
వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం.
ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్‌ఎస్ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.