breaking news
-
తెలంగాణాలో కాంగ్రెస్ జోరు: సీతక్క ట్వీట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్‌లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఫలితాల్లో తన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్లో వైరల్‌గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. 200 cr Kcr money Vs seethakka After completing 13 rounds 20 thousand majority to seethakka .. More 9 rounds to go.. #TelanganaElectionResults @RahulGandhi @priyankagandhi @kharge @revanth_anumula @srinivasiyc — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
బీఆర్ఎస్లో మంత్రులకు బిగ్ షాక్.. ఓటమి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇక, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఓడిన మంత్రులు వీరే.. పాలకుర్తి.. ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం.. పువ్వాడ అజయ్‌కుమార్ నిర్మల్.. ఇంద్రకరణ్ రెడ్డి ధర్మపురి.. కొప్పుల ఈశ్వర్ మహబూబ్‌నగర్.. శ్రీనివాస్ గౌడ్.. వనపర్తి.. నిరంజన్ రెడ్డి. ఇక, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఇక్కడ విజయం సాధించారు. మరోవైపు.. ఖమ్మంలో పువ్వాడను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి చాలా సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఛాలెంజ్‌ను గెలిచి చూపించారు తుమ్మల. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ) చేతిలో ఇంద్రకరణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఓడించారు. మరోవైపు.. తాజాగా ప్రగతి భవన్ వద్ద పరిస్థితి ఇలా ఉంది.. #WATCH | #TelanganaAssemblyElections2023 | CM Camp Office in Hyderabad wears a deserted look as the ruling BRS trails in the state election, as per official EC trends. Chief Minister and party chief K Chandrashekar Rao is currently at the CM residence. Congress is leading in… pic.twitter.com/KidmLpbBD6 — ANI (@ANI) December 3, 2023 -
తెలంగాణాలో కాంగ్రెస్ బోణీ, సంబరాల్లో కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఎన్నికల కౌంటింగ్‌లో ఆదినుంచీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. అటు ఇల్లందులో కోరం కనకయ్య 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీ పడ్డారు. తాజా ట్రెండ్ ప్రకారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు అయినట్టే కనిపిస్తోంది. దీంత తుది ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
దూసుకెళ్తున్న కాంగ్రెస్.. రేవంత్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలించారు. ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j — Revanth Reddy (@revanth_anumula) December 3, 2023 -
ఫుల్ జోరులో కాంగ్రెస్.. సీఎం అభ్యర్థుల లీడింగ్ ఎలా ఉందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నేతలు భారీ మెజార్టీ సంపాదించారు. మరోవైపు, అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. మెజార్టీ ఇలా.. రేవంత్‌రెడ్డి.. 12వేల మెజార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 25వేల మెజార్టీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. 20వేల మెజార్టీ భట్టి విక్రమార్క.. 8వేల మెజార్టీ సీతక్క.. మూడు వేల మెజార్టీ ఇక, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే కీలక చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మా నేత సీఎం అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం అధిష్టానమే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో హస్తం శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | #TelanganaElection2023 | Congress workers pour milk on a poster featuring Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and state party chief Revanth Reddy as the party continues its lead in the state. As per the official EC trends, the… pic.twitter.com/IWi4QEz4EQ — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను కర్ణాటకకు తరలించే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాజ్‌కృష్ణలో డీకే శివకుమార్ సహా కర్ణాటక నేతలు బస చేశారు. లగ్జరీ బస్సులను కూడా తరలింపునకు రెడీ చేశారు. #WATCH | Congress cadre burst firecrackers outside the office of the party's state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt — ANI (@ANI) December 3, 2023 -
గెలుపు దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్‌తో రెడీగా డీకే శివకుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు.. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక, బీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు పలుచోట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసోర్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్లాన్ రచిస్తున్నారు. ట్రబుల్ షూటర్ డీకే.. శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు చేరుకొని ఎన్నికల ఫలితాలను విక్షిస్తున్నారు. #WATCH | On being asked if party MLAs will be shifted to Bengaluru as buses stationed outside Hyderabad's Taj Krishna, Congress leader & Karnataka minister Rahim Khan says, "If that situation comes, then party high command will decide." pic.twitter.com/nrAXP5MgQr — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతలు తాజ్‌కృష్ణలో రూమ్స్‌ను బుక్ చేసుకున్నారు. దాదాపు 100 గదులను రిజ్వర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను తాజ్‌కృష్ణకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్ చేసింది. Telangana | Luxury buses have been stationed at Hyderabad's Taj Krishna. pic.twitter.com/1hJsAsfJrd — ANI (@ANI) December 3, 2023 -
కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్ సీనియర్లు’
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి ప్రచారంలో అగ్రబాగాన నిలిచారు. సీనియర్ నాయకుడు యడవెల్లి రంగశాయిరెడ్డి కుమారుడు యడవెల్లి వల్లభ్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ, నిడమనూరు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత కుమారుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు మేరెడ్డి వెంకట్, కుందూరు లక్ష్మారెడ్డి కుమారుడు దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ చేకూర హన్మంతరావు కుమారుడు చేకూరి శంశీచరణ్ కాంగ్రెస్‌లో చేరి జయవీర్ తరఫున విస్తృ త ప్రచారం ఇర్వహించారు. నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్ అమెరికా నుంచి, కుందూరు దేవేందర్‌రెడ్డి కెనడా నుంచి వచ్చి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవెల్లి నరేందర్‌రెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి సైతం జయవీర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ ప్రచారంలో ఎంతో కలివిడిగా ప్రజలతో మమేకమయ్యాడు. కొన్ని గ్రామాల్లో ఓటర్లు కుందూరు జానారెడ్డి కుమారుడు ఎవరు, ఏడీ అని అడిగిన వారికి వారిని వాహనం వద్దకు తీసుకెళ్లి ఇతనే కుందూరు జయవీర్‌రెడ్డి అని చెప్పి పరిచయం చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకతి సత్యం కూడా దివంగత సీనియర్ నేత అంకతి వెంకటయ్య కుమారుడే, మండల యూత్ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్‌గౌడ్ కూడా సీనియర్ నాయకుడు నర్సింగ్ కృష్ణయ్య కుమారుడే కావడం గమనార్హం. యువ రక్తంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆకట్టుకున్నారు. ఆదివారం వెబడే ఫలితాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాల్సిందే. -
TS: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా.. -
తెలంగాణ రిజల్ట్..ప్రత్యక్షప్రసారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందోనన్న అంశంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ను ప్రత్యేక ప్రసారం ద్వారా చూడండి. -
అక్బరుద్దీన్ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి
చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు. ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఒబేద్ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధమని తెలిపిన నేతలు గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందించిన పార్టీ బృందం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుంది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరతాం: డీకే శివకుమార్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్‌కు చెప్పనున్న కాంగ్రెస్ నేతలు కాసేపట్లో సీఎల్పీ సమావేశం హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హోటల్లో డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ నలుగురు పరిశీలకులు తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. మ్యాజిక్ ఫిగర్ 60 తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌ను కోరిన గవర్నర్ తమిళిసై పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ 23వ రౌండ్ కౌంటింగ్ ని నిలిపివేసిన అధికారులు రీ కౌంటింగ్ చేయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అధికారులు, RO తో మాట్లాడుతున్న కాట శ్రీనివాస్ కౌంటింగ్ కేంద్రం ముందు భారీగా చేరుకున్న మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా కార్యకర్తలు రావడంతో కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మా సీఎం అభ్యర్థి పార్టీ కోసం కష్టపడ్డాడు.. గెలిపించాడు.. మా హైకమాండ్ కూడా రేవంత్ కు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటుంన్నా.. ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గత ఎన్నికల కంటే తగ్గిన మెజార్టీ హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. మరి కొద్దిసేపట్లో హోటల్ కు చేరుకోనున్న 27 మంది గెలిచిన ఎమ్మెల్యే లు రాత్రి 9 గంటలకు సీఏల్పీ మీటింగ్.. ఆలోపే గెలిచిన ఎమ్మెల్యేలు హోటల్ కు రావాలని పిలుపు రీకౌంటింగ్‌ను కోరిన బండి సంజయ్. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల గెలుపుపై రీకౌంటింగ్ కు కోరిన బండి సంజయ్.. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అప్పీల్ చేసిన సంజయ్.. నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు 1.బాన్సువాడ లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పై 23,464 ఓట్ల మెజారిటీతో విజయం. 2.బాల్కొండ లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత రెడ్డి విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి పై 4,533 ఓట్ల మెజారిటీతో గెలుపు. 3.నిజామాబాద్ అర్బన్ లో బీజేపి అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారాయణ విజయం సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పై 15,387 మెజార్టీ గెలుపు 4.ఆర్మూర్ లో బీజేపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఘన విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పై 29,669 ఓట్ల మెజారిటీతో గెలుపు. 5.నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి విజయం సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై 21,963 ఓట్ల మెజారిటీతో విజయం. 6.బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ పై 3,062 ఓట్ల మెజారిటీతో విజయం. సిద్ధిపేటలో హరీష్ రావు విజయం సిద్ధిపేటలో హరీష్ రావు విజయం 2018 కంటే తగ్గిన మెజారిటీ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి 6789 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ పై గెలుపొందిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి మూడో స్థానంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ: పీటీఐ వర్గాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కు ఈసీ నోటీసులు వివరణ ఇవ్వాలని ఇద్దరికీ ఆదేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి గుల్లంగన కింద అధికారులపై ఈసీ చర్యలు హుజూరాబాద్‌లో ఈటల ఓటమి హుజూరాబాద్‌లో ఈటల ఓటమి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌషిక్ రెడ్డి ఈటలపై విజయం కరీంనగర్లో స్వల్ప మెజార్టీతో గంగుల కమలాకర్ గెలుపు కేవలం 326 ఓట్ల మెజార్టీతో గెలుపు రీకౌంటింగ్ కోరిన బండి సంజయ్ రేపు(సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం సీఎం ఎవరు అనే దానిపై కసరత్తు సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చిన కేసీఆర్ ఎల్బీనగర్లో బీఆర్ఎస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు. బోధ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ముందంజ రెండో స్థానంలో కేసీఆర్, మూడో స్థానంలో రేవంత్ 15వ రౌండ్ ముగిసే సరికి 3వేల మెజార్టీతో బీజేపీ ఇంకా నాలుగు రౌండ్స్ మిగిలి ఉన్నాయి. వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి విజయం ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్మా బుజ్జు విజయం చెవెళ్లలో బీఆర్ఎస్ విజయం స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ డిమాండ్ ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి విజయం సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు 29వేల మెజార్టీతో కేటీఆర్ విజయం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు గెలుపు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డా. మురళీనాయక్ విజయం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు గెలుపు. నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి విజయం నర్సంపేటంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడ్ సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి ముందంజ ఐదువేల ఓట్లతో లీడ్‌లో జగదీష్ రెడ్డి ఇది తెలంగాణ ప్రజల విజయం: భట్టి మధిరలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తాను. దొరల తెలంగాణ పాలన పోయింది, ప్రజల తెలంగాణ పాలన వచ్చింది. ఇది తెలంగాణ ప్రజల విజయం దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ విజయం తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి కొల్లాపూర్‌లో కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు బర్రెలక్క(శిరీష) ఓటమి మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్ట విక్రమార్క గెలుపు మధిరలో 35వేల మెజార్టీతో భట్టి విజయం హుస్నాబాద్‌లో ముందంజలో పొన్నం ప్రభాకర్ 11వేలకుపైగా ముందంజలో కొనసాగుతున్న పొన్నం గోషామహల్లో రాజాసింగ్ గెలుపు ఆర్మూర్‌లో బీఆర్ఎస్కు షాక్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓటమి బోధన్‌లో కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు తుంగుత్తురిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామూల్ గెలుపు. మంథనిలో శ్రీధర్‌బాబు గెలుపు 30వేలకు పైగా మెజార్టీతో గెలుపు సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ గెలుపు. మునుగోడులో 21వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు. చరిత్రను తిరగరాసిన స్పీకర్ పోచారం తెలంగాణ చరిత్రలో స్పీకర్‌గా ఓడిపోవడం అనవాయితీ కానీ, ఈ ఎన్నికల్లో పోచారం విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం బ్రదర్స్(వినోద్), కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పటోళ్ల సంజీవ రెడ్డి భారీ గెలుపు. బాన్సువాడలో పోచారం గెలుపు బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం విజయం మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు. ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చేవెళ్ల, స్టేషన్‌ఘన్‌పూర్ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఓటమి నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ విజయం హుజుర్నగర్లో ఉత్తమ్ కుమార్ విజయం 46వేల మెజార్టీతో ఉత్తమ్ గెలుపు కొడంగల్‌లో రేవంత్ విజయం 32వేల మెజార్టీతో రేవంత్ గెలుపు భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సిరిసిల్లలో కేటీఆర్ 25వేల ఆధిక్యం. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి విజయం హుజురాబాద్‌లో 10వేల మెజార్టీలో పాడి కౌశిక్ రెడ్డి. హుస్నాబాద్‌లో 14వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 11,515 ఆధిక్యత దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం రఘునందన్ రావు ఓటమి. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ గెలుపు 14వేల మెజార్టీతో తుమ్మల విజయం జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు విజయం మధిరలో భట్టి విక్రమార్కకు 22వేలకుపైగా ఓట్ల ఆధిక్యం నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ విజయం 54వేలకు పైగా భారీ మెజార్టీలో కోమటిరెడ్డి గెలుపు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామెదర రాజనర్సింహ గెలుపు 24వేల భారీ మెజార్టీతో భారీ విజయం బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం బెల్లంపల్లిలో భారీ ఆధిక్యంలో వివేక్ సూర్యాపేటలో ముందంజలో మంత్రి జగదీష్ రెడ్డి. ఓటమి దిశగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్కు బిగ్ షాక్ పోటీ చేసిన గజ్వేల్, హుజురాబాద్‌లో ఓటమి దిశగా ఈటల సికింద్రాబాద్ నియోజకవర్గం రౌండ్ నెంబర్: 11 BRS: 4460 BJP: 2315 NC: 2093 11వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2145 11వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 32883 ఓట్లతో ఆధిక్యం.. గాంధీ భవన్‌కు భారీ ర్యాలీతో బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్‌కు చేరుకున్న డీకే శివకుమార్ నల్గొండలో 44 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంబర్‌పేటలో బీఆర్ఎస్ విజయం కాలేరు వెంకటేశ్ గెలుపు. నాగర్‌కర్నూల్‌లో వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బహదూర్‌పురలో విజయం దిశగా ఎంఐఎం షాద్ నగర్లో 12వ రౌండ్ ముగిశాక కాంగ్రెస్ అభ్యర్ధి 1407 లీడ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు తెలంగాణలో జనసేన పరిస్థితి ఇది.. డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఎనిమిది చోట్ల అదే పరిస్థితి ప్రధాన పార్టీలకు ఏమాత్రం దరిదాపుల్లో ఓట్లు దక్కించుకోని జనసేన అభ్యర్థులు 80కి పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కుత్బుల్లాపూర్‌లో 60,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో 11 రౌండ్లు ముగిసే సరికి 19798ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగా రెడ్డి ముందంజ అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థికి 9వ రౌండ్ లో 14,624 ఓట్ల ఆధిక్యం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ డీజీపీ వెంట సీనియర్ ఐపీఎస్‌లు కూడా పూల బొకేలు ఇచ్చి రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పిన అధికారులు తాండూరులో 800 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ 8వ రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 16,136 లీడ్ రంగారెడ్డి జిల్లా 14 స్థానాల్లో 11లో బీఆర్ఎస్కు ఆధిక్యం, 3 కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ఠాకూర్ విజయం చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ విజయం ఆంధోల్ నియోజకవర్గంలో 14 రౌండ్ ముగిసేసరికి 20 వేల పై చిలుకు ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు.. ఉత్తమ్ స్పందన తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో సోనియా ఉన్నారు: ఉత్తమ్ 2014, 2018 ఎన్నికల్లో మేము కొన్ని తప్పులు చేశాం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తున్నారు మేడ్చల్‌లో మల్లారెడ్డికి 23 వేల ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి రేవంత్‌రెడ్డి లీడ్ చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థికి 14 వేల లీడ్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ ఆరు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వినిరెడ్డి సిరిసిల్లలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాకలో పదవ రౌండ్ మూసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 32,349 ఓట్ల ఆదిక్యత కూకట్‌పల్లిలో ఏడవ రౌండ్ ముగిశాక.. 29,805 లీడ్‌లో కృష్ణారావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం.. బాణసంచా కాలుస్తూ సంబురాలు మరొకొందరు హస్తం కార్యకర్తలు సోనియా గాంధీ ఫొటోకు పాలభిషేకం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు... నగర శివారు ప్రాంతాల్లో BRS హవా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో విజయతీరాల్లో BRS రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఎల్బీనగర్ లో BRS బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఆరో రౌండ్ ముగిసినా.. ఈటల వెనుకంజ హుజురాబాద్‌లో ముగిసిన ఆరో రౌండ్ పాడి కౌశిక్‌రెడ్డి ముందంజ ఆరువేల ఓట్లకు పైగా ఆధిక్యం రెండోస్థానంలో కాంగ్రెస్ తొలి రౌండ్‌నుంచి.. మూడో స్థానంలోనే కొనసాగుతున్న ఈటల ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 13,000 లీడ్ ఖానాపూర్‌లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు హుజూరాబాద్‌లో ఆరో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి లీడ్ మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్) 15 వేల ఆధిక్యం పెద్దపల్లిలో 17వేల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు భద్రాచలంలో గెలుపు దిశగా బీఆర్ఎస్? పదో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ 5,155 ఇంకా మిగిలి ఉన్న మూడు రౌండ్స్ శేరిలింగంపల్లిలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ మధిరలో 15వేల ఓట్ల ఆధిక్యంలో విక్రమార్క కామారెడ్డిలో 1200 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో 12 వేల ఓట్ల ఆధిక్యంలో యూకత్పురలో ఆధిక్యంలో బీజేపీ బహదూర్‌పురలో ఆధిక్యంలో ఎంఐఎం దేవరకద్రలో 600 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ సంగారెడ్డిలో ఆధిక్యంలో బీఆర్ఎస్ బర్రెలక్కకు 1200 ఓట్లు నాంపల్లి 100 ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం ములుగు నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క(అనసూయ) 12,673 ఓట్ల ఆధిక్యం ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి 21,349 మెజార్టీలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి. జహీరాబాద్ ఆరో రెండు ముగిసే సరికి 906 ఓట్ల స్వల్ఫ ఆదిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు. మధిరలో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి మల్లు భట్టి విక్రమార్కకు 15819 ఓట్ల మెజార్టీ ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం బోణీ కొట్టిన కాంగ్రెస్ తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం పినపాక 7వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ 14,307 భద్రాచలం 8వ BRS లీడ్ 2853 అశ్వారావుపేట 12వ కాంగ్రెస్ 26306 ఇల్లండు 12th కాంగ్రెస్ 35 241 కొత్తగూడెం 6వ CPI లీడ్ 13,820 మంచిర్యాల్లో నాల్గవ రౌండు ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌కు 10,107 మెజార్టీ హుస్నాబాద్ లో 8 వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు 6235 లీడ్ ఖానాపూర్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి.. బీజేపీ 700 ఓట్ల లీడ్ సనత్ నగర్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 11658 ఓట్ల ఆధిక్యం భువనగిరిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత కంటోన్మెంట్లో ఐదు రౌండ్లు ముగిసేసరికి.. 21 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్య నందిత సాయన్న ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో.. కాంగ్రెస్ 59 బీఆర్ఎస్ 37 బీజేపీ 9 ఎంఐఎం 1 తుమ్మలకు 8 వేల లీడ్ మహబూబ్‌నగర్‌లో 65 ఓట్ల ఆధిక్యంలో శ్రీనివాస్‌గౌడ్ ఆరుగురు మంత్రులు ఓటమి బాటలో? ఆధిక్యంలో ఘోరంగా వెనుకబడిన ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఐదు వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం భూపాలపల్లి నాలుగవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యo 9285 మేడ్చల్‌లో 11వ రౌండ్ ముగిసేసరికి 17,856 ఆధిక్యంలో మల్లారెడ్డి లీడ్ దుబ్బాకలో ఆరో రౌండు ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 20,799 ఓట్ల ఆధిక్యం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు ఆధిక్యం 11,791 లీడ్ హుజురాబాద్‌లో ఈటల మూడో ప్లేస్ మూడు రౌండ్లు ముగిసేసరికి కౌశిక్‌రెడ్డి లీడ్ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ మూడోస్థానంలో కొనసాగుతున్న ఈటల జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ లీడ్ మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకి 10590 ఆధిక్యం ఖమ్మం అశ్వారావుపేట 8 రౌండ్లకు కాంగ్రెస్16125 ఆధిక్యత సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనుకంజ బోథ్ నియోజకవర్గం లో 4వ రౌండ్ లో బీ అర్ ఎస్ అభ్యర్థి అనిల్ 3,353 లీడ్ పాలేరు లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2164 ఓట్ల ఆధిక్యం కరీంనగర్లో బండి సంజయ్ ముందంజ ఐదో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలోకి వచ్చిన బండి సంజయ్ కరీంనగర్లో 943 ఓట్లతో బండి లీడ్ నిజామాబాద్ రూరల్‌లో ఏడో రౌండ్ ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి 8521 ఓట్ల ఆధిక్యం రాజేంద్ర నగర్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 68 లోని ఈవీఎం మొరాయిo చడంతో నిలిచిన కౌంటింగ్ పటాన్చెరులో మూడో రౌండ్ ముగిసేసరికి 369 ఓట్ల తో లీడ్ మూడు రౌండ్లు ముగిసే సరికి గజ్వేల్‌లో కేసీఆర్ లీడ్.. 3020 నల్గొండలో ఎనిమిది రౌండ్స్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 25వేల ఓట్ల అధిక్యం ఆసిఫాబాద్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ కోవ లక్ష్మి మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి 2440ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు సూర్యాపేటలో నాలుగో రౌండ్ ముగిసేసరికి.. 2657 బీఆర్ఎస్ జగదీశ్వర్‌రెడ్డి లీడ్ పటాన్చెరులో 264 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ బహదూర్‌పూర్‌లో700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఆర్మూర్‌లో బీజేపీకి 2 వేల ఓట్ల ఆధిక్యం గద్వాల్లో 5,700 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ శేరిలింగంపల్లిలో 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఖమ్మంలో తుమ్మలకు 4 వేల ఓట్ల ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్-53 బీఆర్ఎస్-31 బీజేపీ-6 సీపీఐ-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొత్తం 6511 ఓట్ల మెజారిటీ పటాన్ చెరు రెండో రౌండ్ ఆధిక్యంలో కాంగ్రెస్.. 264 ఓట్ల ఆధిక్యం కామారెడ్డిలో ఆధిక్యంలోకి వచ్చిన కేసీఆర్ 600 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ సిరిసిల్లలో 3,749 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ భూపాలపల్లిలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కార్వాన్, బహదూర్‌పురాలో బీజేపీ లీడ్ మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ మైనంపల్లి వెనుకంజ మెదక్‌లో మైనంపల్లి కొడుకు రోహిత్ ముందంజ జూబ్లీహిల్స్‌లో 900 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు 7 వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 4 వేల ఓట్ల లీడ్‌లో రేవంత్‌రెడ్డి వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ముందంజ గజ్వేల్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి 920 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ కొల్లాపూర్‌లో బర్రెలక్కకు కేవలం 400 ఓట్లు మాత్రమే! చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 4 వేల ఓట్ల ఆధిక్యం సికింద్రాబాద్‌లో పద్మారావు ఆధిక్యం సిరిసిల్ల మూడో రౌండ్లో 2,621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెనుకంజ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. ఆసిఫాబాద్ సెగ్మెంట్ మూడవ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి 2,420 ఓట్ల ఆదిక్యం మంథని నియోజకవర్గంలో 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు 3425 లీడ్ ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ నాలుగో రౌండు మూసేసరికి 6245 కోట్ల ఆధిక్యం ములుగు నియోజకవర్గంలో ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 7461 ఓట్ల ఆదిక్యం నిజామాబాద్ అర్బన్‌లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 47 బీఆర్ఎస్ 26 బీజేపీ 3 హుస్నాబాద్ మూడో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 74 4 ఆధిక్యత. .. మొత్తం ఆధిక్యత 2250 ఖమ్మం పాలేరులో 3 వ రౌండ్ అయిపోయే సరికి పొంగులేటి సుమారు 7000 లీడ్ మూడో రౌండ్లు ముగిసేసరికి.. కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యం కల్వకుర్తిలో 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డిలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 తాండూరులో 139 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బెల్లంపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వినోద్ సత్తుపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్లకు పైగా లీడ్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కొరుట్లలో బీఆర్ఎస్ సంజయ్‌కి ఆధిక్యం నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ లీడ్ పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ ఉప్పల్‌లో బీఆర్ఎస్ ముందంజ మేడ్చల్‌లో మల్లారెడ్డికి 2 వేలకు పైగా లీడ్ నల్గొండలో ఐదో రౌండ్ ముగిసేసరికి 17 వేల ఆధిక్యంలో కోమటిరెడ్డి హుజూర్ నగర్లో 12 వేల ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ హుజూరాబాద్‌లో ఈటల వెనుకంజ రెండో రౌండ్లోనూ కౌశిక్ మందంజ కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్ గజ్వేల్‌లో కేసీఆర్ వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యం గోషామహల్లో రాజాసింగ్ వెనుకంజ నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం నర్సంపేటలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం ఖమ్మం నియోజకవర్గంలో మూడో రౌండ్ ముగిసే నాటికి తుమ్మల 796 ఆధిక్యం పినపాకలో రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం డోర్నకల్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజ కామారెడ్డిలో 1162 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి మెదక్‌లో 7 బీఆర్ఎస్, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం నిర్మల్‌లో బీజేపీ ఆధిక్యం ఆలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు లీడ్ ఆశ్వారావుపేటలో ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ సూర్యాపేటలో రెండో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం.. లీడ్ కొచ్చిన జగదీశ్‌రెడ్డి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు ఆధిక్యం ఖైరతాబాద్‌లో దానం ముందంజ రామగుండంలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ 12 వేలకు పైగా లీడ్ కూకట్‌పల్లిలో మాధవరం లీడ్ 7 వేలకు ఓట్లకు పైనే కొత్తగూడెంలో కూనంనేనికి 3వేలకు పైగా(3,350) ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రేవంత్ సిరిసిల్లలో కేటీఆర్‌కు 1500 వందల ఓట్లకు పైగా లీడ్ అంబర్‌పేట రెండో రౌండ్లో బీఆర్ఎస్కు ఆధిక్యం సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ సంబరాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరంగల్ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజలో.. రంగారెడ్డి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 2 నిజామాబాద్ కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ 3, బీఆజేపీ 3 ఆదిలాబాద్ కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీ 2 ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు అనూహ్య ఫలితాలు మహేశ్వరంలో రెండో రౌండ్లో సబితా ఇంద్రారెడ్డి మందంజ నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి మందంజ ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం కరీంనగర్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజ భువనగిరి రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12, బీజేపీ 1 స్థానాల్లో ముందంజ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకంజ తొమ్మిది కాంగ్రెస్, ఒకటి సీపీఐ నిజామాబాద్‌లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యం రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి.. సీతక్కకు 3 వేల ఓట్లకు పైగా లీడ్ మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ముందంజ జనగామలో బీఆర్ఎస్ లీడ్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ నల్గొండ నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి.. 12 వేల ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి ఆధిక్యం 4,389 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ హుజూరాబాద్ తొలి రౌండ్లో కౌశిక్‌రెడ్డి ముందంజ వెనుకబడిన ఈటల వికారాబాద్‌లో మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కరీంనగర్లో గంగుల ముందంజ 1145 ఓట్ల ఆధిక్యంలో గంగుల బాల్కొండలో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో కాంగ్రెస్ ముందంజ రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చిన కేటీఆర్ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ముందంజ గజ్వేల్‌లో ఈటల వెనుకంజ పటాన్చెరులో బీఆర్ఎస్ ఆధిక్యం సత్తుపల్లిలో 2,240 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం తొలి రౌండ్లో కేటీఆర్ వెనుకంజ 265 ఓట్లతో వెనుకబడిన కేటీఆర్ సిర్పూర్లో బీజేపీ ముందంజ ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజ రెండో రౌండ్లో.. రెండో రౌండ్లోనూ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ముందంజ 1962 ఓట్లతో ముందంజలో రేవంత్ దుబ్బాకలో తొలి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్లో వెనుకబడ్డ పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ప్రముఖులు వెనుకంజ వీళ్లే.. మానుకొండూరులో రసమయి పాలకుర్తిలో ఎర్రబెల్లి తుంగతుర్తిలో గాదరి వెనుకంజ ఆదిలాబాద్ జోగురామన్న కేటీఆర్ చార్మినార్‌లో తొలిరౌండ్లో బీజేపీ ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొత్తగూడెంలో సీపీఐ ముందంజ పాలేరులో పొంగులేటి ముందంజ కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ ముందంజ సనత్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని ముందంజ బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధిక్యం ములుగులో కాంగ్రెస్ సీతక్క ముందంజ మెదక్‌లో 5 వేలపై ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్ పొంగులేటికి 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం హైదరాబాద్‌లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం మానుకొండూరులో కాంగ్రెస్ ముందంజ నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ ముందంజ నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ముందంజ తాండూర్‌లో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ముందంజ బీజేపీ తొలి రౌండ్ ఇలా.. మహేశ్వరంలో బీజేపీ ఆధిక్యం నిర్మల్లోనూ బీజేపీ లీడ్ కరీంనగర్లో బండి సంజయ్ లీడ్ ఆర్మూర్‌లో కాంగ్రెస్ ముందంజ ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ దానం నాగేందర్ ముందంజ వరంగల్ తూర్పులో కొండా సురేఖ ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ ముందంజ బీఆర్ఎస్ తొలి రౌండ్లో.. నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం సనత్ నగర్లో తలసాని జుక్కల్‌లో ముందంజ గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్‌కు 300 ఓట్ల ఆధిక్యం పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ శేరిలింగంపల్లిలో గాంధీ సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్‌లో.. ముషీరాబాద్‌లో భూపాలపల్లిలో తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా ఈవీఎం లెక్కింపు తొలి రౌండ్లో.. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజ మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యం అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజ ఈవీఎం ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్లో.. భువనగిరి లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముందంజ నల్లగొండ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ మిర్యాలగూడ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ భట్టి విక్రమార్క మొదటి రౌండ్లో 2022 ఓట్ల మెజార్టీ ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఆధిక్యం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 800 ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో ఇండిపెండెంట్ బర్రెలక్క ముందంజ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు.. ఉమ్మడి వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ముందంజ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో.. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజ హుజురాబాద్ పోస్టల్ కౌంటింగ్‌లో ఈటల ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో అనూహ్యంగా ముందంజలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కౌంటింగ్‌పై సీఈవో స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నడుస్తోంది 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది ఈవీఎం లెక్కింపు ప్రారంభం అయ్యింది ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు...ప్రశాంతంగా కౌంటింగ్ నడుస్తోంది ఇబ్రహంపట్నం ఘటనలో ఫిర్యాదులు వచ్చాయి డీఈవో వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు ఇబ్రహీంపట్నం ఘటన సమసిపోయింది... అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ చూపించాం ఇబ్రహీంపట్నంలోనూ కౌంటింగ్ ప్రారంభం అయింది పోస్టల్ బ్యాలెట్ కామారెడ్డి, కరీంనగర్లో బీజేపీ ముందంజ నల్గొండలో కాంగ్రెస్ ముందంజ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్(ఎంఐఎం) ముందంజ ఖమ్మం, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల, భట్టి ముందంజ హుజూరాబాద్‌లో ఈటల ముందంజ కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ముందంజ పరిగి, వికారాబాద్, తాండూరులో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు వేములవాడలో కాంగ్రెస్ ముందంజ సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిలో.. ఇంకా మొదలుకాని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు #WATCH | Counting of votes gets underway in Telangana's Karimnagar pic.twitter.com/35Fw96EglQ — ANI (@ANI) December 3, 2023 ప్రగతి భవన్ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత అధికారం మాదే: మాణిక్‌రావ్ ఠాక్రే తెలంగాణలో 70 సీట్లు కచ్చితంగా గెలుస్తాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయి మీడియాతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నేతల్లోనే కాదు.. అందరిలో ఉత్కంఠ తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల నిరీక్షణకు నేటితో తెర రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం హోరాహోరీ రాజకీయపోరులో తలపడుతున్న 2,290 మంది అసెంబ్లీలో అడుగుపెట్టబోయే ఆ 119 మంది ఎవరో అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర మొత్తం 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అధికార కైవసానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60. ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై హస్తం పార్టీ ధీమా మళ్లీ అధికారం మాదేనని బీఆర్ఎస్ కచ్చితంగా కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ ఇండిపెండెంట్ల ప్రభావం ఎంత? పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 12వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1లక్ష 80వేల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్ ఉదయం 8.30గం.కి ప్రారంభం కానున్న ఈవీఎంల కౌంటింగ్ సంగారెడ్డి జిల్లా అందోల్ (36) స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఓపెన్ చేసిన ఎన్నికల అధికారులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 131 టేబుళ్ల ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.20 లక్షల ఓట్లు ఉదయం 8గం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అరగంట నుంచి గంట లోపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగింపు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం ఖమ్మంలో.. మొత్తం 14,378 పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఆన్ లైన్ ద్వారా 150 మంది దరఖాస్తు చేసుకుని బ్యాలెట్ పంపించారు వయో వృద్ధులు, దివ్యాంగులు 2290 మంది ఇంటి వద్ద ఓటు వేశారు విధులలో పాల్గొన్న సిబ్బంది ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 క్యాంపు రాజకీయాల ప్రచారం అవాస్తం: భట్టి కాంగ్రెస్ క్యాంపు రాజకీయా ప్రచారం అవాస్తవం. మేము 70 నుంచి 80 సీట్లు గెలుస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. సీఎంగా ఎవరిని చేయాలన్నది అధిష్టానం చూసుకుంటుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది: జోగు రామన్న తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ సెంటర్‌కు తరలిస్తున్న అధికారులు. పోటాపోటీ ధీమా హ్యాట్రిక్ లోడింగ్ 3.0 అంటూ కేటీఆర్ ట్వీట్ ఎగ్జిట్‌పోల్స్‌తో అయోమయానికి గురికావొద్దని భరోసా రాబోయే ప్రభుత్వం మనదేనంటూ కాంగ్రెస్ పోస్టర్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పార్టీల ఏజెంట్లు(అభ్యర్థులు) తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎంల ఫలితాలు ఉదయం తొమ్మిది గంటలకే ఈవీఎం తొలి ఫలితం? పోస్టల్‌బ్యాలెట్ ఓటింగ్‌లో.. అత్యధికంగా కుత్బుల్లాపూర్, తర్వాత మేడ్చల్ పెద్దపెల్లి జిల్లాలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మొత్తం 4164.. పెద్దపెల్లిలో 1356 మంథనిలో 993 రామగుండంలో 1815 ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 ఆదిలాబాద్ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఏజెంట్లు అభ్యర్థితో పాటు పదహారు మందికి అనుమతి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే జోగురామన్న, స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి ప్రధాన నేతలు గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ కొడంగల్, కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి పోటీ గజ్వేల్, హూజురాబాద్ నుంచి ఈటల పోటీ గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటల, కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ సిర్పూర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధిరలో భట్టి విక్రమార్క హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్లో బండి సంజయ్ కొరుట్లలో ధర్మపురి అర్వింద్ దుబ్బాకలో రఘునందన్ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మల్కాజ్‌గిరిలో మైనంపల్లి, మెదక్‌లో మైనంపల్లి తనయుడు రోహిత్ కంటోన్మెంట్లో గద్దర్ కూతురు వెన్నెల చంద్రాయగుట్టలో అక్బరుద్దీన్ పోటీ సిరిసిల్ల కేటీఆర్ సిద్ధిపేట హరీష్‌రావు బరిలో కొల్లాపూర్ బర్రెలక్క(కర్నె శిరీష), రామగుండం సోమారపు సత్యనారాయణ, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్ తదితరులు కూడా.. లెక్కింపు కేంద్రంలో.. ఓట్ల లెక్కింపునకు.. 14 టేబుళ్లు (పోలింగ్ కేంద్రాలు 350కి మించిన చోట 28 టేబుళ్లు) ఒక్కో టేబుల్ వద్ద.. సూపర్వైజరు, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్, పోటీలోని అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటు సెల్‌ఫోను.. ఆర్వో, పరిశీలకులు, ప్రత్యేక అధికారుల ఫోన్లకే అనుమతి తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్ చివరిగా శేరిలింగంపల్లి ఫలితం ఎక్కువ మంది పోటీ చేయడంతో.. సిద్ధిపేట గజ్వేల్ ఆలస్యమయ్యే అవకాశం కౌంటింగ్ ఇలా.. ఉదయం 5: 00 లెక్కింపు కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ఉదయం 7: 00 టేబుళ్ల వద్ద పని మొదలు ఉదయం 8: 00 తపాలా ఓట్ల లెక్కింపు ప్రారంభం ఉదయం 8: 30 మొదటి రౌండు తపాలా ఓట్ల ఫలితం ఉదయం 9:00 ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు, కొన్ని చోట్ల ఉదయం 8.30 నుంచి ఉదయం 9: 30 మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం ప్రతి 15-20నిమిషాల నుంచి అరగంటకోసారి ఒక్కో రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం కౌంటింగ్.. టిక్ టిక్ కాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కోసం 500 ఓట్ల కోసం ఒక టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుల్స్ అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు 1,798 టేబుల్స్, మొత్తం 2417 రౌండ్లలో లెక్కింపు పూర్తి ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుల్స్ 11 గంటల వరకు ఫలితాల సరళిపై రానున్న స్పష్టత ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119, మ్యాజిక్ ఫిగర్ 60 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ప్రతీ 15-20 నిమిషాలకు రౌండ్ ఫలితం కీలకంగా ఫలితాలు ఇవాళ తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలువడనున్న ప్రజా తీర్పు కావడంతో కీలకంగా భావిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ స్వయంగా 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు ప్రత్యేకంగా మ్యానిఫెస్టోల విడుదల నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చి.. మిగిలిన 118 నియోజకవర్గాల్లో పోటీ భాజపా అభ్యర్థులు 111, ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ బీఎస్పీ 107, సీపీఎం 19 స్థానాల్లో పోటీ మొత్తం 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, అయిదుగురు ఎమ్మెల్సీలు పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరి బరిలో దిగగా.. పలువురు స్వతంత్రులూ.. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, సీపీఐ, సీపీఎంల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సహా పలువురు కీలక నేతలు నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై ధీమాగా హస్తం పార్టీ మళ్లీ అధికారం మాదేనంటున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ వీడనున్న శాసనసభ ఎన్నికల ఉత్కంఠ 2.36 కోట్ల మంది తెలంగాణ ఓటర్ల తీర్పు వెలువడేది నేడే నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం -
‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి బీజేపీ ముఖ్యనేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని తాము భావిస్తుంటే సర్వే సంస్థలు మాత్రం నామమాత్రపు ఫలితాలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. తమ అభ్యర్థులు బరిలో నిలిచిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టిపోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయని ఎన్నికల సరళిని విశ్లేషించి చెబుతున్నారు. ఓటింగ్ శాతం కూడా 2018లో వచ్చిన ఏడు శాతం పోలిస్తే ఈసారి 20 శాతం వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో... గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ ఐదు రోజుల ప్రచారంలో మొత్తం 8 సభలు, ఓ రోడ్ షో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 22 బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంకా పెద్ద సంఖ్యలో సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అగ్రనేతల ప్రచారం తాలూకు ఫలితాలు తప్పకుండా ఓట్లు, సీట్ల రూపంలో ప్రతిబింబిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుతోపాటు వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టోలో ప్రస్తావించిన వివిధ అంశాలు తప్పకుండా పారీ్టకి ఎన్నికల్లో కచ్చితంగా ఉపయోగ పడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. కిషన్‌రెడ్డిని కలిసిన పలువురు పార్టీ అభ్యర్థులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎన్నికల్లో పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్) తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పోటీ చేసిన స్థానాల్లో పార్టీకున్న విజయావకాశాలు, అభ్యర్థులకు కలిసొచ్చే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. పరిశీలకులను పంపిస్తున్నాం... ఓట్ల లెక్కింపు సందర్భంగా పార్టీ గెలిచే అవకాశాలు, గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పర్యవేక్షణకు తమ పార్టీ నుంచి పరిశీలకులను పంపిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలంతా ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని పరిశీలించి పార్టీ జిల్లా నేతలు, అభ్యర్థులకు తగిన ఆదేశాలు జారీ చేస్తారన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి వెంటనే స్పందించి ఈసీకి ఫిర్యాదు చేసేలా బీజేపీ లీగల్ సెల్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
ఎడతెగని మథనం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు కొద్దిగంటల్లో వెలువడనుండగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భవిష్యత్ కార్యాచర ణపై దృష్టి సారించారు. ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఇతర నేతలతో రెండో రోజూ ఎడతెగని మంతనాలు జరిపారు. పార్టీ వార్‌రూమ్ నివేదికలతోపాటు ఎగ్జిట్‌పోల్స్, వివిధ సంస్థలు, నిఘా వర్గాలు, పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు అందించిన నివేదికలను లోతుగా విశ్లేషించారు. ఆదివారం వెలువడే ఫలితాలు బీఆర్ఎస్కు సానుకూలంగా ఉంటాయని గట్టిగా విశ్వసిస్తున్న కేసీఆర్.. మళ్లీ మన ప్రభుత్వమే ఏర్పడుతుందంటూ పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. సొంతంగానే మేజిక్ ఫిగర్‌ను అందుకుంటామని చెప్తున్నారు. అవసరమైతే ఎంఐఎంతో కలసి.. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేజిక్ ఫిగర్ అయిన 60 సీట్లు దక్కించుకునే అవకాశం లేదని బీఆర్ఎస్ శిబి రం లెక్కలు వేస్తోంది. ఒకవేళ హంగ్ ఫలితాలు వస్తే, అవసరమైతే మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ శిబిరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆదేశించారని తెలిపాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీపరంగా సమన్వయం చేసే బాధ్యతను కేటీఆర్ ఆధ్వర్యంలోని వార్‌రూమ్‌కు.. పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకునేలా చూడాల్సిన బాధ్యతను కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పగించారు. గెలిచే చాన్స్ ఉన్నవారి జాబితా సిద్ధం చేసి.. వివిధ వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలు, అభ్యర్థులతో బీఆర్ఎస్ ఓ ప్రాథమిక జాబితాను సిద్ధం చేసుకుంది. మరోవైపు స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశమున్న (ఉత్కంఠ పోటీతో) నియోజకవర్గాల పరిస్థితిని మదింపు చేసి మరో జాబితాను రూపొందించుకున్నట్టు సమాచారం. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశమున్న స్థానాలపైనా బీఆర్ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో వారి మద్దతు అవసరమయ్యే పక్షంలో సంప్రదింపులకు సిద్దంగా ఉండాలని పార్టీ కీలక నేతలను ఆదేశించినట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ మినహా ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో గణనీయంగా సీట్లు సాధిస్తామని... ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పైచేయి బీఆర్ఎస్దే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో బీజేపీ బలంగా ఓట్లు చీల్చుతుందని.. దీనితో ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ మిశ్రమ ఫలితాన్ని సాధిస్తుందనే అంచనా వేసుకుంటున్నట్టు వివరిస్తున్నాయి. కౌంటింగ్ జాగ్రత్తలపై కేటీఆర్ సూచనలు ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏజెంట్ల నియామకం, కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతోనే గెలుపోటములు మారే అవకాశం ఉందని.. చివరి నిమిషం వరకు ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలోనే ఉండాలని, అభ్యర్థులు కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. -
కాంగ్రెస్.. ‘మిషన్ తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘మిషన్ తెలంగాణ’పేరుతో నేటి కౌంటింగ్ ప్రక్రియ మొదలై ముగిసే దాకా అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టింది. ఈ బాధ్యతను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ‘ట్రబుల్ షూటర్’ డి.కె. శివకుమార్‌కు అప్పగించింది. ఆయనకు తోడుగా పలువురు కర్ణాటక మంత్రులు, కొందరు ఏఐసీసీ కీలక నేతలు ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నారు. కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు శనివారం మధ్యాహ్నానికే హైదరాబాద్ చేరుకోగా డి.కె.శివకుమార్ రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం రెండు ప్లాన్లను ఏఐసీసీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కీలక నేతలతో రాహుల్ మీటింగ్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పరిశీలకులు పాల్గొన్నారు. ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థులను ముందే హైదరాబాద్‌కు పిలిపించాలన్న కొందరి సూచనలను రాహుల్ తిరస్కరించినట్లు తెలిసింది. కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు లేకుంటే నష్టం జరుగుతుందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయ ని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులను అక్కడే ఉంచాలని, ఫలితాలను బట్టి అభ్యర్థుల తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏఐసీసీ పంపుతున్న కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించాలని, ఏఐసీసీ పరిశీలకులతోపాటు జిల్లాల్లోని ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని... జిల్లాలవారీగా బాధ్యులను నియమించుకొని కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు.. ఈసారి అధికారం దక్కించుకునేందుకు రెండు వ్యూహాలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వస్తే ప్లాన్–ఏ, కొన్ని స్థానాలు తక్కువ పడే సందర్భంలో ప్లాన్–బీని అమలు చేయాలని నిర్ణయించింది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తే అభ్యర్థులందరినీ హైదరాబాద్ పిలిపించి డి.కె.శివకుమార్ సమక్షంలో తొలుత సమావేశం ఏర్పాటు చేయనుంది. అనంతరం ఆయనతోపాటు టీపీసీసీ ముఖ్యులంతా కలసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో సీఎల్పీ సమావేశం తేదీని నిర్ణయించాలని, ఆ తర్వాత సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించాలని పార్టీ యోచిస్తోంది. ఒకవేళ హంగ్ పరిస్థితులు ఏర్పడి మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువగా వస్తే ప్లాన్–బీని అమలు చేయాలని, అప్పుడు వీలైనంత త్వరగా అభ్యర్థులందరినీ హైదరాబాద్‌కు పిలిపించి టీపీసీసీ ముఖ్య నేతలతో సహా అందరినీ బెంగళూరుకు తరలించాలని భావిస్తోంది. హంగ్ వస్తే ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంప్రదింపులు జరిపేందుకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలనేది ఏఐసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే గెలుపు ధ్రువీకరణ పత్రాలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల ద్వారా తీసుకొనే ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఈసారి ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన వ్యూహాలను సమన్వయం చేసేందుకే ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, అది ఏఐసీసీ వ్యూహంలో భాగమేనని చెప్పారు. ఎంఐఎం అవసరం ఏర్పడితే? ఫలితాల్లో తమకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ప్రత్యామ్నాయ అవసరాలపైనా సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అతిపెద్ద పారీ్టగా అవతరించి ఎంఐఎంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఏం చేయాలన్న దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తీసుకోవాలా వద్దా అనే దానిపైనా ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతిచ్చేందుకు ముందుకొస్తే బయటి నుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండబోదని, తెలంగాణలో రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అర్థం చేసుకుంటారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరిగినట్లు తెలుస్తోంది. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
సిర్పూర్ పైనే ఏనుగంత ఆశ!
సాక్షి, హైదరాబాద్: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి. ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. సిర్పూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌లకు పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు పంచుకుంటే బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ సిర్పూర్‌తో పాటు చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ సోదరుడు ఆర్. ప్రసన్న కుమార్ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భావిస్తున్నారు. -
క్రాస్ ఓటింగ్ గుబులు!
తాండూరు: జిల్లాలోనే తాండూరు సెగ్మెంట్ ఫలితం ఉత్కంఠ భరితంగా మారింది. ఈ ఎన్నికలో అభ్యర్థుల వెంట నడిచిన వారే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శిబిరంలో క్రాస్ ఓటింగ్ దడ పుట్టిస్తోంది. 2018లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన పైలెట్ ఆ తర్వాత కారెక్కారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రెండు నెలల క్రితం వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ కనిపించలేదు. అధికార పార్టీ నుంచి పరిగి టికెట్ ఆశించిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తరఫున తాండూరు బరిలో నిలిచారు. బీఆర్ఎస్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులను సైతం తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నియోజవర్గంలో బలమైన నేతగా ఎదిగిన రోహిత్‌రెడ్డి ప్రభుత్వ పథకాలతో పాటు తనను నమ్మి నడుస్తున్న వారితో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. నేను తాండూరు బిడ్డను నన్ను ఆశీర్వదించండి కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న కొంతమంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలో కొనసాగుతున్న పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్కు ఓట్లు వేయించారనే చర్చ కూడా సాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసుల బీజేపీ జాతీయ నేతలను ఇరకాటంలో పెట్టారనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు రోహిత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం కూడా ఉంది. ఇలా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుందో... ఎవరి పుట్టి ముంచుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సైలెంట్ ఓటింగ్.. టఫ్ ఫైటింగ్ తాండూరు రూరల్: పోలింగ్ పూర్తయింది మొదలు ఓటరు నాడీ పట్టేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పల్లెల్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలంగా మారిందనేది అనేది అంతుచిక్కడం లేదు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన కారుకు కలిసొస్తుందా..? లేక కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారా అనే చర్చలు సాగుతున్నాయి. ఎవరికి ‘మేజర్’ పంచాయతీ మండల పరిధిలోని కరన్‌కోట్ మేజర్ పంచాయతీ. ఇక్కడ దాదాపు 6వేల పైచిలుకు ఓట్లుండగా 4వేల ఓట్లు పోలయ్యాయి. దాదాపు 60శాతం పోలింగ్ జరగ్గా కాంగ్రెస్, కారు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్థానికంగా సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఓటు హక్కును కలిగియున్నారు. ఆ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది నాయకులకు అంతుచిక్కడం లేదు. -
నిధులు మళ్లిస్తున్నారు.. భూములు మార్చుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద పంపిణీ చేయాల్సిన నిధులను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని, హైదరాబాద్ శివారు జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జి.నిరంజన్, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, రోహిణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లను తమకు ఇష్టమైన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ వినతిపత్రంలో తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల హక్కు రికార్డులను ధరణి పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీల పేరిట మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాల్లో సరైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కట్టడి చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. నాలుగు అంశాలపై వినతిపత్రం ఇచ్చాం: ఉత్తమ్ సీఈవో వికాస్‌రాజ్‌ను కలసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు నిధుల మళ్లింపు, అసైన్డ్ భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే తమ పార్టీ నుంచి గెలిచే వారి ఎలక్షన్ సర్టిఫికెట్లను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరామని తెలిపారు. పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని, దీనికి సంబంధించి సీసీటీవీ రికార్డులున్నాయని, ఈ రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని వెల్లడించా రు. ఈనెల 4వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయంపై స్పందిస్తూ, కేబినెట్ ఎందుకు పెడుతున్నారో తమకు తెలియదని, రాజీనామాను ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించి ఉండవచ్చని, విషయం తెలియకుండా మాట్లాడలేమని ఉత్తమ్ చెప్పారు. -
తొలి గెలుపు దక్కేదెవరికో?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగిన 102 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ‘అధ్యక్షా’అనాలనే కుతూహలంతో ఉన్నవాళ్ల పోటీ ఫలితం ఆదివారం రా నుంది. స్థానిక పరిస్థితులు, మారిన రాజకీ య సమీకరణాల నేపథ్యంలో ఈసారి అన్ని పార్టీ లూ కొత్తవారికి అవకాశాలిచ్చాయి. బీజేపీ 50 మందికిపైగా కొత్త వాళ్ళకు అవకాశమిచ్చింది. కాంగ్రెస్ కూడా 45 మందికి పైగా కొత్త వాళ్ళకే టికెట్లు ఇచ్చింది. సిట్టింగ్‌లకే ఎక్కువ సీట్లిచ్చిన బీఆర్ఎస్ ఏడుగురుకి మాత్రం తొలిసారి పోటీ చేసేందుకు అవకాశమిచ్చింది. మొత్తంగా ప్రధాన పార్టీల నుంచి 102 మంది కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారని లె క్కలు చెబుతున్నాయి. మరోవైపు ఇండిపెండెంట్లు గా కూడా అనేక మంది తొలిసారి పోటీ చేస్తున్నారు. తొలిసారి బరిలో ఉన్న కొందరు.. పాలకుర్తిలో కాంగ్రెస్ నుంచి యశస్వినిరెడ్డి, బీజేపీ నుంచి రామ్మెహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. డోర్నకల్‌లో కాంగ్రెస్ నుంచి రాంచంద్రునాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత, దేవరకద్రలో కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండా ప్రశాంత్‌రెడ్డి, వనరిపర్తిలో కాంగ్రెస్ నుంచి మేఘారెడ్డి, బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్‌రెడ్డి, గద్వాలలో కాంగ్రెస్ నుంచి సరిత, బీజేపీ నుంచి బోయ శివారెడ్డి, మహబూబ్‌నగర్‌లో బీజేపీ నుంచి మిథున్‌రెడ్డి, నారాయణపేటలో పర్ణికారెడ్డి, అలంపూర్‌లో బీఆర్ఎస్ నుంచి కె విజయుడు, బీజేపీ నుంచి రాజగోపాల్, ఖానాపూర్‌లో బీఆర్ఎస్ జాన్సన్ నాయక్, కోరుట్లలో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ పోటీ చేయగా... బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న అర్వింద్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిత్‌రావు, బీజేపీ నుంచి విజయ్‌కుమార్, నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ తరఫున మురళీయాదవ్, తుంగతుర్తిలో కాంగ్రెస్ టికెట్‌పై మందుల సామేలు, బీజేపీ నుంచి రామచంద్రయ్య, ఆలేరులో కాంగ్రెస్ తరఫున బీర్ల ఐలయ్య, బీజేపీ టికెట్‌పై పడాల శ్రీనివాస్, ఆర్మూర్‌లో కాంగ్రెస్ నుంచి వినయ్‌రెడ్డి బీజేపీ తరఫున పైడి రాకేష్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నుంచి సంతో ష్ కుమార్, బీజేపీ టికెట్‌పై సారంగపాణి, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్‌గౌడ్, బీజేపీ నుంచి రవికుమార్, కంటోన్మెంట్లో బీఆర్ఎస్ టికెట్‌పై లాస్య నందిత, కాంగ్రెస్ తరఫున జీవీ వెన్నెల, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ టికెట్‌పై అజహరుద్దీన్, బీజేపీ నుంచి దీపక్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్‌కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్‌నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్‌గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్‌రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్‌కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికలు ఫలితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజయం
జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి గెలుపు మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకిటి శ్రీహరి గెలుపు దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కే. రాజేశ్ రెడ్డి గెలుపు 32000 పైచిలుకు ఓట్లతో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు, రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి 4,389 ఓట్ల ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధి బర్రెలక్క ముందంజ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల గెలుపోటముల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. క్ర.సం నియోజకవర్గం భారాస కాంగ్రెస్ భాజపా ఆధిక్యం గెలుపు 1 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మిథున్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 2 జడ్చర్ల చర్లకోల లక్ష్మారెడ్డి అనిరుధ్ రెడ్డి చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ కాంగ్రెస్ 3 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 4 కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆల్లెని సుధాకర్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ 5 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కే. రాజేశ్ రెడ్డి దిలీప్ చారి కాంగ్రెస్ కాంగ్రెస్ 6 అచ్చంపేట (SC) గువ్వల బాలరాజు చిక్కుడు వంశీ కృష్ణ దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ కాంగ్రెస్ 7 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జి చిన్నారెడ్డి అశ్వత్థామ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 8 గద్వాల బండ్ల కృష్ణమోహన్డ్డి సరితా తిరుపతయ్య బోయ శివ భారాస భారాస 9 అలంపూర్ (SC) విజేయుడు ఎస్ఏ. సంపత్ కుమార్ రాజగోపాల్ భారాస భారాస 10 నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి డా. పర్ణికా చిట్టెం రెడ్డి కేఆర్ పాండురెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 11 కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి బంతు రమేష్‌కుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ 12 షాద్ నగర్ అంజయ్య యాదవ్ యెల్గనమోని శంకరయ్య అందె బాబయ్య కాంగ్రెస్ కాంగ్రెస్ 13 కల్వకుర్తి జైపాల్ యాదవ్ కశిరెడ్డి నారాయణరెడ్డి తల్లోజు ఆచారి కాంగ్రెస్ కాంగ్రెస్ 14 మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి వాకిటి శ్రీహరి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ -
టీడీపీ వారి దొంగ ఓట్ల రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో ఘోర ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో టీడీపీ ‘నకిలీ ఓట్ల’ దందాకు తెరలేపింది. ఇప్పటివరకూ ఏపీలో నకిలీ ఓటర్లంటూ అనవరసర రాద్దాంతం చేస్తూ వస్తున్న టీడీపీ.. ఈసారి వేరే రాష్ట్రంలోని ఓట్లను ఏపీలో చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టేసింది టీడీపీ. అది కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లను ఏపీ జాబితాలో చేర్చడానికి కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కుట్ర పూరిత ఓట్ల రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందుకు నిజాంపేట్ విజ్ణాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ తెరిచింది టీడీపీ. దాంతో పాటు పలు కాలనీల్లో టీడీపీ ఓటర్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలను షురూ చేసింది టీడీపీ ‘మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? అంటూ నకిలీ ఓట్లను చేర్చేందుకు యత్నాలు చేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్రలకు పాల్పడుతోంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా చేసి ఎన్నికల రోజు వీరందర్నీతరలించి టీడీపీకి ఓటేయించే కుట్రలకు వ్యూహ రచన చేసింది టీడీపీ. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ చేసేందుకు అనుతివ్వాల్సిందగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈసీని కోరింది. డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకివ్వాల్సి వస్తోందని ఈసీ ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో డీఏ విడుదలకు ఈసీ ఓకే అంది. కాగా, ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది. ఇదీచదవండి..కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా..నాది మెరిట్ కోటా : రేవంత్‌రెడ్డి -
కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా : రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా అని, తనది మెరిట్ కోటా అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌కు ఒకరోజు ముందు శనివారం రేవంత్ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్ సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్ రాజకీయ పోరాటమంతా కేసీఆర్‌తోనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు రేవంత్‌రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్ లాంటి ఎస్సీనేత రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్ ఫ్లైట్లు రెడీ!