రేపు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ

Published Fri, Nov 24 2023 4:07 AM

Rahul Gandhi to the state tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు తెలంగాణకు రానున్నారు. ఈనెల 25న ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తా రని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్‌ చేరుకోనున్న రాహుల్‌ అక్కడ ఎన్నికల ప్రచార సభ లో పాల్గొంటారు.

ఆ తర్వాత హెలికాప్టర్‌లో మధ్యా హ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌ వెళ్లి సభకు హాజరవు తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు వే ములవాడలో జరిగే సభకు హాజరవుతారని, అక్కడి నుంచి బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

ఖమ్మంలో బస చేయనున్న ప్రియాంక 
ఇంతకుముందు ఖరారైన ప్రియాంకాగాంధీ  ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. 24, 25 తేదీల్లో ఆమె వరంగల్, సిద్దిపేట, కొత్తగూడెం, ఖ మ్మం జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు హాజ రవుతారు. శుక్రవారం మధ్యాహ్నం పాలకుర్తి, ఆ త ర్వాత హుస్నాబాద్, అనంతరం కొత్తగూడెం నియో జకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. నేడు ఖ మ్మంలోనే బస చేయనున్న ప్రియాంక 25న ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో  సభలకు హాజరవుతారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

నేడు, రేపు శివకుమార్‌ 
బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం హైద రాబాద్‌కు రానున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ మధ్యా హ్నం 12 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వర్ధన్నపేట, వరంగల్‌ వెస్ట్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌ డ్‌తో కలిసి ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతా రు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్న శివకుమార్‌ 25న హైదరాబాద్‌లోని పలు ని యోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌ల కు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement