాలమూరు నుంచి ఇంకా వలసలు తగ్గడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదని మండిపడ్డారు,. రేవంత్‌రెడ్డికి ఢిల్లీ తిరగటమే సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు. భవిష్యతఖ్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీనే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. -
ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్ఎస్ కేడర్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్‌ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్‌ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్‌లు పార్టీ కేడర్‌లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు. -
సీఎం రేవంత్‌కు గోబెల్స్ లేదా భాస్కర్ అవార్డు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నోబెల్స్ స్థానంలో గోబెల్స్..ఆస్కార్‌కు బదులు భాస్కర్ అవార్డుకు సిఫార్సు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల, ఇతర అంశాలపై ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని..ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలంటున్న రేవంత్‌రెడ్డి..ముందు తన సీఎం పదవిలో బీసీ నేతలైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ లేదా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూర్చోబెట్టాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీకి బీసీల మద్దతుగా మెండుగా ఉండటంతో దానిని దూరం చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి అనేక రకాలుగా పార్టీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సివిల్, క్రిమినల్ చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు. కాళేశ్వరం అవినీతిలో ఒక అధికారి దగ్గరే రూ.150 కోట్లు దొరికాయని, అయితే ఇందులో రాజకీయ నేతలను మాత్రం టచ్ చేయలేదని చెప్పారు. ఇక వారి దగ్గర ఎంత పెద్ద మొత్తం ఉందో అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా అనేక అంశాలపై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు రాష్ట్రంలో పార్టీ సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నదని, అందుకు తగ్గట్టుగానే ప్రజల ఆదరణ పెరుగుతున్నందున వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని రాంచందర్‌రావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై నెపాన్ని పెట్టి తప్పించుకోకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నుంచి బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు పార్టీలో తీవ్రపోటీ నెలకొందన్నారు. రాష్ట్ర పార్టీలోనూ సంస్థాగత పదవుల కోసం పోటీ ఉందని, అయితే కమిటీలో 20 మందికే అవకాశం ఉంటుందని, మొత్తం పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. హైడ్రా అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమమని, పేదల ఇళ్లు కూల్చినట్టే ఈ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందన్నారు. తాను కూడా బీసీనన్న (బ్రాహ్మిణ్ కమ్యూనిటీ) వ్యాఖ్యతో రామచందర్‌రావు మీడియా ప్రతినిధుల్లో నవ్వులు పూయించారు. -
హెచ్‌సీయూ భూముల్లో సీఎంకు కమీషన్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం, తాకట్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కమీషన్లు ఇప్పించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా (క్విడ్ ప్రో కో) కింద రూ. 1,600 కోట్ల విలువ చేసే ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును ఆయనకు సీఎం అప్పగించారన్నారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రూ. వందల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్‌కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో తెలంగాణ రా్రïÙ్టయ విద్యార్థి సేన పరిషత్ కేటీఆర్ సమక్షంలో విలీనమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతోందని మండిపడ్డారు. లేఖను చదవలేని రేవంత్‌కు దొంగ డిగ్రీ ఉందేమో? ‘సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్‌రెడ్డిని చూస్తే జాలేస్తోంది. సీఎం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసిపోతున్నాడు. సోనియా లేఖను కూడా చదివే తెలివి రేవంత్‌రెడ్డికి లేదు. లెటర్‌ను కూడా చదవలేని రేవంత్‌రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని అనుమానం వస్తోంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఆఫర్ లెటర్లతో గప్పాలు ‘ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వని రేవంత్‌రెడ్డి.. ఆఫ ర్ లెటర్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు. చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన పోరాటాలు, అమరవీరుల బలిదానాలను ప్రజలు చెప్పుకుంటారు. నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు మోసపూరిత హామీలు ఇచ్చి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో ఆరోపణ మాపై చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఓటు తూటాతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి లింగంపేట ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే తూటాతో బీఆర్ఎస్ను గెలిపించుకుంటే అహంకారంతో విర్రవీగుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయనకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు బుద్ధి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘పాలన చేతగాక రాష్ట్రాన్ని తెర్లు జేసిండ్రు. గురుకులాల్లో నూరు మంది పోరగాండ్లు చనిపోయిండ్రు. అందాల భామలకు లక్ష రూపాయల భోజనం పెట్టిన ప్రభుత్వానికి.. పిల్లలకు వంద రూపాయల భోజనం పెట్టడానికి చేతులు రావడం లేదు.మీదికెల్లి బలుపు మాటలు.. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు తూటానే సరైన సమాధానం’అని కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన సభలో లింగంపేటకు చెందిన దళిత నేత ముదాం సాయిలును సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లింగంపేటలో అంబేడ్కర్ జయంతి రోజున అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దళిత నేత ముదాం సాయిలు బట్టలూడదీశారన్నారు. కానీ తాము అదే అంబేడ్కర్ సాక్షిగా సాయిలును గౌరవించామన్నారు.అంబేడ్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 125 అడుగులతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమేనన్నారు. కాగా, కేసీఆర్ దెబ్బతో తెలంగాణను వదిలివెళ్లిన చంద్రబాబు మళ్లీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలని కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ‘బనకచర్ల’పై ఢిల్లీలో సమావేశానికి వెళ్లబోనన్న ముఖ్మమంత్రి రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు పిలవగానే ఉరికి సంతకం పెట్టి గోదావరి నీళ్లను రాసిచ్చారని దుయ్యబట్టారు. -
అదో పనికిరాని సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పనికి రానిదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో డొంకతిరుగుడు ప్రచారంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలు బీసీలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధమైనవి కాకుండా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా చేసినట్టు తాము దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణన ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి, భవిష్యత్‌లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి వారికోసమే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ హేళన చేయడాన్ని ఆక్షేపించారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.1972లో లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా అంటూ ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.వేరేవారికి నీతులు చెప్పే రేవంత్‌రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని, మెట్రోకు వందశాతం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలన్న డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు.