
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చేపట్టిన కులగణన బూటకమని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది బీసీలను మోసం చేయటమేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారాయన. ఈ రోజు(శనివారం, జూలై 26) మహబూబ్‌నగర్‌లో పర్యటించిన రాంచందర్‌రావు.. గతంలో ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
పాలమూరు నుంచి ఇంకా వలసలు తగ్గడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదని మండిపడ్డారు,. రేవంత్‌రెడ్డికి ఢిల్లీ తిరగటమే సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు. భవిష్యతఖ్‌లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీనే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు.