
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయంటూ.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం అని.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
కాళేశ్వరం నిర్మించి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాలంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని.. గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది.. నా చెంచాగాడు రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ ట్యాపింగ్‌లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.