breaking news
-
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలోలాగా తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీంతో ఎన్నికలకు ముందు కేవలం 28వ తేదీనే రైతుబంధు సొమ్ము పంపిణీకి వీలుంది. విడతలవారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో ఒకేరోజు రైతుబంధు సొమ్ము రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
బీజేపీకి మిగతా పార్టీకి ఉన్న తేడా అదే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటూనే ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఇక, ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురబోతుందని గట్టిగానే సౌండ్ వినిపించారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో సైతం బీజేపీ.. తెలంగాణ ప్రజలకు కీలక హామీలను సైతం ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ నేతల నుంచి స్థానిక నేతల వరకు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు.. జోడు పదవులకు న్యాయం జరుగుతోందా? ►నేను పదవిలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం, జాతీయ స్థాయితో సమన్వయంతో కేడర్ స్థాయిలో కార్యకర్తగా నేను పూర్తి స్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ►ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు ధీటుగానే బీజేపీ బలంగా ఉంది. మాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ మా దగ్గర ఉంది. కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కా? ►రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడి అయిన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండు సార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలు. ఎక్కడ కూడా బీఆర్ఎస్కు తగ్గలేదు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లీస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీలో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లీస్ వంటి పార్టీతో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? ►కర్టాటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? ►నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్థత ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే నేను పోటీలో లేను. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. క్లారిటీ కోసమే నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మేనిఫెస్టోలపై స్పందనేంటి? ►బీజేపీ బాధ్యత కలిగిన పార్టీ. మేము ఓట్ల కోసం ఎన్నికల్లో హామీ ఇవ్వం. మాట ఇచ్చాక కష్టమైనా, సుఖమైనా ఆ మాట కోసం నిలబడతాం. ఉదాహరణకు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసిన ఘనత మాది. దీంతో, మోదీ పట్ల ముస్లింల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ►ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింల్లో కొందరికి బీసీ-డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తునామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. కర్ణాటకలో గతంలో పరిపాలనలో ఉన్నారు.. అక్కడ అన్న, అక్షర, ఆదాయ, అభివృద్ధి, అభయ అనే ఒక కాంక్రీట్ ఎజెండా ఏదైతే ఉందో,, అది తెలంగాణలో పెట్టడంలో కొంచెం వెనుకబడ్డారా? ►మేము తెలంగాణలో కచ్చితంగా ఏదైతే అమలు చేయగలమో అదే చేస్తున్నాం.. ఓట్ల కోసం పోటీ పడి ప్రజలను మభ్య పెట్టి, ప్రజలను మోసం చేసి ఆచరణ సాధ్యంకానటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.. ఆ రకంగా మేము ఇవ్వం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏదైతే చేయాలో అదే చేస్తున్నాం. ఏ రకమైన హామీలు ఇచ్చినా కూడా ప్రొడెక్టివిటీ అనేది ఉండాలి. వెల్పేర్ యాక్టివిటీలో ప్రొడెక్టివిటీ ఉండాలి.. డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రొడెక్టివిటీ ఉండాలి. స్టేట్ ఇంట్రెస్ట్‌లో కూడా ప్రొడెక్టివిటీ ఉండాలి. దాని ఆధారంగానే మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించాం. అది వ్యవయసాయ రంగం కావొచ్చు.. వెల్ఫెర్ రంగం కావొచ్చు.. నిరుద్యోగ యువతకు సంబంధించింది కావొచ్చు.. అర్బన్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించినది కావొచ్చు. కరెప్షన్ కావొచ్చు.. ఇతర సామాజిక అంశాలు కావొచ్చు.. ఇతర అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మాయొక్క సమగ్రమైనటువంటి ఎన్నికల ప్రణాళిక రూపొందించాం..భారతీయ రియలిస్టిక్ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక్క భారతీయ జనతాపార్టీదే. గట్టిగా మీరు చెబుతున్నారు.. బీజేపీ అధికారంలోకి వస్తుందని, కొంతమంది హంగ్ వస్తే బీజేపీ కింగ్ మేకర్ రోల్ పోషిస్తుందని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.. కిషన్‌రెడ్డి గారి మద్దతు ఎవరికి ఉంటుంది? ►నా మద్దతు పార్టీకి ఉంటుంది(నవ్వుతూ), ప్రజాస్వామ్య పద్దతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్ధుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యానాథ్‌ను కూడా తర్వాతే ఎంపిక చేశాం.. ముందుగా సీఎం అభ్యర్ధి ఎవరు అనేది నిర్ణయించలేదు. ఆయన చాలా అద్భుతమైన పరిపాలన చేశారు. ముందు ఆయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతీ విషయంలోనే ముద్రవేశారు.. కరెప్షన్ కావొచ్చు.. లా అండ్ ఆర్డర్ విషయం కావొచ్చు అడ్మినిస్ట్రేషన్ కావొచ్చు. మొత్తంగా యూపీ ముఖ చిత్రాన్నే మార్చి వేశారు. 75 ఏళ్లలో మారని యూపీ ముఖచిత్రాన్ని ఆయన ఈ ఐదేళ్లలో మార్చేశారు. యూపీకి మొదటిసారి ఇన్వెస్టిమెంట్స్ వస్తున్నాయి.. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి చూస్తే యూపీకి ఇన్వెస్టిమెంట్స్ రాలేదు. ఆదిత్యానాథ్ సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితి మారింది. మొత్తం అక్కడ మాపియా రాజ్యం ఉంటుంది. అనేక రకాల గ్యాంగ్‌లు ఉండేవి. అటువంటి యూపీని మొత్తంగా మార్చారు. కాబట్టి ఏ ముఖ్యమంత్రిని భారతీయ జనతాపార్టీ ఇచ్చినా కూడా అది ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి ఉంటాడు. రాజశేఖర్‌రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా నేను వారికి దగ్గరకు వెళ్లేవాడిని. ప్రజా సంఘాలను తీసుకుని రిప్రంజటేషన్ ఇవ్వడానికి వెళ్లేవాళ్లం.. అలా అక్కడా అనేక సంఘాలతో కలిసే వాళ్లం. మరి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రితో ఎవరైనా కలుస్తారా? మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు.. ఒకటి యోగి ఆదిత్యానాథ్, మోదీ పేర్లు చెవులు బ్రద్ధలు అయ్యేలా వినబడతాయి..మరి తెలంగాణలో కిషన్‌రెడ్డిగారి పేరు ఎందుకు వినబడదు.. మీరు కేంద్రమంత్రిగా ఉన్నారు కాదనడం లేదు.. కానీ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి? ►ఎవరు పని వాళ్లు చేస్తాం మేము. నేను ఇక్కడకు వచ్చి సుమారు మూడు నెలలు అవుతోంది. డెడికేషన్తోటి పని చేస్తున్నాను. ఎందుకంటే దేశం కోసం పని చేయడానికి అందరికీ అవకాశం రాదు. అదృష్టవశాత్తూ నాకు అవకాశం ఇచ్చారు. నేను వెళ్లిన సమయంలోనే అనేక సమస్యలు.. రామజన్మభూమి సమస్య, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆర్టికల్ 370 తర్వాత నన్ను జమ్మూకశ్మీర్‌లో పరిశీలకుడిగా వేశారు. దాంతో ఎక్కువ సమయంలో అక్కడే ఉన్నాను.. ఎల్లప్పుడూ ఎమ్మెల్యేలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను.. కానీ అక్కడ కూడా చేయాల్సి రావడంతో కాస్త ఎక్కువ సమయం అక్కడ ఇచ్చాననే మాట వాస్తవమే. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి రీజినల్‌గా ఈ అంశాలన్నీ కూడా దేశానికి సంబంధించినవి,, రాష్ట్రాలకి సంబంధించినవి కాదు అనే నెరిటివ్ బిల్డ్ అవుతున్న క్రమం,ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మోదీగారిని బలపరుస్తున్నారు కదా.. ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? ►మేము ఎక్కడా ఫెయిల్యూర్ కాదు.. అసలు తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పార్టీ ఏది అని అడుగుతున్నాను. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎక్కడైనా పోరాటం చేశారా?, మేము అనేక రకాల సమస్యల మీద పోరాటం చేశాము. నేను వచ్చిన రెండు మూడునెలల్లోనే నేను కూడా పోరాటం చేశాను. మేము చేస్తున్నది ప్రజల్లోకి తీసుకువెళ్లడం కాస్త వైఫల్యం చెందాము. ఎందుకంటే మాకు మీడియా సపోర్ట్ లేదు. మరి కాంగ్రెస్ ఏం చేసిందని ఇంత పాపులారిటీ వస్తుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పండి.. అన్ని వైఫల్యాలే.. టీఆర్ఎస్తో కలిసిన పార్టీనే కాంగ్రెస్. కేంద్రంలో ఫ్రంట్ వస్తే నేను చేరతానని కేటీఆర్ స్వయంగా చెప్పాడు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేసిందనే సాధారణ ఓటర్‌కు వచ్చే ప్రశ్న? ►అన్ని రకాలుగా చేశాం . తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏం చేయలేదో చెప్పండి.. అన్ని రకాలుగా చేశాం. టీఆర్ఎస్ పార్టీ ఒక వితండ వాదము.. మొండి వాదము. బట్టకాల్చి ముఖం మీద వేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుటుంబం అబద్ధాలకు మారుపేరు. మాటల గారడీకి మారుపేరు. ప్రజల్ని మభ్యపెట్టడంలో వారిని మించిన ఘనుడు లేడు. ఒకటి మాత్రం చెబుతున్నాను.. ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సమయానికి ఇదే టీఆర్ఎస్-కాంగ్రెస్‌లు ఒక్కటవుతాయి. ఎవరు వద్దన్నా కాకున్నా వాళ్లు ఒక్కటే.. వారి డీఎన్ఏ ఒక్కటే.. ఒకే కవల పిల్లలు వాళ్లు.. నరేంద్ర మోదీని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలవబోతున్నానను అని కేసీఆర్ చెబుతాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవును.. మేము నరేంద్ర మోదీని గద్దె దించడం కోసం కలుస్తున్నాం అని చెబుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశాన్ని ఉద్దరించడం కోసం, దేశాన్ని దోచుకోవడం కోసం, కుటుంబ పాలనను మళ్లీ తెలంగాణ ప్రజలపై రుద్దడం కోసం టీఆర్ఎస్తో కలుస్తున్నాం అని చెబుతారు.. మీడియా సపోర్ట్ చేయడం లేదని చెబుతున్న మీరు.. నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో ఉందంటున్నారు.. మరి అది ఏరకంగా అవుతుంది? ►నిశ్శబ్ద విప్లవం అనేది సోషల్ మీడియా ద్వారా వచ్చింది.. ఈరోజు యూత్ టీవీలు చూసే పరిస్థితి లేదు. పేపర్లు చదివే పరిస్థితి అంతకన్నా లేదు. మేము రోడ్ల మీద పాదయాత్ర చేస్తుంటే వాళ్ల వాళ్ల ఒరండాల మీద యూత్ కూర్చుంటారు. మేము డబ్బులతో సందడి చేస్తూ ఊరేగింపుగా వెళ్లి ఇంటికి కరపత్రాలు ఇస్తే వాళ్ల నాన్ననో, అమ్మనో కరపత్రం తీసుకుంటారు.. కానీ ఇంటి ముందు కూర్చొన్న యూత్ చేతిలో సెల్‌ఫోన్ పెట్టుకునే కూర్చొంటాడు. ఊరేగింపుగా వచ్చారు.. ఎవరో వచ్చారు అని తలెత్తి పరిస్థితి లేదు ఈరోజు. కరపత్రం యూత్ ముందు పడేసినా తలతిప్పి కూడా చూడడు.. ఈ పరిస్థితికి కారణం ఏమంటారు? ►ఇది కేవలం తెలంగాణకో, దేశానికో పరిమితం కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉంది. చైతన్యం తీసుకురావాలి. దీంతో మంచి ఉంది చెడూ ఉంది. ఆయనకు నచ్చిన విషయాలు ఉంటే స్పందిస్తున్నాడు.. కామెంట్స్ చేస్తున్నాడు. గతంలో మీలాంటి వాళ్లు చెబితేనే ప్రజలకు తెలిసేది. ఇప్పుడు యువకుడు కూడా తనకున్న అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం సోషల్ మీడియా ద్వారా వచ్చింది. గతంలో ఈ అవకాశం లేదు. తెలంగాణ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? ►అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు కావడం అనే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది కదా.. అలాంటి పరిస్థితి వస్తే..? ►ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఒకవేళ బీజేపీకి సరిపడినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? ►బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది తెలంగాణలో ఏం మార్పు జరిగినా గట్టి సౌండ్ వస్తుందంటారు, అది విభజన కావచ్చు, ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కావచ్చు? ►అలాంటి పరిస్థితి లేదనుకుంటున్నాం గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. మేం కూడా అనుకోలేదు. కచ్చితంగా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్‌లో అసలు కాంగ్రెస్ పార్టీ అన్నదే లేదు. అలాగే బీఆర్ఎస్ మీద పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉంది. జిల్లాలనే చూసుకుంటే అదిలాబాదులో బీఆర్ఎస్ లేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ లేదు అదే సమయంలో బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్‌గా లేదు, పైగా బీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు జిల్లాల్లో బలముందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో ఉంది కానీ వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం.. మరికొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్తో పోరాడుతున్నాం. బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని కచ్చితమైన ధీమాతో ఉన్నాం. కొందరు బీజేపీకి ఒకటి రెండు సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ తలకిందులయ్యేలా మంచి ఫలితాలను పార్టీ సాధిస్తుంది. దేని ఆధారంగా చెబుతున్నారు? ►దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి కుటుంబాలను పట్టించుకునే పార్టీ లేదన్న ప్రచారం ఉంది? ►దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పేదల గురించి మధ్యతరగతి ప్రజల గురించి మాట్లాడుతుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ప్రత్యేకంగా EWS రిజర్వేషన్లను బిజెపి తెచ్చింది. మా పరిశీలనలో మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాయి. తమ ఆకాంక్షల కంటే దేశం గురించి ఆలోచిస్తారు. పైన ఉండే వాళ్లకు కింద ఉండే వాళ్లకు కొంత స్వార్థం ఉండొచ్చు కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం దేశం కోసమే ఆలోచిస్తారు. ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఒక కుటుంబం మోచేతి నీళ్లు తాగాలా? ఒక కుటుంబం కుటుంబానికి బానిసగా ఉండాలా? వాళ్ల పెత్తనానికి లోబడి ఉండాలా? మేము పోరాటం చేసింది ఇదేనా? మేం తెచ్చుకున్న తెలంగాణ ఒక తండ్రి కూతురు కొడుకు చేసే పెతనం కోసమేనా? అని ఆలోచిస్తున్నారు. ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎంత సంక్షేమం చేసినా ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు వంచించలేరు, ప్రజల హృదయాల్లో ఉన్న మేనిఫెస్టోను మార్చలేరు. ఒక ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తికి అద్భుతమైన బిల్డింగ్ కట్టించి పంచభక్ష పరమాన్నాలు పెట్టించి, అన్ని రకాలైన విలాసాలు చేకూర్చి ఒక కండిషన్ పెడితే... ఎలాంటి కండిషన్ అంటే బయటకు తీసుకొచ్చి ఒక చెప్పు దెబ్బ కొడతా అంటే ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి బీజేపీ ఎప్పుడూ ఒక మాట చెప్తుంది దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిడ్యువల్ లాస్ట్, ఇలాంటి విధానం వల్ల పార్టీని అభిమానించే వాళ్ళు కూడా కొందరు దూరం అవుతారు అన్న వాదన ఉంది? ►దేశం ఫస్ట్ అని అనుకున్న ఏ ఒక్కరు కూడా మా నుంచి దూరం కాలేరు మరి ఇన్నాళ్లు మీతో పని చేసిన వివేక్ కావచ్చు లేదా విజయశాంతి కావచ్చు లేదా ఇంకొందరు కావచ్చు ఎందుకు పార్టీకి దూరమయ్యారు? ►వివేక్ ఎప్పుడు వచ్చారు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు వచ్చారు? 8 నెలల కింద వచ్చారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిందో అప్పుడు వీళ్లంతా పార్టీని విడిచి వెళ్లిపోయారు. వాళ్లకు ఒక బీసీ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదేమో..! బీజేపీ ఉన్నది వ్యక్తుల కోసం కాదు దేశం కోసం, కొందరి అధికారం కోసం పార్టీ పనిచేయదు. బీజేపీ నుంచి నాయకులు వెళ్లిపోవచ్చు కానీ.. వారి వెంట ఏ ఒక్క కార్యకర్త కూడా వెళ్లిపోడు. అది బీజేపీకి ఉన్న విశ్వసనీయత. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వాళ్ళు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.. వాళ్లకు విలువలు లేకపోవచ్చు కానీ బీజేపీకి మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారందరికి ప్రజలే తమ ఓటుతో సమాధానమిస్తారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో రెండు సీట్లు ఉండేవి. ఇప్పుడు 300కు పైగా ఎంపీలు లోక్‌సభలో బీజేపీకి ఉన్నారు. తెలంగాణలో ఏమాత్రం ఉనికి లేని పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్తున్నారు అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? ►పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. 2014, 2018, 2021లలో జరిగిన అన్ని ఎన్నికల్లో మాతో పాటు ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ 72 చోట్ల నామినేషన్ వేసినా సరే మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత ఉపసంహరించుకుంది. 2018 అలాగే అంతకుముందు 2014లో కూడా బీజేపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఎప్పటినుంచో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మాతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. మా భాగస్వామ్య పార్టీని కలుపుకొని పోవాలన్న ఉద్దేశ్యమే తప్ప దీని వెనుక ఎలాంటి ఎజెండా మాకు లేదు బీఆర్ఎస్ లౌకిక రాజ్యం అంటున్నారు, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? దీంట్లో కూడా మతాన్ని ఆపాదిస్తున్నారు దీనిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? ►ఈ విషయంలో మా పార్టీ భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మేము హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీయా? వాళ్లేమో మరో మతం గురించి మాట్లాడితే సెక్యులర్ పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్ గా ఉంటుంది. హిందువులు మైనార్టీ లోకి వెళ్ళినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడదాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్ళకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. మతపరంగా పూలరైజేషన్ ఇలాగే కొనసాగుతుందా? ►ఎక్కడుందండి పోలరైజేషన్? మేం ప్రశ్నించే అంశాలేంటీ? రైతుల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నాం. కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నాం. మా ఎజెండాలో ఉన్న ఒక్క అంశం చెప్పండి మతపరంగా ఇలా చేస్తున్నామని..? కేరళ స్టోరీ అన్న ఎజెండా కర్ణాటకలో ఫ్లాప్ అయింది. తెలంగాణలో స్టోరీ మాత్రమే నెగ్గుతుందని విమర్శలు వస్తున్నాయి కదా.? ►తెలంగాణలో మేమేం స్టోరీ తీసుకొచ్చాం? ఒక కుటుంబ పాలన గురించి మాట్లాడటం తప్ప. మజ్లిస్ పార్టీతో మీరు స్నేహం చేసినప్పుడు రజాకార్ల గురించి మాట్లాడకుండా ఇంకేం మాట్లాడతాం? అసలు మజ్లిస్ పార్టీ పెట్టింది ఎవరు? స్థాపించింది ఎవరు? కాశీం రిజ్వీ ఎవరు? స్వాతంత్రం రాగానే పాకిస్తాన్ పారిపోయిన వ్యక్తి ఖాసీం రిజ్వీ. అతడి వారసత్వంగా మజ్లిస్ పార్టీ కొనసాగుతుంటే మేమెందుకు మాట్లాడకూడదు? కచ్చితంగా ప్రశ్నిస్తాం. చరిత్ర చెప్పిన సత్యం ఇది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణలో మాత్రం 13 నెలల పాటు కనీసం వందేమాతరం నినాదం చేయనివ్వకుండా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా.. నిజాం సైనికులు, రజాకార్లు తెలంగాణలోని పల్లెల మీద పడి వేలాది మందిని హత్యాకాండ కొనసాగించి, హింసకాండ కొనసాగించి, హిందూ స్త్రీలను వివస్త్రలను చేసి బతుకమ్మ లాడించి, సంపద దోచుకుని మేము పాకిస్తాన్ తో కలుస్తాం తప్ప భారత దేశంలో విలీనం కాబోమని చెప్పి సర్వసత్తాక దేశంగా ఉంటామని చెప్పుకున్న పార్టీ గురించి ప్రశ్నిస్తే తప్పేంటి? మళ్లీ మళ్లీ చెబుతున్నాం. మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లిం సోదరీమణులకు ఒక అన్నగా ఉంటూ వారి కోసం ట్రిపుల్ తలాక్ తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. మీరు ఒకసారి గ్రామాల్లో వెళ్లి ముస్లిం మహిళలని అడగండి. మెజార్టీ ముస్లిం మహిళలు బిజెపికి ఓటేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఆదరాభిమానాలను చూస్తున్నా. వరదల సమయంలో తెలంగాణ అతలాకుతలమైనప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ఎలాంటి సహాయం చేయలేదు? ఒక మెడికల్ కళాశాల కాదు కదా కనీసం నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బిజెపికి ఎలా ఓటేయాలని బీఆర్ఎస్ మిమ్మల్ని విమర్శిస్తోంది కదా? ►దేశవ్యాప్తంగా 1000 మెడికల్ కాలేజీలు పెట్టాలనుకుని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. మీకు కాలేజీలు ఎక్కడ అవసరం? ఏ జిల్లాలో పెట్టాలి? అన్న వివరాలు ఇవ్వమని అడిగాం. ఆ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న హర్షవర్ధన్ స్వయంగా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. కానీ మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారంటే.. కేంద్రానికి వంద లేఖలు రాసినా పట్టించుకోలేదని. ఇంత అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదు. ఒకవైపు సమయం గడిచిపోతుంది.. వివరాలు ఇవ్వమని హర్షవర్ధన్ లేఖ రాస్తే.. మీరు ఫామ్ హౌస్ లో నిద్రమత్తులో ఉండి పట్టించుకోలేదు. మీకు ఎన్ని సార్లు రిమైండ్ చేసినా పట్టించుకోకుండా తీరా ఎన్నికల సమయంలో నేను 100 ఉత్తరాలు రాసానండి చెబితే ప్రజలు నమ్ముతారా? చూపించండి.? మీరు రాసిన ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయో? తెలంగాణకు కేంద్రం నిధులెందుకివ్వలేదు..? ►తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధంగా ఉన్నా. కేంద్రం ఇవ్వకపోతే వీళ్లు దుబాయ్ నుంచి డబ్బు తెచ్చారా. మజ్లిస్ పార్టీ ఆఫీస్ నుంచి తెచ్చారా. విద్యుత్ మీటర్ల విషయంలో 40 వేల కోట్లు ఆపారట? ►ఏమీ ఆపలేదు. కరెంటు దొంగతనం మొత్తం రైతులమీద వేస్తున్నారు. ఇది అరికట్టేందుకు మీటర్లు పెట్టమన్నాం. కరెంటు దోపిడీ ఆపేందుకే మీటర్లు తెచ్చాం. నవోదయ స్కూళ్లు ఎందుకు ఇవ్వలేదు? జిల్లాలు ఇష్టం వచ్చినట్లు మార్చుకుని నవోదయ స్కూళ్లు ఇవ్వలేదంటే ఏం చెప్తాం. అయినా 17 నవోదయయ స్కూళ్లకు క్యాబినెట్ నోట్ రెడీ అయింది. త్వరలో ఇస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు రూ. 26 వేల కోట్లతో ఇచ్చాం. ఇప్పటికీ స్థల సేకరణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ట్రిపుల్ఆర్ తెలంగాణకు ప్రత్యేకంగా ఇస్తున్నాం. కేసీఆర్ బడ్జెట్లో పెట్టిన రూ.2 వేల కోట్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రో రెండో దశ ఎందుకివ్వలేదు? ►వీళ్లు మెట్రో మొదటి దశనే పూర్తిచేయలేదు. ఇక రెండో దశ ఎక్కడిది. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు. ఓల్డ్ సిటీలో రోడ్లు వేయరు. బీఆర్ఎస్ రియల్టర్లు వ్యాపారం చేసేచోటే ఫ్లై ఓవర్లు , రోడ్లు వేశారు. సీఎం ఇంటి వెనుకాల బోరబండలో రోడ్లు, డడ్రైనేజీల పరిస్థితేంటి.. రా కేటీఆర్ చెప్పు. హైదరాబాద్‌లో అక్కడక్కడా చేసిన అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కర్ణాటకలో మీపై కమీషన్ల అపవాదు ఎందుకు వచ్చింది ? ►సకల మోసాలకు కాంగ్రెస్ కారణం. అవినీతికి కాంగ్రెస్ కారణం. కాంగ్రెస్ మాటలకు విలువ లేదు. అక్కడ సరే. ఇక్కడ కమీషన్లు కాదు తెలంగాణలో ప్రభుత్వం ఏకంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి వాటాలు తీసుకుంటోంది. ఐటీఐఆర్ గుజరాత్‌కు తీసుకుపోయారట? ►ఎవడు చెప్పింది. ఐటీఐఆర్ మొత్తానికే రద్దయింది. కాంగ్రెస్ గ్యారెంటీలు ఉత్తవేనని మీరెందుకు ప్రచారం చేయడం లేదు? ►చేశాం. మాజీ సీఎం యడ్యురప్ప మొన్ననే ఇక్కడికి వచ్చి చెప్పారు. మా మేనిఫెస్టో ప్రొడక్టివిటీతో కూడిన మేనిఫెస్టో. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్తే మేం కూడా ఇంట్లో కూర్చొని గెలుస్తాం. దేశంలో బీజేపీ సీఎంలు ప్రజలను కలుస్తున్నారా ? ►ఎందుకు కలవడం లేదు. బీజేపీ సీఎంలకు ఫాంహౌజ్‌లు లేవు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశారు. విదేశాలకు వెళితే జెట్లాగ్ ఉంటుంది. అయినా ఆయన నేరుగా విమానం దిగి ఆఫీసుకు వచ్చి పనిచేస్తారు. చివరగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో సిద్దించిన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలన్నదే తమ టార్గెట్ అని చెప్పుకొచ్చారు. ఇక, బీజేపీ ధీమాపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఎన్నికల ఫలితాల్లో చూడాల్సి ఉంది. -
కరెంట్ కావాలా..కాంగ్రెస్ కావాలా: హరీశ్‌రావు
సాక్షి, నారాయణఖేడ్: బీఆర్ఎస్ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్ రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. కర్ణాటకలో 9 గంటలు ఉన్న కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 గంటలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లేటపుడు స్వాతంత్రం ఇచ్చిపోయారని, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బ్రిటీష్ వాళ్ల భిక్షేనన్నారు. ‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా తేల్చుకోండి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయింది. కరెంట్ బంద్ అయ్యింది. కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో కర్ఫ్యూ లేదు. 30 వ తేదీన కాంగ్రెస్ వాళ్ళకు దిమ్మ తిరగాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ,ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడతాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపెన్ అవుతాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో పెరిగిన టాక్స్‌లను తగిస్తాం. బీఆర్ఎస్ పవర్లోకి వస్తే తెల్లకార్డుపై సన్నబియ్యం ఇస్తాం’ అని హరీశ్‌రావు తెలిపారు. ఎల్లారెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటున్నాడు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఊదర గొట్టారు. ఇప్పుడు అక్కడ జనాలు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు మించి అక్కడ కరెంట్ రావటం లేదట. రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటార్ పెడితే 3 గంటల కరెంట్ చాలంటున్నాడు. 10 హెచ్‌పీ ఆయన తాత కొనిస్తాడ రైతులకు. కాంగ్రెస్ వాళ్లు రైతు బంధు కాపీ కొట్టిండ్రు. ఖర్గే కర్ణాటకలో నీ ఊళ్ళో మంచి నీళ్లు వస్తున్నయా? యువశక్తి కింద ఒక్క రూపాయి ఇస్తున్నవా? కబర్దార్ నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. ఇదీచదవండి..కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు -
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్‌నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్‌నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?: ప్రియాంక ఫైర్
సాక్షి, పాలకుర్తి: తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాకు వచ్చారు. ప్రచారంలో పాల్గొని ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోంది. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి. కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిపోయింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, హుస్నాబాద్ సభలో ప్రియాంక మాట్లాడుతూ..‘ప్రజలు కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా?. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఉద్యోం ఇచ్చారా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు. కానీ, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు. వారి కష్టం వృథా అయిపోతోంది. ఇలాంటి ప్రభుత్వం మరో ఐదేళ్లు కావాలా?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు అవినీతితో కురుకుపోయాయి’ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నాడు. అదానీ ఒక్క రోజ సంపద రూ.1600కోట్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీనే. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో 40-50 స్థానాల్లో పోటీచేస్తే తెలంగాణలో మాత్రం ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే తిడుతుంటారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీని గుర్తించాలి. అని అన్నారు. -
కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు
సాక్షి, నాగర్‌కర్నూలు: కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చి కొల్లాపూర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, సమాచారం ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై అతి దారుణంగా కొట్టారని వారు ఆరోపించారు. కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదన్‌ను ఎస్సై అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. పోలీసులు అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అంటూ ప్రశ్నించారు. -
కేసీఆర్ నీ టైం అయిపోయింది: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదు. పదేళ్లుగా తెలంగాణను నాశనం చేసింది. 2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని కేసీఆర్ మాటిచ్చి తప్పారు. కానీ, బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం కబ్జా చేసింది. పేపర్ లీకేజ్‌లతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. టేబుల్‌పైన ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే.. వాళ్లను మంత్రి వర్గంలో కేసీఆర్ చేర్చుకునేవారు. కేసీఆర్ నీ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది.. ..అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ కోసం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంది. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా?.. ..మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్ కట్టిస్తాం. ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెస్తాం. జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం అని షా ప్రకటించారు. ఆర్మూర్ సభ అనంతరం రాజేంద్ర నగర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు అమిత్ షా. సాయంత్రం అంబర్‌పేటలో రోడ్ షర్లో పాల్గొంటారు. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్‌కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
ఎన్నికల సిత్రం.. కారు ఇంజిన్‌లో డబ్బు తరలిస్తుండగా..
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు రూ.650 కోట్లకు పైగానే నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక, తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే, కారు ఇంజిన్ డబ్బులు తరలిస్తుండగా హీట్ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి.. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్ వద్ద) డబ్బులను అమర్చారు. అనంతరం, వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో, దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం, ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, కారులో ఉన్న డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ ఫక్కిలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారు ఎవరది? డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీ రవీందర్ తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్ఎస్ హాట్రిక్.. తేల్చిన మరో సర్వే -
హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘2014 లోనే తెలంగాణలో మార్పు వచ్చింది. కొవిడ్, ఎన్నికలు మినహా మిగతా ఆరున్నరెళ్ల పాలన ప్రజల ముందుంది. 65 ఏళ్లుపాటు గత సీఎంలు పాలించిన పనితీరుతో కేసీఆర్ పనితీరును గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ‘ప్రో రూరల్ ప్రో అర్బన్, ప్రో అగ్రికల్చర్ ప్రో బిజినెస్’ అనే పంథాపై కేసీఆర్ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనుమానాలు వీడి ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతులు పెరిగాయి. 2021-22 సంవత్సరానికిగాను ఐటీ ఎగుమతుల వల్ల రాష్ట్రానికి రూ.57వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ ఉత్పత్తులు పుంజుకున్నాయి. రాష్ట్ర సంపద హెచ్చయింది. 2014లో వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది. కానీ 2022లో 3.5 కోట్ల టన్నుల వరి పండించి మొదటిస్థానంలో ఉంది. టీఎస్ఐపాస్ ద్వారా 27వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. గతంలో క్రెడాయ్‌కు సంబంధించి కేసీఆర్ ఒకేరోజు ఏకంగా దాదాపు 6 జీవోలు విడుదల చేశారు. కానీ స్పష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అలాంటి అవకాశం ఉండదు’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో కేటీఆర్ వివరించారు. ‘100 శాతం అక్షరాస్యత, ‘అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాం. గతంలో హైదరాబాద్‌కు గుర్తుగా ఛార్మినార్ చూపించేవారు. కానీ ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకు క్రెడాయ్ ఎంతో సహకారం చేసింది. 2047 వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో పూర్తి సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యం ఉంది. 2040 వరకు పూర్తి గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌గా మార్చాలి. వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ ప్లాంట్లు పెంచాలి. వాహన, శబ్ద కాలుష్యం తగ్గించాలి. హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా ఉంచేందుకు కెమెరాల సంఖ్యను పెంచాలి. 24 గంటలు నీటివసతి కల్పించాలి. హైదరాబాద్‌లో రానున్న పదేళ్లలో 415 కిలోమీటర్లకు మెట్రో విస్తరించాలి. రాష్ట్రంలో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ తీసుకురానున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్‌కు కేవలం గంటలో చేరుకునే అవకాశం ఉంది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలుచేయనున్నాం. హైదరాబాద్ చుట్టూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలి. 2030 వరకు హైదరాబాద్‌ను ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతాం. శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలి. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలే రూపొందించాలి’ అని ఆయన వివరించారు. -
కాంగ్రెస్ వచ్చేది లేదు.. పోయేది లేదు: కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: ‘‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టా. 33 పార్టీలు తెలంగాణకు అండగా నిలిస్తే తెలంగాణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు’’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఓటేసే ముందు ఎవరు అభివృద్ధిని చేశారో అనేది పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలను కోరారాయన. శుక్రవారం మధ్యాహ్నాం మంచిర్యాల నస్పూర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదు. గోదావరి పక్కనే పారతున్నా కాంగ్రెస్ హయాంలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ వల్లే 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఏడిపించారు’’ అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టింది బీఆర్ఎస్. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు తెచ్చిందే బీఆర్ఎస్. కానీ, అది దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 3గంటలు కరెంట్ చాలని అంటున్నారు. అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర చూసి ఓటేయాలి. ఓటు మన నుదుటి రాత మారుస్తుంది’’ అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపిస్తే.... ఎన్నికలయ్యాక బీఆర్ఎస్లో చేరుతామని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారట.. కానీ అదంతా ఝూటా ముచ్చట (అబద్దం). తనను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతానని ఇక్కడ(మంచిర్యాల) నాయకుడు కూడా చెబుతున్నాడట.. నాకు వార్త వచ్చింది... కానీ అదేం లేదు అంతా అబద్దం. మీ వద్ద కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే మీ వాడకట్టుకో పేకాట క్లబ్ వస్తుంది. అప్పుడు మంచిర్యాల మొత్తం పేకాట క్లబ్బులు తయారవుతాయి. అప్పుడు ఇళ్లు అమ్ముకొని పేకాటలో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. అయిదేళ్ల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ఉండేవి. 1969లో కాంగ్రెస్ నాలుగు వందల మంది ఉద్యమకారులను కాల్చి చంపింది. మలి దశ ఉద్యమంలో బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచుతాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతుబంధు కూడా పెంచుతాం. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. సింగరేణిని లాభాల్లోకి తెచ్చాం ఓటు ప్రజల తలరాతల్ని మారుస్తుందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్ 3 నుండి అసలు దుకాణం ప్రారంభం అవుతుంది. తెలంగాణను, సింగరేణిని ముంచిందే కాంగ్రెస్. రూ. 600 కోట్ల మారిటోరియంలో ఉన్న సింగరేణిని రెండు వేల కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సింగరేణి సంస్థలు విస్తరించి బయ్యారం ఉక్కు గనులను అప్పగిస్తాం. ప్రత్యేక తెలంగాణలో మేధావులతో చర్చించి సంక్షేమ పథకాలు అమలు చేశాం. ధరణిని తెచ్చిందే బీఆర్ఎస్. ధరణిని కాంగ్రెస్ తీసేస్తామంటోంది. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా ఇస్తారు?. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగం ఆగం కావొద్దు. అభ్యర్థి గుణగణాలు.. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలి. ఓటు ప్రజల తలరాతలు మారుస్తుంది. ఇంకా అభివృద్ధి చేసుకుందాం ములుగు జిల్లా ములుగు కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వచ్చిన రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉండేవి. సమ్మక్క సారలమ్మ జాతరకు ఒకప్పుడు ఆదరణ లేదు. కనీసం రోడ్డు కూడా సరిగా వేయలేదు. అధికారంలోకి వచ్చాక రోడ్డు వేసుకున్నాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ యాభై ఏళ్ల పాలన బేరీజు వేసుకోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటేయాలి. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. రైతు బంధు వృథా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కాంగ్రెస్ యాభై ఏళ్లు దేశాన్ని, రాష్ట్రంను పాలించింది. కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కానీ, కాంగ్రెస్ వాళ్లు 24 గంటలు వృథా.. 3 గంటలు చాలని అంటున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్ రూ.200 రూపాయలు. మనం పెన్షన్ రూ.5 వేలకు పెంచుకుందాం. తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకుందాం’’ అని కేసీఆర్ అన్నారు. సీతక్కపై విమర్శలు ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఉద్దేశించి కేసీఆర్ విమర్శ చేశారు. ‘‘గత ఎన్నికల్లో మీరు(ములుగు ప్రజల్ని ఉద్దేశించి..) నన్ను(బీఆర్ఎస్) గెలిపించకున్నా నేను అలగలేదు. కానీ, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా.. ముఖ్యమంత్రిని కలవాలి. కానీ, మీ ఎమ్మెల్యే(సీతక్క) ఎప్పుడూ మా దగ్గరకు రాలేదు’’ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తానంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటోందని.. కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు ఉండేవని.. కాబట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు.. పోయేది లేదు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. -
తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ప్రజలు ఇది గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని లేఖలో కోరారాయన. ‘‘బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని మోదీ, కేసీఆర్‌లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో చేరినవాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఇది’’ అని లేఖలో పేర్కొన్నారయన. .. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి?. గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరారు రేవంత్. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది!. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది. కేసీఆర్‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. .. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! . పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు’’ అని రేవంత్‌రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్‌ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్‌కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
జంపింగ్ జపాంగ్స్.. లాభమెంత.. నష్టమెంత?
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని అంటారు. అలాగే ఏ నాయకుడు ఎలా పార్టీ మారవలసి వస్తుందో కూడా చెప్పలేం. రకరకాల పరిణామాలు ఇందుకు దోహదపడుతుంటాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే, ఈసారి జరిగినన్ని ఫిరాయింపులు గత రెండు ఎన్నికలలో జరగలేదని చెప్పాలి. అందులోను కొందరు పెద్ద నాయకులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు పార్టీలు మారవలసిన పరిస్థితులు ఏర్పడడం ఆసక్తికరమైన అంశమే. ఇందుకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అతీతం కాదు. ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా వేరే పార్టీలోకి వెళ్లారు. ✍️బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే 115 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి దాదాపు అందరికి బిఫారంలు ఇచ్చేశారు. దాంతో కొంత గడబిడ జరిగినా, సర్దుకోవడానికి టైమ్ దొరికింది. కాని కాంగ్రెస్, బీజేపీలు అలా చేయలేకపోయాయి. దాంతో ఆ పార్టీలు అసమ్మతులతో కొంత ఎక్కువ సతమతం అయ్యాయి. బుజ్జగింపులలో కాంగ్రెస్ కొంతవరకు సఫలం అయినా, బీజేపీ మాత్రం అంత సత్ఫలితం సాధించలేకపోయిందనే చెప్పాలి. తాజాగా మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడం విశేషం. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ప్రముఖుల గురించి చూద్దాం. ✍️సాధారణంగా పార్టీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఫిరాయించడం అరుదుగా జరుగుతుంటుంది. మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ టిక్కెట్ కోరుతూ పార్టీలో రగడ సృష్టించారు. అందుకోసం తన మల్కాజిగిరి టిక్కెట్ కూడా వదలుకుని, రెండు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌లో చేరడం సంచలనమే. టిక్కెట్లు రాని కొందరు నేతలు కూడా ఇలాగే పార్టీ మారారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లవలసి వస్తుందని ఆయన అనుచరులు ఎవరూ అనుకుని ఉండరు. ✍️ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ కన్నా ముందే మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా వెనుకబడ్డారు. ఆ తరుణంలో కేసీఆర్ ఆయనను ఆహ్వానించి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నికలో గెలిచారు కాని, సాధారణ ఎ న్నికలో ఓటమి చెందారు. దాంతో తుమ్మల రాజకీయం తిరగబడినట్లయింది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్లో కొనసాగేవారు. కాని అందుకు కేసీఆర్ సిద్దపడలేదు ✍️దానికి కారణం కాంగ్రెస్ పక్షాన గెలిచి, బీఆర్ఎస్లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డికి సీటు ఇవ్వవలసి రావడమే. దాంతో అసంతృప్తి చెందిన తుమ్మల పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీతో అయితే పోరాడారో ఆ పార్టీలోకే వెళ్లవలసి వచ్చింది. ఈ పిరాయింపుపై కేసీఆర్, తుమ్మల మధ్య మాటల విమర్శలు కూడా జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఈసారి పెద్ద పరీక్షే కావచ్చు. ✍️ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన తలపడుతున్నారు. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినా, మారిన రాజకీయాలలో ఆయన అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. కాని 2018 ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ రాలేదు. అయినా ఓపికగా ఈ ఐదేళ్లు వేచి చూశారు. కాని ఆశ్చర్యంగా ఈసారి అసెంబ్లీ టిక్కెట్ కూడా రాలేదు. ఇక లాభం లేదని కాంగ్రెస్‌తో బేరం ఆడుకుని జంప్ చేసేశారు. ఒకదశలో బీజేపీకి వెళతారని అనుకున్నా, ఖమ్మం ప్రాంతంలో ఆ పార్టీ పుంజుకోలేదని అంచనాకు వచ్చి కాంగ్రెస్ వైపు వెళ్లి పాలేరు నియోజకవర్గంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ✍️కొల్లాపూర్‌లో ఐదుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అప్పుడు గెలిచిన హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో కృష్ణారావుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆయన ఆగ్రహంతో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగాను, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగాను, అంతకుముందు కాంగ్రెస్‌లో కూడా ప్రముఖుడుగా రాణించిన జూపల్లె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని బీఆర్ఎస్ సవాల్‌కు సవాల్ విసురుతున్నారు. ✍️గతసారి కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, పైలల్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభృతులు ఉన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి రాక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన వారిలో పాయం వెంకటేశ్వర్లు, వేముల వీరేశం, వంటివారు ఉన్నారు. టిక్కెట్ రానందున అసంతృప్తి చెంది కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖులలో డాక్టర్ నాగం జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా పేరుతో సొంత బానర్‌పై ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచిన నాగం రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగించారు. ✍️ఆయన కొంతకాలం బీజేపీలోను, తదుపరి కాంగ్రెస్ లోను చేరారు. కాని కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రత్యర్ధి కె.దామోదరరెడ్డి కుమారుడికి నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఈయన కూడా కేసీఆర్ సమకాలికుడే. కేసీఆర్ కన్నా ముందుగానే మంత్రి అయ్యారు. కేసీఆర్‌ను చాలాకాలం వ్యతిరేకించిన నాగం, పాత స్నేహితుడే బెటర్ అనుకుని గులాబి కండువా కప్పుకున్నారు. ✍️పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య కూడా జనగామ టిక్కెట్ పై కాంగ్రెస్‌తో విభేధించి పార్టీకి దూరం అయి బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించిన పొన్నాల 2023 ఎన్నికల సమయానికి బీఆర్ఎస్లోకి వచ్చారు. అయితే నాగం, పొన్నాల లకు ఇక్కడ కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా, అధికారం వచ్చాక వారికి గుర్తింపు ఇస్తామన్న హామీని మాత్రం పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక భూమిక పోషించిన చెరుకు సుధాకర్ కూడా సొంత పార్టీ పెట్టుకుని తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపినా ,టిక్కెట్ రాకపోవడంతో కోపం వచ్చి చాలాకాలంగా తాను వ్యతిరేకిస్తూ వచ్చిన బీఆర్ఎస్ లో చేరిపోయారు. ✍️గతంలో నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం ఈసారి బీఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ టిక్కెట్ పై తలపడుతున్నారు. దానికి కారణం గతసారి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్లో చేరడం, తిరిగి టిక్కెట్ పొందడం.. ఫిరాయింపుల వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అవడంతో తుమ్మల తో సహా పలువురు నేతలు తలో దిక్కు అయ్యారు. వారిలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలువురు టీడీపీ నేతలకు కాంగ్రెస్‌లో ఆశ్రయం కల్పించారు. ములుగు నుంచి గెలిచిన సీతక్క తదితరులు ఇలాంటి వారిలో ఉన్నారు. ✍️తాజాగా మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీని వీడి పరకాల నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్నారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ పక్షాన మరోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లలో టిక్కెట్లు రాని కొందరు బీజేపీలో టిక్కెట్ తీసుకుని పోటీచేస్తున్నారు. గెలవడం, ఓడడం సంగతి ఎలా ఉన్నా, గేమ్‌లో ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. తొలుత బీజేపీకి ఊపు వస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం గమనించదగ్గ అంశం. ✍️రాజగోపాలరెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచి, కొంతకాలం తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి నిలిచి ఓటమి చెందారు. బీఆర్ఎస్ను అప్పట్లో బీజేపీనే ఓడించగలదని ఆయన అనేవారు. కాని పరిస్థితి మారడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది కేసీఆర్ అవినీతిపై చర్య తీసుకోవడంలో బీజేపీ విఫలం అయిందని ఆరోపించడం విశేషం. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని వారు కొందరు బీఆర్ఎస్లో చేరారు. ఈ ఫిరాయింపులలో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగినట్లనిపిస్తుంది. ✍️అధికార బీఆర్ఎస్ను కాదనుకుని ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు, ముగ్గురు జడ్పిచైర్ పర్సన్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తుంటే, ఆమె సోదరుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ విధంగా తెలంగాణలో ఫిరాయింపుల పర్వం ఈసారి జోరుగా సాగిందని చెప్పాలి. ఎన్నికలకు ముందే ఇన్ని ఫిరాయింపులు జరిగితే ఎన్నికలు అయ్యాక ఇంకెన్ని పార్టీ మార్పిడులు జరుగుతాయో చూడాలి! ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఫేక్ వీడియోలు వైరల్ కావొచ్చు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు తేదీ దగ్గర పడడంతో.. ప్రచార శైలి కూడా భిన్నమార్గంలోనే సాగుతోంది. ఒకవైపు ఓటర్లతో నేరుగా ఇంటెరాక్షన్తో పాటు మరోవైపు సోషల్‌మీడియాలోనూ నేతల ‘ఆరోపణ-ప్రత్యారోపణల’ జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలకు కొద్ది సమయమే ఉంది. స్కామ్‌గ్రెస్ స్కామర్ల నుండి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు/డీప్ ఫేక్ వీడియోలు & ఇతర రకాల అసంబద్ధ ప్రచారాలు ప్రచారంలోకి రావొచ్చు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఎవరూ మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. అలాగే తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్ కోరారు. డీప్‌ఫేక్ కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో.. కేంద్రం అలాంటి కంటెంట్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. Want to alert @BRSparty cadre and all SM Soldiers There will be many False/Deep Fake Videos & other forms of Nonsensical Propaganda over the next few days from Scamgress scammers Let us make sure no gullible voter falls into their trap Jai Telangana ✊#TelanganaWithKCR — KTR (@KTRBRS) November 24, 2023 -
కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update ఎస్సీ వర్గీకరణపై కేంద్రం చర్యలు వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలయి క్యాబినెట్ కార్యదర్శకి ప్రధాని మోదీ ఆదేశం కమిటీ ఏర్పాటు చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన బీఆర్ఎస్కు భారీ ఊరట.. రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ రైతుబంధు యాసంగి నిధుల విడుదలకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం ప్రారంభించిన ప్రభుత్వం మాజీ ఐఏఎస్ గోయెల్ ఇంటి వద్ద ఉద్రిక్తత ఓ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకొని పోతున్నారని ఆరోపణ పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ బైక్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకరలు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు ఇంటికి చేరుకున్న మాజీ ఐఏఎస్ గోయల్ గోయల్ సమక్షంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ మంచిర్యాలలో వివేక్ కామెంట్స్ తుగ్లక్ ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్టిండు పుస్తకాలు చదివి ఎవడైనా ప్రాజెక్టు కడతాడ వాస్తవానికి సీఎం కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడే నిజాలు బయటికి వస్తాయి ఎంపీగా ఉన్నపుడు 14 కోట్లతో చెన్నూర్‌లో మంచి నీటి సరఫరా పథకం తెచ్చాను మందమర్రి, ఆర్కే పురంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్న అభివృద్దే ఇప్పటికీ ఉంది ఎంపీగా ఉన్నప్పుడు రెండు రైల్వే బ్రిడ్జి లని సాంక్షన్ చేయించాను బాల్క సుమన్ గా ఉన్న ప్రజలకు చేసింది ఏమి లేదు. తుంగతుర్తిలో రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణలో నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయి మనుమడిని మంత్రిని చేసేదుకే కేసీఆర్ మూడోసారి అవకాశం ఇవ్వాలంటుండు పది ఎకరాల్లో నిర్మించుకున్న కేసీఆర్ గడీలోకి పేదలకు ప్రవేశం లేదు పేదోడి చెమట వాసన ఎట్లుంటదో కేసీఆర్‌కు తెలియదు నన్ను రానివ్వకపోయినా సరే అమరుల కుటుంబాలకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదు కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు కేసీఆర్‌కు సారా పొసే వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నడు నాడు రాజాకార్లను తరిమిన చరిత్ర నల్లగొండది కేసీఆర్‌కు సారా పోసేవారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న పరిస్థితి దాపురించింది డిసెంబరు 9న ఇందిరమ్మ రాజ్యం తెచ్చి చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో అత్యవసర సమావేశం పెట్టిండు ఓడిపోతామన్న భయంతో ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని చూస్తుండ్రు కేసీఆర్ ఇచ్చే పదివేలు తీసుకోండి... కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కామెంట్స్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి వాటి వివరాలు పూర్తిగా బయటపెట్టాలి అధికార పార్టీకి చెందిన డబ్బులు పెద్దఎత్తున గోయెల్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఉంది ఐటీ దాడులలో నగదు భారీగా గుర్తించినట్టు తెలిసింది ఐటీ అధికారులు మీడియా వాళ్లను అక్కడకు రానివ్వడం లేదు ఎలాంటి దాపరికాలు లేకుండా పూర్తి వివరాలు సమాజానికి తెలియజేయాలి కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కామెంట్స్ శ్రేయోభిలాషుల మీద ఐటీ దాడులు చేయించిన ఘనత కేసీఆర్‌ది. డిసెంబర్ 9 న కాంగ్రెస్ విజయభేరీ మోగనుంది అసెంబ్లీ ఎన్నికల సెమీ ఫైనల్లో కాంగ్రెస్‌దే విజయం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలది ఆధర్మ పాలన కంకి కొడవలి గుర్తు కి ఓటు వేసి కూనంనేనిని భారీ మెజారిటీతో గేలిపించండి అంబర్‌పేట్‌లో బీజేపీ ప్రచారం రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా, కిషన్‌రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయెల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ జూబ్లీహిల్స్ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల డబ్బు భారీ డంప్ ఉందన్న సమాచారంతో సోదాలు 2010లో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన గోయెల్ వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టిన డీకే శివకుమార్ కేఆర్ నాగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలి నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారు మడికొండలో డంపింగ్ యార్డ్‌ను ఎత్తేస్తాం కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతాం కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తుంది సోనియా గాంధీకి, దళితులకు వెన్ను పోటు పొడిచిన మోసకారి కేసీఆర్ సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, బృందాకరత్ 3 రోజుల టూర్ 25న సాయంత్రం పాలేరులో పర్యటన 26న మధ్యాహ్నం భువనగిరిలో సభ 27న మిర్యాలగూడ నియోజకవర్గంలో రోడ్ షో 25న వైరా నియోజకవర్గంలో బృందాకారత్ రోడ్ షో సాయంత్రం మధిర నియోజకవర్గంలో సభ 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సభ 27న భద్రాచలంలోని దుమ్ముగూడెం, చర్లలో సభలు 28న కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు కామారెడ్డిలో బీఆర్ఎస్కు షాక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ గాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక కామారెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్లో ఆందోళన సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ నేతలు యువ ఓటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఫిర్యాదు పోలింగ్ రోజు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని కోరిన బీజేపీ నేతలు నకిరేకల్ సభలో రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు ఎలక్షన్లు సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనీయొద్దు ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలి కొత్తగూడెంలో కాంగ్రెస్ సభ రద్దు కొత్తగూడెలో ప్రియాంక గాంధీ సభ రద్దు హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రియాంక రాత్రి తాజ్‌కృష్ణలో బస చేయనున్న ప్రియాంక గాంధీ భద్రాద్రితో భట్టి విక్రమార్క కామెంట్స్.. కొత్తగూడెం ప్రజలు రాజకీయంగా చాలా చైతన్య వంతులు. పలు ఉద్యమాలలో కూనంనేని పాల్గొన్నారు. కేసీఆర్ వచ్చాక సింగరేణి చాలా కష్టాల్లోకి వెళ్ళింది. సింగరేణి కార్మికులు ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నారు. ధనిక రాష్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందే కేసీఆర్. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అప్పులు లేని రాష్ట్రంగా చేస్తాం రేవంత్, నేను 6 గారెంటీలు ప్రకటించాము. కాంగ్రెస్ వచ్చాక ఈ 6 గ్యారెంటీ లు అందరికి చేరుస్తాం. రాష్ట్ర సంపద అంతా పేదలకు పంచుతాం. ఈరోజు మీరు బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓటు వేసినట్టే. రాజేంద్రనగర్‌లో అమిత్ షా కామెంట్స్.. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఉగ్రవాదులను ఎన్ఐఏ పట్టుకుంది. ఇక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేదు. కేసీఆర్.. ఒవైసీకి భయపడతారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. ఒవైసీకి భయపడి కేసీఆర్ ఎలా పాలన సాగిస్తాడు. ఈసారి బీజేపీకి ఓటు వేయండి. అభివృద్ధి చేసి చూపిస్తాం. హుస్నాబాద్‌లో ప్రియాంకా గాంధీ పర్యటన ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?: ముఖ్యమంత్రి మీకు ఉద్యోగం ఇచ్చారా? ఇలాంటి ప్రభుత్వం మరో పదేళ్లు కావాలా? బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు కష్టపడి చదివితే పేపర్లు లీకులు అవుతున్నాయి ఉద్యోగాలు లేనప్పుడు ఆ చదువు వృథానే అవుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవినీతి నిలయాలుగా నిలుస్తున్నాయి రైతు రుణమాఫీని బీఆర్ఎస్-బీజేపీలు మరుగన పడేశాయి దళితులు, గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ప్రధాని మోదీ దేశ సంపదను అదానికీ అప్పచెప్పారు అదానీ ఒక రోజు రూ. 1600 కోట్లు సంపాదిస్తున్నారు ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే విమర్శిస్తారు ఆ మూడు పార్టీలు కలిసి మీతో ఆడుకుంటున్నాయి తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయి కొల్లాపూర్ పీఎస్ ముందు జూపల్లి ధర్నా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన జూపల్లి కృష్ణారావు అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ గేటు ముందు ధర్నా చేసిన జూపల్లి రాత్రి తన కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నా పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ శిరీష అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించండి: హైకోర్టు కొల్లాపూర్ స్వాతంత్య్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలి గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదు ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలి అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే పోలీసుల కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదు బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలి నేతల ప్రచారంపై వాతావరణం ఎఫెక్ట్.. హెలికాప్టర బంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతలపై వాతావరణం ఎఫెక్ట్ చూపిస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం రద్దువుతోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ పాలకుర్తి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు.. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెనక్కి తిరిగి వచ్చిన రేవంత్ రోడ్డు మార్గంలో నకిరేకల్ చేరుకున్న రేవంత్ ఖర్గే నోరు అదుపులో పెట్టుకో: హరీష్ రావు ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు రోడ్ షో అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలని ఊదరగొట్టారు. కానీ కర్ణాటకలో ఇప్పుడు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు కరెంట్ రావటం లేదట. గతప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు కేసీఆర్ కరెంట్, చెరువులు, విత్తనాలు, వరి కొనుగోలు సమయంలో ఇచ్చారు. అప్పట్లో ఊళ్లలో కరువు ఉంది అనేటోళ్లు .. ఇప్పుడు రైతులు అన్నదాతలు అయ్యారు. రైతులకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఖర్గే నోరు అదుపులో పెట్టుకో. కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో. వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తాం. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాక ముందు ఈ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించాం. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తాం. బీఆర్ఎస్ కొత్త మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు. కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేది. ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలి. కారు ఇంజన్లో నోట్ల కట్టలు.. అగ్నికి ఆహుతి వరంగల్‌లో డబ్బులతో ఉన్న కారులో మంటలు బొల్లికుంట వాగ్దేవి కాలేజీ వద్ద కారు ఇంజన్లో మంటలు కారు ఇంజన్లో డబ్బులు తరలిస్తుండగా వేడికి కాలిపోయిన నోట్లు పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు కారు డిక్కీ ముందు భాగంలో డబ్బులను అమర్చారు వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగి డబ్బులు అగ్నికి ఆహుతి అయ్యాయి తెలంగాణ భవన్ లో ఆటో యూనియన్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించిన కేటీఆర్ రాయదుర్గం నుంచి బేగంపేటకు ప్రయాణం చేసిన కేటీఆర్ మెట్రో ప్రయాణికులతో మాట మంతి కేటీఆర్‌కు బండి సంజయ్ ప్రశ్నలు పేదరికం తగ్గితే.. తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారిందో చెప్పాలి దళితబంధు, బీసీబంధు పథకాలు ఎందుకు అందరికీ ఇవ్వలేకపోయారు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యోగులకు 15వ తారీఖు వరకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ నెల 27న కరీంనగర్ మోదీ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు కేసీఆర్ నీ టైం అయిపోయింది: అమిత్ షా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ల ప్రచారం ఆర్మూర్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ ఇచ్చిన ఏ హామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదు పదేళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేసింది 2014లో దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ సర్కార్ కబ్జా చేసింది టేబుల్‌పై డబ్బు పెట్టిన వాళ్లనే కేసీఆర్ మంత్రుల్ని చేస్తున్నారు కేసీఆర్ నీ టైం అయిపోయింది కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ కోసం ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది కాంగ్రెస్ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు: కేసీఆర్ మంచిర్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ వల్ల తెలంగాణ 58 ఏళ్లు గోస పడింది తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఏం లేదు గోదావరి పక్కనే ఉన్నా కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదు రైతు బంధు అనే పదం తెచ్చిందే బీఆర్ఎస్ ధరణిని తీసేస్తే డబ్బులు ఎలా వస్తాయి మంచి ఎమ్మెల్యేను ఎన్నుకుంటేనే మంచి జరుగుతుంది హైకోర్టులో మధ్యాహ్నం బర్రెలక్క పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కోల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థిని కర్రె శిరీష అలియాస్ బర్రెలక్క దాడుల నేపథ్యంలో 2 ఫ్లస్ 2 భద్రత కోరిన శిరీష పోలీసుల నుంచి సరైన స్పందన ఉండడం లేదని ఆరోపణ మధ్యాహ్నాం పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు జైరాం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ జైరాంపై బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మండిపాటు జైరాం రమేష్ ఖబర్ధార్.. చరిత్రను అవమానించకండి తెలంగాణ సోనియా వల్ల రాలేదు.. సకల జనుల పోరాటంతో తెలంగాణ వచ్చింది ప్రజాస్వామ్యంలో కుటుంబాలకు గుప్తాధిపత్యం ఉండవద్దు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి కుటుంబ రాజకీయాలకు అంతం పలకాల్సిన అవసరం ఉంది సామాజిక తెలంగాణ కావాలంటే బీజేపీతోనే సాధ్యం ఎంఐఎం ఉన్న హైదరాబాద్‌లో సెక్యులరిజానికి తావు లేదు పహాడీషరీఫ్ లో మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఐటి పరిశ్రమ ఏర్పాటు చేయడం ఏంటి? ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం: మల్లు రవి మీడియాతో కాంగ్రెస్ నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకరావడం ఖాయం. రాష్ట్రంలో ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి.. తమకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రజలు బావిస్తున్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయంగా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తాం.. మాకు అహంకారం లేదు: కేటీఆర్ క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో కేటీఆర్ ప్రసంగం 2014 లోనే తెలంగాణ లో మార్పు వచ్చింది వైఎస్సార్ హయాంలో ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో ఇన్వెస్టిమెంట్ ఉండేది ఇప్పుడు కేఏసీఆర్ హయాంలో ప్రో అగ్రికల్చర్, ప్రో డెవలప్మెంట్, ప్రో రూరల్ ఉంది కోవిడ్ మినహా ఆరున్నరెళ్ల పాలన మీ ముందుంది పాతికేళ్ల కిందటి ముఖ్యమంత్రుల పని తీరు.. ఇప్పటి సీఎం పనితీరు గమనించాలి తెలంగాణ వచ్చాక ఐటీ భారీగా అభివృద్ది చెందింది ఐటీ ఎగుమతులు పెరిగాయి తెలంగాణ లో ఐటీ పెరిగింది అంతే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరిగాయి రాష్ట్ర సంపద పెరుగుతుంది రియల్ ఎస్టేట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి కచ్చితంగా వాటిని పరిష్కరిస్తాం ప్రతిపక్షాలకు మమ్మల్ని తిట్టడానికి ఏం కనిపించటం లేదు తిట్టడమే పని గా పెట్టుకున్నారు గతంలో నీళ్ళు, కరెంట్ సమస్య లు ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు పుష్కలంగా ఉంది చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మాకు అహంకారం లేదు తెలంగాణపై చచ్చేంత మమకారం ఉంది ఎవరెన్ని గగ్గోలు పెట్టినా మళ్ళీ మేమే అధికారం లోకి వస్తున్నాం నేను దాదాపు 70 నియోజకవర్గలో తిరిగాను గ్రౌండ్ రియాల్టీ అంత మాకే అనుకూలంగా ఉంది వచ్చే ప్రభుత్వం మాదే తెలంగాణ ఎన్నికలు.. కౌంటింగ్ సెంటర్ల ప్రకటన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం కేంద్రాలను ప్రకటించిన ఎన్నికల సంఘం మొత్తం 33 జిల్లాల్లో.. 116 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు సమస్యాత్మ ప్రాంతాల్లో కట్టదిట్టమైన భద్రత ఉంటందని ప్రకటన కౌంటింగ్ కేంద్రాలు ఇవే ఆర్మూర్ బయల్దేరిన అమిత్‌షా హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా ఆర్మూర్ ప్రచార సభ కోసం హెలికాఫ్టర్‌లో బయల్దేరిన షా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్రహం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అబ్రహం అలంపూర్ టికెట్‌ను తొలుత అబ్రహంకే ఇచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజయుడికి ఇచ్చిన బీఆర్ఎస్ హైదరాబాద్‌కు చేరుకున్న జాతీయ నేతలు హైదరాబాద్‌కు పార్టీల అగ్రనేతలు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ కూడా సాయంత్రం నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాజ్‌నాథ్ అగ్రనేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ స్వాగతం శంషాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావ్ థాక్రే ప్రతికూల వాతావరణం కారణంగా.. రోడ్డు మార్గంలో జనగామ జిల్లా పాలకుర్తికి ప్రియాంక పాలకుర్తి ప్రచారంలో భాగంగా.. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రియాంక హుస్నాబాద్, కొత్తగూడెంలోనూ ప్రియాంక బహిరంగ సభలు సాయంత్రం ఖమ్మంలోనే ఆమె బస మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల తనిఖీలు మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల సోదాలు హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మంత్రి మల్లారెడ్డికి సంజీవరెడ్డి అత్యంత సన్నిహితుడు ఎలక్షన్ ఫ్లాయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో.. సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్న పోలీసులు సంజీవరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షుద్రరాజకీయాల్ని ప్రజలు గమనించాలి: రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి... వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?! డబ్బుల పంపిణి కట్టడి చేయండి: ECI ఎన్నికల వ్యయ పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్, డీఈవోలు హాజరైన రాష్ట్ర వ్యాప్త 69మంది వ్యయ పరిశీలకులు హైదరాబాద్ జిల్లా నుంచి పాల్గొన్న 8మంది ఎక్స్పెండిచర్ అబ్ జర్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుల పంపిణి కట్టడి పై చర్చ డబ్బుల పంపిణి కట్టడిలో చివరి రెండు రోజులు కీలకమన్న కేంద్ర ఎన్నికల సంఘం పదేళ్లైనా.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో జైరాం రమేష్, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం బీఆర్ఎస్పై కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేష్ ఫైర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు అప్పుడు హైదరాబాద్‌లోనే పెట్టుబడులు వచ్చేవి.. ఇప్పుడు అక్కడికే వస్తున్నాయి ప్రత్యేక రాష్ట్ర అయ్యాక తెలంగాణ ప్రజలు మేలు జరిగిందా? పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటే కాదు.. బ్రాండ్ తెలంగాణ సృష్టించడమే సోనియా లక్ష్యం నిరుద్యోగుల శాతం తెలంగాణలో అధికంగా ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలులు లీక్ అవతున్నాయి ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలుచేసుకుంటున్నారు సామాజికన్యాయం అమలు చేయాలని సోనియా ఆకాంక్షించారు. ఉన్నత పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయి. బీసీ, బీసీ, దళితులకు తెలంగాణలో ఎన్ని పదవులు వచ్చాయి ఎందుకు తెలగాణ ఏర్పాటు చేశామో.. పదేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేదు జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌కు కొత్త జోష్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వబోతున్నారు తాండూరులో ఐటీ దాడులు యలాల మండలం జక్కేపల్లి సమీపంలోని ఆర్బీఆఎల్ ఫ్యాక్టరీపై దాడులు. కాంగ్రెస్ అభ్యర్థి మనోహార్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఫ్యాక్టరీ తాండూరులో 44 లక్షల 84 వేల 500 రూపాయలు పట్టివేత కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు డబ్బులు తరలిస్తున్న ఓ పత్రికకు చెందిన స్థానిక రిపోర్టర్‌ను చారిస్తున్న పోలీసులు ఆరు గ్యారంటీలతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: భట్టి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నమ్మొద్దు అని కేసీఆర్ అంటున్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజల సంపద ప్రజల పంచాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం. ప్రజల సంపద ప్రజలకు పంచాలా? పాలకులు పంచుకుని తినాలా? ఎందుకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు? కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు, నమ్మొద్దు అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంటి? మళ్లీ ఐదు సంవత్సరాలు మేమే పంచుకు తింటామని చెప్పడమా? కాంగ్రెస్ ఉంటనే కరెంటు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల వల్ల ఉత్పత్తి అవుతున్న కరెంటుతో నేడు కొరతలేదు. కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్. కరెంటు ఉత్పత్తి ఎలా చేయాలి? నాణ్యమైన కరెంటును ఉత్పత్తి చేసి రైతులకు ఎలా సరఫరా చేయాలన్నది కాంగ్రెస్‌కు పాలన అనుభవం ఉంది. రెండు రోజుల పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రియాంక గాంధీ సభలను విజయవంతం చేయాలని పిలుపు. ఎన్నికలపై తుఫాను ఎఫెక్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వర్షం ఆటంకం 26న వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ 28వ తేదీ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం ఇప్పటికే.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సభ రద్దు మిగతా పార్టీల సభల షెడ్యూల్లోనూ మార్పులు చేసుకునే అవకాశం జనసమీకరణ కష్టం అవుతుందని పార్టీల దిగులు తెలంగాణ ప్రచారంలో డీకేఎస్ బిజీబిజీ నేడు రేపు నల్లగొండలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారం ఎల్లుండి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో అంబర్‌పేటలో ప్రచారంలో పాల్గొననున్న డీకే శివకుమార్ జోగులాంబలో ఉద్రిక్తత జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఉద్రిక్తత బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల మాల వేసే క్రమంలో విరిగిన విగ్రహం వేలు ప్రచార రథాన్ని అడ్డుకుని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్త వాతావరణం పువ్వాడపై నారాయణ సంచలన వ్యాఖ్యలు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయదు అనే అపోహ ఉంది పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు సీపీఐ సపోర్ట్ చేస్తుందనే అపవాదు సృష్టిస్తున్నారు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి తో చెక్ పెట్టాలి అజయ్‌కు సపోర్ట్ చేస్తే సీపీఐ లోని ఎంత పెద్ద నేత ఉన్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తులసి వనంలో గంజాయి మొక్కలాంటోడు పువ్వాడ అజయ్ కుమార్ తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్ అటువంటి వ్యక్తి కి cpi మద్దతు ఇవ్వదు జిల్లాలో పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయ్ నే తెలంగాణ పవర్ బీఆర్ఎస్దే: రాజ్‌నీతి సర్వే రాజ్‌నీతి సర్వేలో బీఆర్ఎస్కే పట్టం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 38,351 మంది.. మొత్తం తొమ్మిది వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ రైతులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటోడ్రైవర్లు, పక్కా ఇళ్ల యజమానులు, ఇతరులు సర్వేలో పాల్గొన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వాళ్లు బీఆర్ఎస్కు 75 స్థానాలు.. 42.43 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు 31 స్థానాలు.. 32. 62 శాతం ఓట్లు ఎంఐఎంకు ఏడు బీజేపీకి ఐదు స్థానాలు.. 16.71 శాతం ఓటింగ్ మాత్రమే మూడోసారి బీఆర్ఎస్కే పట్టమని రాజ్‌నీతి రిపోర్ట్ రేపటి కేసీఆర్ సభ రద్దు హైదరాబాద్‌లో శనివారం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు హాజరుకావాల్సిన అధినేత కేసీఆర్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఆ మూడు ఒక్కటే.. ఎలిమినేట్ చేయాలి: నారాయణ ఖమ్మంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం కాంగ్రెస్, సీపీఐ కు ఓటేస్తే బిజెపి, బీఆర్ ఎస్ ,ఏంఐఎం మూడు పార్టీలు ఎలిమినెట్ అవుతాయి బిజెపి, బీఆర్ ఎస్, ఏంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఒప్పందం లో భాగంగానే ముందుకు వెళుతున్నాయి గోషామాల్ లో బిజెపి నుంచి రాజాసింగ్ పోటీ చేసే చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టలేదు.. కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి! పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు చేసేవాన్ని డ్రామాలే కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే తెలంగాణ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ వాళ్లు ముదుర్లు.. ఐదు సీట్లు అడిగితే ఒక్కటి ఇచ్చారు అవినీతి ఆరోపణలపై స్పందించాలి:హైకోర్టు ఆదేశం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, ఎంపీ అర్విద్ సహా ఇతర పార్టీల నేతల ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విచారణ జరపాలని సమర్పిచిన వినతిపత్రాలను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీని ఆదేశించిన హైకోర్టు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఒక పార్టీ వారిపై మరొకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని.. వీటిపై విచారణ జరిపేలా ఈసీ, అధికారులను ఆదేశించాలని కోరుతూ నిజామాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ఖాదర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ నెల 2న డీజీపీ, 4న సీఈవోకు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించానని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ సమర్పించిన వినతిపత్రాలను 30లోగా పరిష్కరించాలని ఈసీ, డీజీపీని ఆదేశిస్తూ, పిటిషన్‌పై వాదనలను ముగించింది. ప్రాణం పోయినా వెనకడుగేయను: బర్రెలక్క కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసు. కానీ, నేను వారి పార్టీ పేరు వెల్లడించను. ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయను. ‘నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు. అయినా నేను దేనికీ భయపడను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్‌లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది. హైకోర్టులో బర్రెలక్క పిటిషన్‌పై నేడు విచారణ గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్2 గన్మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్ దాఖలు నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటన ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం.. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో అమిత్‌షా రోడ్ షో 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల బహిరంగ సభల్లో ప్రసంగం సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్న అమిత్‌షా 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగం అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న అమిత్‌షా రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం బోధన్, ఆదిలాబాద్, వేములవాడ సభలకు రానున్న ఏఐసీసీ అగ్రనేత నేటి నుంచి రెండు రోజులపాటు ప్రియాంక పర్యటన... షెడ్యూల్లో స్వల్ప మార్పులు నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు 3 రోజులు.. 6 బహిరంగ సభలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల పాటు మోదీ పర్యటన శనివారం మధ్యా హ్నం బెంగళూరు నుంచి కామారెడ్డికి చేరుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 2:15 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో బహిరంగ సభ రాత్రికి రాజ్‌భవన్‌లో బస ఆదివారం ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనాన్ని సందర్శన అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ ఆ తర్వాత మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్మల్‌లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగం రాత్రికి తిరుమలకు చేరుకొని అక్కడి శ్రీరచన రెస్ట్‌హౌస్‌లో బస సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ వేంకటేశ్వర్వస్వామిని దర్శించుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 12:45 గంటలకు మహబూబాబాద్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ మధ్యాహ్నం 2:45 గంటలకు కరీంనగర్లో జరిగే బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలో పాల్గొననున్న మోదీ బహుముఖ వ్యూహంతో ప్రజల్లోకి బీఆర్ఎస్ విజయాలను వివరించి.. విమర్శలను తిప్పికొట్టి.. హ్యాట్రిక్ విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న గులాబీ దళం.. కేసీఆర్ బహిరంగ సభలు..కేటీఆర్, హరీశ్ రోడ్‌షోలు రాష్ట్రాభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు.. పత్రికా ప్రకటనలు.. చానళ్లు, యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు.. వివిధ వర్గాలతో ముఖాముఖీలు పదేళ్లలో సాధించిన విజయాలపై వివరణ విపక్షాల విమర్శలు తిప్పికొడుతూ ప్రణాళికాబద్ధంగా ముందుకు.. -
ప్రాజెక్టులపై రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, లిఫ్టులు, వందల కిలోమీటర్ల కాలువలు అని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దని, వాటిని బదనాం చేసి తెలంగాణకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బ్యారేజీల్లో సమస్యలు అత్యంత సాధారణమన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్మాణం తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పవర్ హౌస్ పంపులు కూడా నీట మునిగాయని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, రంగాల వారీగా రాష్ట్రం పురోగమించిన తీరుపై గురువారం హైదరాబాద్‌లో ఆయన గణాంకాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిండుకుండల్లా 46 వేల చెరువులు ‘మిషన్ భగీరథ ద్వారా రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి 58 లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. దీని స్ఫూర్తితో కేంద్రం ‘హర్ ఘర్ జల్’పథకాన్ని ప్రారంభించింది. దీనితో పాటు అనేక తెలంగాణ పథకాలు కేంద్రం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన 46 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. సాగునీటితో సంపదను సృష్టించాం. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలపగా, జీఎస్డీపీ అత్యంత వేగంగా పెరిగింది. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది. పేదరికాన్ని తగ్గించిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. తండాలు గ్రామ పంచాయతీలుగా మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటివి కేసీఆర్ పాలనలోనే జరిగాయి..’అని కేటీఆర్ తెలిపారు. ధరణితో పారదర్శకంగా రిజిస్ట్రే షన్లు ‘భూ యజమానుల వేలి ముద్రకు అధికారమిచ్చి ‘ధరణి’ద్వారా పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా చూస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం, గ్రీన్ కవర్ 7.7శాతానికి పెంపు, హరిత నిధి ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చాం. మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, వేయి గురుకుల పాఠశాలల ఏర్పాటు, 32 కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటివి మా ప్రభుత్వం సాధించిన విజయాలు. గ్రేటర్లో మెట్రో రైలు వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)కింద రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు వ్యవస్థను అభివృద్ధి చేశాం. మరో 450 కిలోమీటర్ల మేరకు దీన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతోంది. భవిష్యత్తులో ప్రతిరోజు నీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నాం. మురుగునీటి పారుదల శుద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మునిసిపాలిటీలో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం..’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలోని దుర్మార్గ ప్రభుత్వం తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తోందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజలకు కరెంటు ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
రె‘బెల్స్’ కాదు ... ప్రత్యర్థి పక్షమే!
ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఒకెత్తయితే... సొంత పార్టీ నుంచి రెబెల్‌గా ఎవరూ లేకుండా చూసుకోవడం మరోఎత్తు. తాము ఎప్పటి నుంచో ఉంటున్న పార్టీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానో, మరో పార్టీ నుంచో పోటీ చేసి గెలిచిన నాయకులు తెలంగాణలో చాలా మందే ఉన్నారు. ఒకవేళ గెలవకపోయినా, సొంత పార్టీ అభ్యర్థిని ఓడించి ప్రత్యర్థి పార్టీ గెలుపునకు పరోక్షంగా కారకులైన వారూ ఉన్నారు. కొన్నిసార్లు పేరున్న రెబెల్ కారణంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లోని ఏ అభ్యర్థి ఓడిపోతాడో చెప్పలేని పరిస్థితి. కానీ ఈసారి సీన్ మారింది. రెబెల్స్ పోటీలో నిలిచిన నియోజకవర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెబెల్స్‌గా పోటీ చేసే బదులు ప్రత్యర్థి పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయడం అనే పద్ధతిని ఈసారి చాలామంది ఫాలో అయిుపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా , రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మొదలు మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి(నాగర్‌కర్నూలు), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి), మాజీ ఎమ్మెల్యేలు పి. విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), ప్రేంసింగ్ రాథోడ్(గోషామహల్), చందర్రావు(కోదాడ), బిరుదు రాజమల్లు (పెద్దపల్లి) వంటి వారు ఇందులో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ రాక బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు రెబెల్స్‌గా బరిలో దిగాలని తొలుత భావించినప్పటికీ, ‘సింబల్’ లేకుండా గెలవడం కష్టమనే భావనతో మధ్యే మార్గంగా ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకున్నారు. బీఆర్ఎస్ కూడా టికెట్ రాని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి మరీ సాదరంగా ఆహా్వనించింది. కొట్లాడుతామనుకున్న వాళ్లకే మద్దతుగా ప్రచారం చేయాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది. ఇలాంటి వారిలో చెరుకు సుధాకర్ (నల్లగొండ), తాటి వెంకటేశ్వర్లు (అశ్వరావుపేట), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గండ్రత్ సుజాత (ఆదిలాబాద్) వంటి వారున్నారు. బీజేపీ నుంచి కూడా రాకే‹Ùరెడ్డి (వరంగల్), తుల ఉమ (వేములవాడ), రమాదేవి (ముధోల్) టికెట్ రాక భంగపడి బీఆర్ఎస్లో చేరారే తప్ప రెబెల్స్‌గా పోటీ చేసే సాహసం చేయలేదు. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి బరిలో... ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది. కొందరు మినహా సిట్టింగ్‌లకే ఆ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన వారు రెండు నెలలు ఆలోచించిన అనంతరం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్నారు. తన కొడుకుకు మెదక్ సీటివ్వలేదని అలిగిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే టికెట్ దక్కని రేఖా నాయక్(ఖానాపూర్) కాంగ్రెస్‌లో చేరగా, ఆమె భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ లభించింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతుగా ఆపార్టీలో చేరారు. నిర్మల్ నుంచి శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. సంగారెడ్డి టికెట్ ఆశించిన పులిమామిడి రాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కరీంనగర్లో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పురమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, మునుగోడు నుంచి చెలిమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. చేవెళ్లలో రత్నం, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారెందరో...! తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1983లో వచ్చిన ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి రాష్ట్రంలో 19 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, అందులో తెలంగాణ నుంచే తొమ్మిది మంది విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో 8 మంది తెలంగాణ నుంచి కావడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో తెలుగుదేశం టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులే ఉన్నారు. 1989 ఎన్నికల్లో ఏకంగా 15 మంది స్వతంత్రులు విజయం సాధించగా, అందులో 8 మంది తెలంగాణ నుంచే. ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్లో బి.జగపతి రావు వంటి నేతలు అప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కక రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారే. 1994లో మరోసారి ఎన్టీఆర్ ప్రభంజనంలో 12 మంది ఇండిపెండెంట్లు గెలవగా, అందులో తెలంగాణ నుంచి గెలిచిన ఐదుగురు ఇండిపెండెంట్లలో తుంగతుర్తి నుంచి ఆర్.దామోదర్ రెడ్డి , గద్వాల నుంచి డీకే.భరత్ సింహారెడ్డి, కల్వకుర్తి నుంచి ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2004లో 11 మంది ఇండిపెండెంట్లు గెలవగా తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురిలో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు వంటి వారు ఉన్నారు. 2004 నుంచి ఇతర పార్టీల గుర్తుల మీద... 2004 ఎన్నికల నాటి నుంచి టికెట్లు రాని వారు రెబెల్స్‌గా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ గుర్తుల మీద పోటీ చేసే ఆచారం మొదలైంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున మెట్పల్లి నుంచి పోటీ చేసిన కొమిరెడ్డి రాములు, సమాజ్‌వాది పార్టీ టికెట్ మీద గద్వాల నుంచి పోటీ చేసిన డీకే.అరుణ కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించగా, అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి సీట్లు రాని వారు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు పోటీ చేసినప్పటికీ... నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, బాల్కొండ నుంచి అనిల్‌కుమార్ విజయం సాధించి, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీని తెరపైకి తెచ్చిన అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్‌గా దొంతు మాధవరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైరా నుంచి రాములు నాయక్ కాంగ్రెస్ రెబల్‌గా విజయం సాధించగా, రామగుండం నుంచి కోరుకంటి చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి గెలుపొంది, తర్వాత బీఆర్ఎస్లో చేరారు. -పోలంపల్లి ఆంజనేయులు -
సింగరేణి సెగ ఎవరికి?
ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చే సింగరేణి ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోనని రాజకీయపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో గోదావరి లోయ పరిధిలో 6 జిల్లాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణిలో మొత్తంగా 11 డివిజన్లలో 70వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 42 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో 28వేల మంది కాంట్రాక్టు కార్మికులు. వీరి కుటుంబసభ్యులతో సహా మూడున్నర లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. ఈ 11 నియోజకవర్గాల్లో సింగరేణి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతే ఫలితం అటు వైపే అన్న విషయం గత అనుభవాల నేపథ్యంలో అన్ని పక్షాలకు తెలుసు. దీంతో సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్నర్ మీటింగ్‌లు, దావత్‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సింగరేణి పరి ధిలోని పలు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాదసభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నాయకులు సింగరేణి బెల్ట్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా ఉన్న టీబీజీకేఎస్ (బీఆర్ఎస్), ఐఎన్టీయూసీ (కాంగ్రెస్), ఏఐటీయూసీ (సీపీఐ)ల బలం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. 2018లో విలక్షణ తీర్పు గత శాసనసభా ఎన్నికల్లో సింగరేణి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. 11 శాసనసభా నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్కు కేవలం మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందగా, రామగుండంలో బీఆర్ఎస్ రెబెల్ కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ గెలుపొందగా, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాకల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన వారితో పాటు భూపాలపల్లి , ఆసిఫాబాద్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి , ఆత్రం సక్కు కూడా తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు వారిలో ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆత్రం సక్కు మినహా మిగతా వారంతా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి గతంలో ఓడిపోయిన కోవా లక్ష్మికే మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఈసారి సింగరేణి కార్మికులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మద్దతు పలుకుతారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి. కాగా, మంథని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రభావం కనిపిస్తోంది మిగిలిన చోట్ల ఆ పార్టీ పోటీ నామమాత్రంగానే ఉంది. మిగతా హామీల సంగతేంటంటున్న కాంగ్రెస్, సీపీఐ గత సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలతో పాటు కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.10లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చా రు. కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు హామీని కూడా అమలు చేయిస్తామని చెప్పారు. గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం రూ. 20 లక్షలకు పెంపు హామీ ఇంకా నెరవేరలేదు. భూగర్భ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడం, కొత్త గనులు తెరవకపోవడం, సింగరేణికి ప్రభుత్వ సంస్థలు రూ. వేల కోట్లు బాకీపడడం, సింగ రేణిలో పెరిగిన రాజకీయ జో క్యం, ప్రైవేటీకరణ వంటి అంశాలను కాంగ్రెస్, సీపీఐ తప్పు పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలపై బీఆర్ఎస్ ఆశలు 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో తమ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పలు హామీలు నెరవేరుస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తదనుగుణంగా పావులు కదిపి సింగరేణి కారుణ్య నియామకాల ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇప్పటి వరకు 18వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఎప్పుడో చంద్రబాబు హయాంలో 1998లో రద్దయిన వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను పునః ప్రారంభించి, సింగరేణి కార్మికుల కలలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఆపార్టీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చే క్వార్టర్స్ విషయంలో నిబంధనల సడలింపు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీతాలు, మరమ్మతుల కల్పన, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పన వంటివి అందించడంతో బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉందని తెలుస్తోంది. లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చడం, దసరా, దీపావళి పేరిట కార్మికులకు ఇచ్చే బోనస్, అడ్వాన్స్ పెంపు కూడా తమ విజయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ వెంట నడుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -పోలంపల్లి ఆంజనేయులు -
విజయాలను వివరించి.. విమర్శలను తిప్పికొట్టి..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మరో మంత్రి హరీశ్‌రావు ముమ్మర ప్రచారంతో ప్రజల వద్దకు వెళుతున్నారు. పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించడంతో పాటు, ఎప్పటికప్పుడు విపక్షాల ప్రచారాన్ని అన్నివిధాలా తిప్పికొట్టడం, విమర్శలకు వీలైన అన్ని మార్గాల్లో వివరణ ఇవ్వడం, ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత పెంచే వ్యూహాలను బీఆర్ఎస్ అమలు చేస్తోంది. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది’ కేసీఆర్ ఇప్పటికే సుమారు 75 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 25న గ్రేటర్ హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే సభతో కేసీఆర్ ఈ నెల 28న తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఇక కేటీఆర్, హరీశ్‌రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ప్రచార అంకంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఢిల్లీ నేతలను రంగంలోకి దించడాన్ని బీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు.. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు.. బీఎస్పీ తరఫున మాయావతి సైతం ప్రచారంలోకి దిగారు. దీంతో ఢిల్లీ నేతలు చేసే విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పదేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, అడ్వర్టయిజ్మెంట్ల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది’అనే నినాదంతో గతంతో, వర్తమాన పరిస్థితిని పోల్చి చూపిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మేనిఫెస్టోకు కొత్త హామీల జోడింపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సభలు, రోడ్ షోలతో పాటు క్షేత్ర స్థాయి ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్..ఎప్పటికప్పుడు కొత్త హామీలను కూడా జోడిస్తోంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లకు 2023 వరకు కటాఫ్ పెంపు, గల్ఫ్ కారి్మకులకు బీమా, ఆటో కార్మికులకు వెహికల్ ఫిట్నెస్ నుంచి మినహాయింపు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసే బాధ్యతను పలు ఏజెన్సీలకు అప్పగించారు. ఇక తెలంగాణ, హైదరాబాద్ విషయంలో తమ దార్శినికతను ఆవిష్కరించే క్రమంలో పేరొందిన యూ ట్యూబర్లు, చానెళ్లకు కేటీఆర్, హరీశ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. విద్యాధికులు, పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు వీలుగా సామాజిక మాధ్యమాల్లో పేరొందిన వారికి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు మహిళలు, నిరుద్యోగ యువత, మైనారిటీ మహిళలు, అలాగే వివిధ రంగాలకు చెందిన వారితో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పలు హామీలు ఇస్తోంది. తద్వారా ఆయా వర్గాల్లో బీఆర్ఎస్ పట్ల సానుకూల ధోరణి నెలకొనేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘విమర్శలు.. వివరణలు’అనే వ్యూహాన్ని బీఆర్ఎస్ అనుసరిస్తోంది. పరిస్థితుల సమీక్ష..ఎప్పటికప్పుడు ఆదేశాలు క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచారం, కేడర్ నడుమ సమన్వయాన్ని ‘వార్ రూమ్’ల ద్వారా బీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది. నిఘా సంస్థలు, సర్వే ఏజెన్సీలు, వివిధ సంస్థల నుంచి అందుతున్న నివేదికలను లోతుగా విశ్లేషించి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ వంటి ఇతర పార్టీల ప్రచారం, క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీలు, అభ్యర్థులు పన్నుతున్న వ్యూహాలు, అమలు చేస్తున్న ప్రణాళికలను ఛేదిస్తూ (డీ కోడ్) వాటికి ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ వ్యూహాల అమలు బాధ్యతను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, అభ్యర్థులకు అప్పగించి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తు న్నారు. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ప్రచార లోపాలను కూడా విశ్లేషిస్తూ దిద్దుబాటుకు అవసరమైన సలహాలు, సూచనలతో తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు. విపక్షాల బలహీనతలపైనా దృష్టి అధినేత కేసీఆర్ నుంచి అందే ఆదేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అభ్యర్థులు, కేడర్‌కు వివరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి చాలాచోట్ల పటిష్ట పార్టీ యంత్రాంగం లేకపోవడం, చివరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న ఇతర పార్టీల అభ్యర్థులు తడబడుతున్న తీరును తమకు అనువుగా మలుచుకునే వ్యూహాలకు సైతం పదును పెడుతోంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఒక్కో ఓటును ఒడిసి పట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగేలా కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తోంది. -
వారి వాగ్దానాలు నమ్మొద్దు
సాక్షి, పెద్దపల్లి: బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని ఆ పార్టీని ఓడించాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణచివేతకు గురైన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కాన్షీరాంఉద్యమం చేయడంతోనే ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయని గుర్తుచేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఘీంకార బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, దళితులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వారిని ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా అణచివేస్తోందని దుయ్యబట్టారు. 1989లో తాను తొలిసారి ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పానని, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచానన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుల అణచివేతలో భాగంగానే ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చి పేదలకు భూములు పంచి, లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అలాంటి పథకాలు అమలు చేసి బహుజనుల రాజ్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను ఓడించాలి: ప్రవీణ్ కుమార్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ను ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష, రామగుండం అభ్యర్థి అంబటి నరేశ్‌యాదవ్, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుస్థిరతకే ఓటు!
సాక్షి, హైదరాబాద్ సిటీ నెట్వర్క్ : వచ్చే గురువారం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. సరిగ్గా వారం రోజులుందనగా నగర ప్రజల పల్స్ పట్టుకునేందుకు ‘సాక్షి’ రోడ్ షో నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఎనిమిది కారిడార్లుగా వర్గీకరించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఎనిమిది దిక్కుల్లోని ప్రజలనూ కలిసిన విలేకరులకు విభిన్న స్వరాలు వినిపించాయి. నగర అభివృద్ధికి కృషి చేస్తోందంటూ బీఆర్ఎస్ సర్కారుకే పెద్దపీట వేస్తామనేవారితోపాటు వానలొస్తే ముంపు ఇబ్బందులు అంతగా తప్పించలేని ప్రభుత్వాన్ని ప్రస్నిస్తున్న వారూ లేకపోలేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరం మరింతగా అభివృద్ధి చెందాలని, తిరిగి ఇదే ప్రభుత్వం వస్తే అభివృద్ధి మరింత వేగంగా కొనసాగే అవకాశముందని కొందరు ప్రత్యేకించి చెప్పడం గమనార్హం. ఫ్లై ఓవర్లతో నగర రూపురేఖలే మారాయని, ఐటీని మేటిగా నిలుపుతున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుంటామన్న వారితో పాటు ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ తదితర రంగాల్లో నగరం ఎంతో పురోగతి సాధించిందని, కాకపోతే ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని ధిక్కార స్వరాన్ని వినిపించిన వారూ ఉన్నారు.. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే ఇదే ప్రభుత్వం బెటరనే అభిప్రాయాల్ని ఎక్కువమంది వ్యక్తం చేశారు. కొత్త వారొస్తే.. మళ్లీ మొదటికొస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దినసరి కూలీల నుంచి ఐటీ ఉద్యోగుల దాకా, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారి నుంచి చిరువ్యాపారుల దాకా, ఇరవయ్యేళ్ల నవయువ ఓటర్ల నుంచి అరవయ్యేళ్లు పైబడిన వారిదాకా, మహిళల్లో గృహిణుల నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నవారి దాకా విభిన్న వర్గాల ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా అత్యధికులు సుస్థిర ప్రభుత్వం మేలని అభిప్రాయపడగా.. మిగతా వారు మార్పు కోరుకుంటూ అంతరంగం వెలిబుచ్చారు. కారిడార్ 1 పోచారం, నారపల్లి, బోడుప్పల్, ఉప్పల్ శివార్లకు ప్రాణం పోయండి పదేళ్లుగా తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందని ఎక్కువమంది అభిప్రాయపడగా, పెరిగిన నిత్యావసరాలతో సామాన్యులు బతకలేని పరిస్థితులేర్పడ్డాయని, డబ్బున్న వారు మరింత సంపన్నులు కాగా, పేదలు మరింత నిరుపేదలయ్యారని వాపోయిన వారూ ఉన్నారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంతోపాటు ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని పెంపొందించే నాయకత్వం కావాలన్న వారు సైతం ఉన్నారు. శివారు ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనలో మరింత దృష్టి పెట్టాలని, కనీస వసతులు, రవాణాను రాబోయే ప్రభుత్వాలు ప్రధాన అంశాలుగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కోర్సిటీపైనే దృష్టి పెట్టారు, ఈ దశలో శివార్ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఆశిస్తున్నారు. అభివృద్ధి బాగుంది పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలంటే మరోసారి అధికారపార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. – జశ్రామ్, వ్యాపారి, నారపల్లి ఈ విడతలోనే అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంతోనే రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధించగలదు. అందరికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశమిద్దాం అనే అలోచన కంటే అభివృద్ధిని చూసి ఓటేద్దామని ఆలోచించడం మంచిది. – అరుణ, వాటర్ ప్లాంట్ నిర్వాహకురాలు, జోడిమెట్ల. మార్పు కావాలి బీఆర్ఎస్ వల్ల పేదలకు చాలా అన్యాయం జరిగింది. డబ్బున్నవాళ్లే మరింత ధనవంతులయ్యారు. పేదవాళ్లు ఇంకా నిరుపేదలయ్యారు. కాంగ్రెస్ మొదటి నుంచీ పేదల పార్టీ. ఆ పార్టీయే అధికారంలోకి రావాలి. –విజయ్, టిఫిన్ బండి నిర్వాహకుడు, ఉప్పల్ కారిడార్ 2 రామంతాపూర్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లిబర్టీ, ఖైరతాబాద్ సంక్షేమానికి మొగ్గు అభివృద్ధికి ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న ప్రస్తుత సర్కారుకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వర్గాలు అధికంగా ఉండడం,ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు జై కొట్టడం గమనార్హం. మరోవైపు స్థానిక అభ్యర్థులపై అభిమానంతో కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఆరు గ్యారంటీలపై చర్చ జరుగుతున్నా అంతిమంగా ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ బీజేపీకి కొంత అనుకూలత కనిపించింది. సమస్యలపై అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉంది. స్థానిక అభ్యర్థికి సమస్యలపై అవగాహన ఉంది. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. –రంగనాథ్, వ్యాపారి, వెంకటేశ్వరనగర్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాం తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అందజేసిన వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాం. ఇంకా మేలు జరుగుతుందేమోనని ఎదురుచూస్తున్నాం. కొత్తవారైతే ఎక్కువేమైనా చేస్తారేమోననే ఆశ ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – నోముల రాములు, మార్బుల్ మేస్త్రీ అంబర్‌పేట బీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఐటీ మంత్రి కేటీఆర్ అంటే నాకెంతో అభిమానం ,ప్రేమ. ఆయన వల్లనే నగరం అన్నిరంగాల్లో ముందుకెళ్లింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది. –రాజేందర్, విద్యార్థి, ఖైరతాబాద్ కారిడార్ 3 అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్ మెట్రో విస్తరణ ప్రథమ ఎజెండా కావాలి ప్రస్తుత ప్రభుత్వంలో చాలా పనులు జరిగాయని, మార్చాల్సిన అవసరమైతే కనిపించడం లేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా లోపాల్లేకున్నా, స్థానికంగా ఉండే నేతలు సైతం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటర్లు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా మెట్రోపై తమ అభిప్రాయాలను వివరించారు. మెట్రో రాకతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయని , విస్తరణను నగర ప్రథమ ఎజెండాగా బీఆర్ఎస్ తీసుకోవాలని మెజార్టీ ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఉండడం, వారు అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే బావుంటుంది కానీ, వారి వర్గ పోరుతోనే సమస్య అన్న వాళ్లు ఉన్నారు. ప్రభుత్వంలో లోపాల్లేవు కేసీఆర్ పాలనలో నాకు ఏ లోపాలు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సుస్థిర ప్రభుత్వం కొనసాగాలంటే. తిరిగి కేసీఆర్‌కు జై కొట్టాలి. – ఉత్తేజ్, సినీనటుడు, జూబ్లీహిల్స్ వేరే ఆప్షన్ లేదు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అంతమాత్రాన ప్రభుత్వాన్నే మార్చాలనుకోవడం తగదు. స్థానికంగా కొన్ని సమస్యలున్నా, బీఆర్ఎస్ కంటే మంచి ఆప్షన్ కనిపించడం లేదు. – ఆకుల ప్రవీణ్‌కుమార్, ఐస్‌క్రీమ్ మెషిన్ల వ్యాపారి ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లేయమంటున్నారు. గెలిచాక కూడా అలాగే ప్రజల్లో తిరగాలి. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తే ప్రజలు ఎప్పుడూ వారివెంటే ఉంటారు. –మహేష్ చౌదరి, అమీర్‌పేట కారిడార్ 4 కొంపల్లి, బాలానగర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ ఐటీలో మేటి.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే ఐటీలో మెరుగ్గా నిలిచామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే కనిపించే భారీ అంతస్తుల భవనాలు, కేబుల్‌బ్రిడ్జి వంటివి నగరంలోనూ కనిపిస్తున్నాయని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఐటీ రంగం అంచలంచెలుగా ఎదుగుతోందని, పేరొందిçన కంపెనీలు రావడం కేవలం కేటీఆర్ కృషి వల్లేనని చెప్పారు. ఐటీ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్గా మారిపోయిందని, మున్ముందు మరింత ఖ్యాతి పొందే అవకాశం ఉందన్నారు. కొందరు మాత్రం తాము దరఖాస్తు చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం కొందరికే చుట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ అభివృద్ధి చెందింది నగరంలో ఐటీ బాగా అభివృద్ధి చెందింది. లింక్రోడ్లతో ప్రయాణం సాఫీగా మారింది. సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. – మహే ష్ చారి, చందానగర్ గుణగణాలను చూసే ఓటేస్తా తెలంగాణ ప్రభుత్వం అందించే పింఛన్ వస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇంటికి దరఖాస్తు చేసుకున్నాం. కానీ రాలేదు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థి గుణగణాలను చూసి ఓటేస్తాం. –రమ, పాన్‌షాపు, లింగంపల్లి పేదలకు న్యాయం జరగాలి నాకు అరవయ్యేళ్లు దాటాయి. వృద్ధాప్య పెన్షన్ రావడం లేదు. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే అదీ రాలేదు. – వెంకటేశ్వర్లు, చిరువ్యాపారి, హఫీజ్‌పేట కారిడార్ 5 సాగర్‌రింగ్‌రోడ్, బాలాపూర్, ఆర్సీఐ, శంషాబాద్ ఒకవైపే కాదు.... రెండో వైపు చూడండి గతంతో పోలిస్తే గడచిన తొమ్మిదిన్నరేళ్లలో అభివృద్ధి జరగడాన్ని అంగీకరిస్తూనే, వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం కూడా పట్టించుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆయా ఎమ్మెల్యేలు కేవలం తమ సన్నిహితులు, తమ అనుచరులు, కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ పేదలను విస్మరిస్తున్నారన్న వాదనలను వ్యక్తం చేశారు. అన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను సమన్యాయంతో అమలు చేయాలని కోరేవారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపించారు. పదేళ్లలో తమను పట్టించుకోలేదని, పేదలందరికీ న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడితే బావుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గురించి మౌత్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున ఉన్నా ఇక్కడ స్థానిక నాయకత్వం యాక్టివ్‌గా ఉన్నట్టుగా కనిపించడంలేదు. బీజేపీ కాస్త మెరుగ్గా ఉన్నా ప్రచారంలో దూసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రూపురేఖలే మారిపోయాయని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన బీఆర్ఎస్కు అక్కడ కొంత మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అర్హులకు నిరాశే మిగిలింది నేను పక్కా తెలంగాణవాదిని. ఒకే పార్టీకి రెండుసార్లకంటే ఎక్కువ పాలనాధికారాలు అందిస్తే నిరంకుశత్వంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోంది. సంక్షేమ పథకాలన్నీ అధికారపార్టీ ప్రతినిధులు, వారికి అనుకూలమైన వారి జేబుల్లోకే వెళుతున్నాయి. అర్హులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. – కాకి నవీన్‌గౌడ్, ప్రైవేట్ ఉద్యోగి, కర్మన్‌ఘాట్ చౌరస్తా ఉచితాలు కాదు ఉపాధి కావాలి నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. చదివితే కొలువు సాధించవచ్చని ఇంట్లో కొట్లాడి హాస్టల్లో ఉంటూ డిగ్రీ వరకు చదివాను. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఉద్యోగం రాలేదు. గత్యంతరం లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా. నిరుద్యోగ యువతకు ఉచితాలు వద్దు. ఉపాధి కావాలి. – బెయిన సుధాకర్, నిరుద్యోగి, సాయిరాంనగర్‌కాలనీ చౌరస్తా పెద్దకొడుకు మా కేసీఆర్ రాష్ట్ర సొంతింటి పెద్ద కొడుకు మా సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పెన్షన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, దళిత, బీసీ, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి నేనున్నానని∙భరోసా ఇస్తున్నాడు. మాకు ఇంకేం కావాలి. కాంగ్రెస్‌కు పాలన అందిస్తే సాగు, తాగునీటి కష్టాలు తప్పవు. రోజుకు మూడు గంటలే కరెంట్ ఇచ్చి చీకటి చేస్తరు. బీజేపీకి అధికారం ఇస్తే స్థానిక సమస్యలను గాలికి వదిలేస్తారు. –పోతురాజు జంగయ్య, దుర్గానగర్, అడ్డాకూలీ కారిడార్ 6 నాగోల్, కొత్తపేట, నల్లగొండ చౌరస్తా, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్ స్వచ్ఛ మూసీ ఎక్కడ? ట్రాఫికర్ తీరేదెలా? ఈ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మొగ్గు చూపినవారూ ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రయోజనాలు అందలేదని కొందరు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ విధానాలకు ఆకర్షితులైన వారు బీజేపీకి పట్టం కడతామంటున్నారు. స్వచ్ఛ మూసీ విషయంలో బీఆర్ఎస్ అశ్రద్ధ చేసిందనే వాదనలు కొంతమంది వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అత్యంత ఇబ్బందులకు గురిచేస్తోందని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం కావాలన్నవారు చాలామందే ఉన్నారు. నిత్యం ట్రాఫిక్ జాం, భారీ సంఖ్యలో వాహనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పేదలకు న్యాయం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాల ప్రజలు బతకవచ్చు. పెరిగిన నిత్యావసరాల ధరలతో పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాం. – నర్సింహ, ఆటోడ్రైవర్, మోహన్‌నగర్ సుస్థిర ప్రభుత్వం ఉండాలి రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఎలాంటి ఆటంకాల్లేకుండా ఐటీ సెక్టార్ హైదరాబాద్‌లో బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని జిల్లాలకు ఈ సెక్టార్‌ను విస్తరించడం మంచి పరిణామం. ఇంకా అభివృద్ధి జరగాలి. అందుకు సుస్థిర ప్రభుత్వం ఉండాలి. – సాయిసుమంత్, ఐఐఎం గ్రాడ్యుయేట్, దిల్సుఖ్నగర్ కారిడార్ 7 సికింద్రాబాద్, జేబీఎస్, బోయిన్పల్లి, అల్వాల్ ఆచరణ సాధ్యమేనా... మాస్ ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లకు నెలవైన ఈ ప్రాంతంలో అధికార బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున తమ మద్దతు వ్యక్తం చేశారు. పదిమందిలో సగం మంది కారుకే వేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పొందామన్నారు. ఇవే హామీలు కాంగ్రెస్ కూడా ఇస్తుందని ‘సాక్షి’ ప్రశ్నించగా కాంగ్రెస్ గ్యారంటీలమీద తమకు నమ్మకం లేదని, ఆచరణ సాధ్యం కాదని పలువురు చెప్పారు. ఒకవేళ ఇవ్వగలిగితే కేసీఆర్ ఇచ్చేవాడు కదా? అవి సాధ్యం కాలేనివి కాబట్టే బీఆర్ఎస్ చెప్పలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపేవారు కాదని, వారి ప్రచారం కూడా అంతంతే ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆరే రావాలి రాష్ట్రంలో పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ అంతే స్థాయిలో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ గెలవాలి. కంటోన్మెంట్లో సాయన్న చొరవతో నిరుపేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయి. పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఇలా అన్ని రకాల ప్రయోజనాలు దక్కాయి. కంటోన్మెంట్లో మరోసారి ఆ పార్టీకే అవకాశాలున్నాయి. – నారాయణముదిరాజ్, అంబేడ్కర్‌నగర్ బీసీబంధు బీజేపీకే ఓటు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీకే మా మద్దతు. నియో జకవర్గంలోని బీసీలంతా బీజేపీకే ఓటు వేస్తారని ఆశిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కంటోన్మెంట్లో బీజేపీ గెలిస్తేనే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. – సురేశ్, మారేడుపల్లి కారిడార్ 8 చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాందీభవన్ ప్రశాంతతకే పట్టం కడతాం పాతబస్తీ ప్రజలతోపాటు ఈ కారిడార్‌లోని పలువురు వ్యాపారులు ఎంఐఎంనే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. గోషామహల్ ప్రాంతంలో మిశ్రమ స్పందన కనిపించింది. కొందరు బీజేపీ, మరి కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పట్ల మొగ్గు చూపారు. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ నాయకత్వం పట్లనే అసక్తి కనబర్చారు. ప్రధానంగా మైనార్టీల సంక్షేమం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, షాదీముబారక్, రంజాన్ తోఫా, విద్య, వైద్యం విషయంలో బీఆర్ఎస్ కృషిని మరిచిపోలేమన్నారు. మైనార్టీలంతా ఎంఐఎం వైపు ఉంటామని తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. ఇదే పాలన కొనసాగాలి తొమ్మిదేళ్లుగా పర్యాటక కేంద్రం చార్మినార్ ప్రశాంతంగా ఉంది. చిరువ్యాపారాలపై ఒత్తిడి లేదు. శాంతి భద్రతల విఘాతం సమస్యలేదు. పరస్పర సహకారం బాగుంది. పాతబస్తీలో అసెంబ్లీ స్థానాలతోపాటు రాష్ట్రంలో కూడా ఇదే పాలనా కొనసాగాలి. – షేక్ చాంద్, చిరువ్యాపారి, చార్మినార్ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది రాష్ట్రంలో మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. ముస్లిం సంక్షేమం, చేయూ త బాగుంది. విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఉచితంగా పేదపిల్లలకు చదువు లభిస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే బాగుటుంది. –ముజాహిద్, అత్తర్ వ్యాపారి. యాకుత్‌పురా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. ప్రస్తుతం మార్పు అవసరం. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి – మహ్మద్ ఖలీల్, వ్యాపారి, ఓల్డ్‌సిటీ -
మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. దేశంలో పలు రాష్ట్రాలకు కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించామని, తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ రిజర్వేషన్లను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సంగారెడ్డి, నిజామాబాద్‌లలో జరిగిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను భ్రష్టాచార్ రాక్షస సమితిగా అభివర్ణించారు. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి సర్కారు భూములను చెరబట్టారని, హైదరాబాద్ మియాపూర్‌లో 692 ఎకరాల భూకుంభకోణం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని, రూ.38 వేల కోట్ల ఈ ప్రాజెక్టును రూ.1.20 లక్షల కోట్లకు పెంచి అందిన కాడికి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్‌రోడ్డు టెండర్లలోనూ రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని, దళితబంధు పథకంలో బీఆర్ఎస్ నాయకులు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రామగుండం కర్మాగారాన్ని పునఃప్రారంభించాం: కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నడ్డా విమర్శించారు. కర్ణాటకలో నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. కాంగ్రెస్ మాదిరిగానే కేసీఆర్ కూడా హామీల పేరుతో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ధరణి పోర్టల్ కాదు.. అది కేసీఆర్ భూములు హరించే పోర్టల్ అని చెప్పారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రత్యేకంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించిందని, వందేభారత్ రైళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నిరుపేదలకు ఏటా నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆడపిల్ల పుడితే పెళ్లి వయస్సు వచ్చే సరికి రూ.రెండు లక్షలు వచ్చేలా బాండ్లు ఇస్తామని, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి భారత్ తెలంగాణ కోసం బలిదానాలు చేసిన, ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులను సైతం కేసీఆర్ ప్రభుత్వం వంచించిందని నడ్డా వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతితో తన కుటుంబ సభ్యులను బాగుచేసుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, కవిత పాలన నడుస్తోందన్నారు. విభజన సమయంలో ధనికంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీతోపాటు అనేక హమీలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలో 5జీ నెట్వర్క్ తెస్తే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గప్లా (అక్రమాలు), గోటాలా (కుంభకోణాలు), గూస్కోరీ (అవినీతి), గరీబీ, గూండారాజ్ తెచ్చిందన్నారు. తెలంగాణలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలను మారుస్తామని, అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పసుపు శుద్ధి యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పసుపునకు మద్దతు ధర లభిస్తుందన్నారు. -
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు తెలంగాణకు రానున్నారు. ఈనెల 25న ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తా రని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. నాందేడ్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్ చేరుకోనున్న రాహుల్ అక్కడ ఎన్నికల ప్రచార సభ లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో మధ్యా హ్నం 2 గంటలకు ఆదిలాబాద్ వెళ్లి సభకు హాజరవు తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు వే ములవాడలో జరిగే సభకు హాజరవుతారని, అక్కడి నుంచి బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో బస చేయనున్న ప్రియాంక ఇంతకుముందు ఖరారైన ప్రియాంకాగాంధీ ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. 24, 25 తేదీల్లో ఆమె వరంగల్, సిద్దిపేట, కొత్తగూడెం, ఖ మ్మం జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు హాజ రవుతారు. శుక్రవారం మధ్యాహ్నం పాలకుర్తి, ఆ త ర్వాత హుస్నాబాద్, అనంతరం కొత్తగూడెం నియో జకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. నేడు ఖ మ్మంలోనే బస చేయనున్న ప్రియాంక 25న ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సభలకు హాజరవుతారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. నేడు, రేపు శివకుమార్ బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం హైద రాబాద్‌కు రానున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మధ్యా హ్నం 12 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌ డ్తో కలిసి ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతా రు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్న శివకుమార్ 25న హైదరాబాద్‌లోని పలు ని యోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల కు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.