Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్‌డేట్స్‌ | Telangana Assembly Election Results 2023 Live Telugu Updates | Sakshi
Sakshi News home page

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్‌డేట్స్‌

Published Sun, Dec 3 2023 7:00 AM | Last Updated on Sun, Dec 3 2023 9:46 PM

Telangana Assembly Election Results 2023 Live Telugu Updates - Sakshi

జంగ్‌ తెలంగాణ..  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ

 • గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ
 • ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధమని తెలిపిన నేతలు
 • గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందించిన పార్టీ బృందం

రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం

 • రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం
 • సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుంది.
 • గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరతాం: డీకే శివకుమార్

రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం

 • రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం
 • గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు
 • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్‌కు చెప్పనున్న కాంగ్రెస్ నేతలు

కాసేపట్లో సీఎల్పీ సమావేశం

 • హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
 • ఇప్పటికే హోటల్‌లో డీకే శివకుమార్‌ సహా నలుగురు ఏఐసీసీ నలుగురు పరిశీలకులు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. మ్యాజిక్‌ ఫిగర్‌ 60

 • తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం

సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై

 • సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై
 • ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌ను కోరిన గవర్నర్ తమిళిసై

పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్

 • పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్
 • 23వ రౌండ్ కౌంటింగ్ ని నిలిపివేసిన అధికారులు
 • రీ కౌంటింగ్ చేయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్
 • ఎన్నికల అధికారులు, RO తో మాట్లాడుతున్న కాట శ్రీనివాస్
 • కౌంటింగ్ కేంద్రం ముందు భారీగా చేరుకున్న మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు
 • భారీగా కార్యకర్తలు రావడంతో కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు

వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

 • రేవంత్ రెడ్డి మా సీఎం అభ్యర్థి
 • పార్టీ కోసం కష్టపడ్డాడు.. గెలిపించాడు..
 • మా హైకమాండ్ కూడా రేవంత్ కు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటుంన్నా..

ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ

 • ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ
 • తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం
 • రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు

గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్

 • గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్
 • గత ఎన్నికల కంటే తగ్గిన మెజార్టీ

హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి..

 • హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి..
 • మరి కొద్దిసేపట్లో హోటల్ కు చేరుకోనున్న 27 మంది గెలిచిన ఎమ్మెల్యే లు
 • రాత్రి 9 గంటలకు సీఏల్పీ మీటింగ్..
 • ఆలోపే గెలిచిన ఎమ్మెల్యేలు హోటల్ కు రావాలని పిలుపు

రీకౌంటింగ్‌ను కోరిన బండి సంజయ్.

 • కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల గెలుపుపై రీకౌంటింగ్ కు కోరిన బండి సంజయ్..
 • ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అప్పీల్  చేసిన సంజయ్..

నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు

 • 1.బాన్సువాడ లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం.
 • సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పై 23,464 ఓట్ల మెజారిటీతో విజయం.
 • 2.బాల్కొండ లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత రెడ్డి విజయం
 • సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి పై 4,533 ఓట్ల మెజారిటీతో గెలుపు.
 • 3.నిజామాబాద్ అర్బన్ లో బీజేపి అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారాయణ విజయం
 • సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పై 15,387 మెజార్టీ గెలుపు
 • 4.ఆర్మూర్ లో బీజేపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఘన విజయం.
 • సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పై 29,669 ఓట్ల మెజారిటీతో గెలుపు.
 • 5.నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి విజయం
 • సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై 21,963 ఓట్ల మెజారిటీతో విజయం.
 • 6.బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం.
 • సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ పై 3,062 ఓట్ల మెజారిటీతో విజయం.

సిద్ధిపేటలో హరీష్ రావు విజయం

 • సిద్ధిపేటలో హరీష్ రావు విజయం
 • 2018 కంటే తగ్గిన మెజారిటీ

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి

 • కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
 • 6789 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ పై గెలుపొందిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి
 • మూడో స్థానంలో రేవంత్ రెడ్డి
 • కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి

డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్

 • డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ: పీటీఐ వర్గాలు
 • ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం
 • అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కు ఈసీ నోటీసులు
 • వివరణ ఇవ్వాలని ఇద్దరికీ ఆదేశాలు
 • ఎన్నికల ప్రవర్తన నియమావళి గుల్లంగన కింద అధికారులపై ఈసీ చర్యలు

హుజూరాబాద్‌లో ఈటల ఓటమి

 • హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
 • బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌషిక్ రెడ్డి ఈటలపై విజయం

 • కరీంనగర్‌లో స్వల్ప మెజార్టీతో గంగుల కమలాకర్‌ గెలుపు
 • కేవలం 326 ఓట్ల మెజార్టీతో గెలుపు
 • రీకౌంటింగ్‌ కోరిన బండి సంజయ్‌

 • రేపు(సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం
 • సీఎం ఎవరు అనే దానిపై కసరత్తు

 • సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌
 • రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చిన కేసీఆర్‌

 • ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ విజయం
 • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి గెలుపు. 
   
 • బోధ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ విజయం
 • కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ముందంజ
 • రెండో స్థానంలో కేసీఆర్‌,
 • మూడో స్థానంలో రేవంత్‌
 • 15వ రౌండ్‌ ముగిసే సరికి 3వేల మెజార్టీతో బీజేపీ 
 • ఇంకా నాలుగు రౌండ్స్‌ మిగిలి ఉన్నాయి. 
   
 • వర్ధన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి నాగరాజు గెలుపు
 • నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేష్‌ రెడ్డి విజయం
 • ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎడ్మా బుజ్జు విజయం
 • చెవెళ్లలో బీఆర్‌ఎస్‌ విజయం
 • స్వల్ప మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు. 
 • రీకౌంటింగ్‌ చేయాలని కాంగ్రెస్‌ అభ్యర్థి భీం భరత్‌ డిమాండ్‌
 • ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ విజయం
 • భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి విజయం

 • సిరిసిల్లలో కేటీఆర్‌ గెలుపు
 • 29వేల మెజార్టీతో కేటీఆర్‌ విజయం
 • పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు గెలుపు.
 • మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి డా. మురళీనాయక్‌ విజయం
 • ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు గెలుపు. 
 • నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు. 
 • వనపర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మేఘా రెడ్డి విజయం
 • నర్సంపేటంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం 
 • సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ లీడ్‌
 • సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి జగదీష్‌ రెడ్డి ముందంజ
 • ఐదువేల ఓట్లతో లీడ్‌లో జగదీష్‌ రెడ్డి 

ఇది తెలంగాణ ప్రజల విజయం: భట్టి

 • మధిరలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం.
 • సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తాను.
 • దొరల తెలంగాణ పాలన పోయింది, ప్రజల తెలంగాణ పాలన వచ్చింది.
 • ఇది తెలంగాణ ప్రజల విజయం

 • దేవరకొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలు నాయక్‌ విజయం
 • తాండూరులో పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఓటమి
 • కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ గెలుపు
 • కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు
 • బర్రెలక్క(శిరీష) ఓటమి

 • మధిరలో కాంగ్రెస్‌ అభ్యర్థి భట్ట విక్రమార్క గెలుపు
 • మధిరలో 35వేల మెజార్టీతో భట్టి విజయం
 • హుస్నాబాద్‌లో ముందంజలో పొన్నం ప్రభాకర్‌
 • 11వేలకుపైగా ముందంజలో కొనసాగుతున్న పొన్నం
 • గోషామహల్‌లో రాజాసింగ్‌ గెలుపు
 • ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్‌
 • సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓటమి
 • బోధన్‌లో కాంగ్రెస్‌ సుదర్శన్‌ రెడ్డి గెలుపు
   

 • కామారెడ్డిలో కేసీఆర్‌ వెనుకంజ
 • మిర్యాలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు
 • తుంగుత్తురిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌ ఓటమి
 • కాంగ్రెస్‌ అభ్యర్థి శ్యామూల్‌ గెలుపు. 
 • మంథనిలో శ్రీధర్‌బాబు గెలుపు
 • 30వేలకు పైగా మెజార్టీతో గెలుపు
 • సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్‌ గెలుపు. 
 • మునుగోడులో 21వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి గెలుపు. 
 • సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు.
 • చరిత్రను తిరగరాసిన స్పీకర్‌ పోచారం
 • తెలంగాణ చరిత్రలో స్పీకర్‌గా ఓడిపోవడం అనవాయితీ
 • కానీ, ఈ ఎన్నికల్లో పోచారం విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. 
 • కాంగ్రెస్‌ అభ్యర్థులు గడ్డం బ్రదర్స్‌(వినోద్‌), కోమటిరెడ్డి బ్రదర్స్‌ గెలుపు.
 • నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం
 • పటోళ్ల సంజీవ రెడ్డి భారీ గెలుపు. 
 • బాన్సువాడలో పోచారం గెలుపు
 • బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం విజయం
 • మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు. 
 • ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ గెలుపు. 
 • బీఆర్ఎస్‌ అభ్యర్థి పద్మాదేవెందర్‌ రెడ్డి ఓటమి
 • ‍కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ గెలుపు
 • నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు
 • ఎస్సీ, ఎస్టీ రిజ‍ర్వ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు
 • చేవెళ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం
   
 • బీఆర్ఎస్‌ అభ్యర్థి పద్మాదేవెందర్‌ రెడ్డి ఓటమి
 • ‍కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ గెలుపు
 • నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు
 • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓటమి
 • పాలకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని ఓటమి
 • నారాయణ్‌ఖేడ్‌ కాంగ్రెస్‌ విజయం
 • హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ విజయం
 • 46వేల మెజార్టీతో ఉత్తమ్‌ గెలుపు
 • కొడంగల్‌లో రేవంత్‌ విజయం
 • 32వేల మెజార్టీతో రేవంత్‌ గెలుపు
 • భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తెల్లం వెంకట్‌రావు విజయం

 • సిరిసిల్లలో కేటీఆర్‌ 25వేల ఆధిక్యం.
  వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ విజయం
  నిర్మల్‌లో మహేశ్వర్‌ రెడ్డి విజయం
  హుజురాబాద్‌లో 10వేల మెజార్టీలో పాడి కౌశిక్‌ రెడ్డి. 

 • హుస్నాబాద్‌లో 14వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 11,515 ఆధిక్యత
 • దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విజయం
 • రఘునందన్‌ రావు ఓటమి. 
 • జగిత్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి గెలుపు
 • ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్‌ గెలుపు
 • 14వేల మెజార్టీతో తుమ్మల విజయం
 • జుక్కల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీకాంతరావు విజయం
 • మధిరలో భట్టి విక్రమార్కకు 22వేలకుపైగా ఓట్ల ఆధిక్యం
 • నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ విజయం
 • 54వేలకు పైగా భారీ మెజార్టీలో కోమటిరెడ్డి గెలుపు. 

 • ఆందోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దామెదర రాజనర్సింహ గెలుపు
 • 24వేల భారీ మెజార్టీతో భారీ విజయం
 • బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి విజయం
 • బెల్లంపల్లిలో భారీ ఆధిక్యంలో వివేక్‌
   

సూర్యాపేటలో ముందంజలో​ మంత్రి జగదీష్‌ రెడ్డి. 

ఓటమి దిశగా ఈటల రాజేందర్‌

 • బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్‌కు బిగ్‌ షాక్‌
 • పోటీ చేసిన గజ్వేల్‌, హుజురాబాద్‌లో ఓటమి దిశగా ఈటల

సికింద్రాబాద్ నియోజకవర్గం రౌండ్ నెంబర్: 11

 • BRS: 4460
 • BJP: 2315
 • NC: 2093
 • 11వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2145
 • 11వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 32883 ఓట్లతో ఆధిక్యం..

గాంధీ భవన్‌కు భారీ ర్యాలీతో బయలుదేరిన రేవంత్‌ రెడ్డి. 

 • గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌ రెడ్డి. 
 • గాంధీభవన్‌కు చేరుకున్న డీకే శివకుమార్‌
 • నల్గొండలో 44 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
   
 • అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ విజయం
 • కాలేరు వెంకటేశ్‌ గెలుపు.
 • నాగర్‌కర్నూల్‌లో వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌
   
 • బహదూర్‌పురలో విజయం దిశగా ఎంఐఎం
   
 • షాద్‌ నగర్‌లో 12వ రౌండ్ ముగిశాక కాంగ్రెస్ అభ్యర్ధి 1407 లీడ్‌
   
 • కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 


తెలంగాణలో జనసేన పరిస్థితి ఇది.. 

 • డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు
 • పోటీ చేసిన ఎనిమిది చోట్ల అదే పరిస్థితి
 • ప్రధాన పార్టీలకు ఏమాత్రం దరిదాపుల్లో ఓట్లు దక్కించుకోని జనసేన అభ్యర్థులు
 • 80కి పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు

 
 

 • కుత్బుల్లాపూర్‌లో 60,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద
   
 • ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో 11 రౌండ్లు ముగిసే సరికి 19798ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగా రెడ్డి ముందంజ
 • అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థికి 9వ రౌండ్ లో 14,624 ఓట్ల ఆధిక్యం


  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు
 • రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌
 • డీజీపీ వెంట సీనియర్‌ ఐపీఎస్‌లు కూడా
 • పూల బొకేలు ఇచ్చి రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పిన అధికారులు
   
 • తాండూరులో 800 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌
   
 • 8వ రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 16,136 లీడ్
   
 • రంగారెడ్డి జిల్లా 14 స్థానాల్లో 11లో బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం, 3 కాంగ్రెస్‌ ఆధిక్యం
   
 • కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్‌ ముగిసేసరికి 2 వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి

 • రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ ఠాకూర్‌ విజయం
 • చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌  విజయం
 • ఆంధోల్ నియోజకవర్గంలో 14 రౌండ్ ముగిసేసరికి 20 వేల పై చిలుకు ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ.ఫలితాల్లో కాంగ్రెస్‌ జోరు..  ఉత్తమ్‌ స్పందన

 • తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో సోనియా ఉన్నారు: ఉత్తమ్‌
 • 2014, 2018 ఎన్నికల్లో మేము కొన్ని తప్పులు చేశాం
 • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది
 • తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి గిఫ్ట్‌ ఇస్తున్నారు

   
 • మేడ్చల్‌లో మల్లారెడ్డికి 23 వేల ఆధిక్యం
   
 • కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్‌ ముగిసేసరికి రేవంత్‌రెడ్డి  లీడ్‌

   
 • చొప్పదండిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 14 వేల లీడ్‌
 • కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి
   
 • పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ
 • ఆరు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని యశస్వినిరెడ్డి
 • సిరిసిల్లలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్‌
   
 • బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్‌ పూర్తయ్యాక 1923 ఓట్లు
 • గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి


 

 • దుబ్బాకలో పదవ రౌండ్ మూసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 32,349 ఓట్ల ఆదిక్యత
 • కూకట్‌పల్లిలో ఏడవ రౌండ్ ముగిశాక.. 29,805 లీడ్లో కృష్ణారావు

 • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్‌
 • కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహం.. 
 • బాణసంచా కాలుస్తూ సంబురాలు
 • మరొకొందరు హస్తం కార్యకర్తలు సోనియా గాంధీ ఫొటోకు పాలభిషేకం


 

 • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు...
 • నగర శివారు ప్రాంతాల్లో BRS హవా
 • కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో విజయతీరాల్లో BRS
 • రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ 
 • ఎల్బీనగర్ లో  BRS బీజేపీ మధ్య హోరాహోరీ పోరు


ఆరో రౌండ్‌ ముగిసినా.. ఈటల వెనుకంజ

 • హుజురాబాద్‌లో ముగిసిన ఆరో రౌండ్‌
 • పాడి కౌశిక్‌రెడ్డి ముందంజ
 • ఆరువేల ఓట్లకు పైగా ఆధిక్యం
 • రెండోస్థానంలో కాంగ్రెస్‌
 • తొలి రౌండ్‌నుంచి.. మూడో స్థానంలోనే కొనసాగుతున్న ఈటల
    

 • ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు  13,000 లీడ్
 • ఖానాపూర్‌లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు
 • హుజూరాబాద్‌లో ఆరో రౌండ్‌ ముగిసేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి లీడ్‌
 • మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్‌) 15 వేల ఆధిక్యం
 • పెద్దపల్లిలో 17వేల లీడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు

   

భద్రాచలంలో గెలుపు దిశగా బీఆర్‌ఎస్‌? 

 • పదో రౌండ్‌ ముగిసేసరికి  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  లీడ్ 5,155
 • ఇంకా మిగిలి ఉన్న మూడు రౌండ్స్‌

   
 • శేరిలింగంపల్లిలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌

 • మధిరలో 15వేల ఓట్ల ఆధిక్యంలో విక్రమార్క
   
 • కామారెడ్డిలో 1200 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి
 • కొడంగల్‌లో 12 వేల ఓట్ల ఆధిక్యంలో 
   
 • యూకత్‌పురలో ఆధిక్యంలో బీజేపీ
 • బహదూర్‌పురలో ఆధిక్యంలో ఎంఐఎం
   
 • దేవరకద్రలో 600 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌
   
 • సంగారెడ్డిలో ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌
   
 • బర్రెలక్కకు 1200 ఓట్లు
   
 • నాంపల్లి 100 ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం
 • ములుగు నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క(అనసూయ) 12,673 ఓట్ల ఆధిక్యం
 • ఎనిమిదో రౌండ్  ముగిసే సరికి 21,349 మెజార్టీలో  పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి  పొంగులేటి.
 • జహీరాబాద్ ఆరో రెండు ముగిసే సరికి 906 ఓట్ల స్వల్ఫ ఆదిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు.
 • మధిరలో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి మల్లు భట్టి విక్రమార్కకు 15819 ఓట్ల మెజార్టీ
 • ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం

బోణీ కొట్టిన కాంగ్రెస్‌

 • తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి
 • ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్‌ విజయం
 • 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు
 • ఇల్లందులోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య విజయం
   
 • పినపాక 7వ రౌండ్‌ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ 14,307

  భద్రాచలం 8వ
  BRS లీడ్ 2853

  అశ్వారావుపేట 12వ
  కాంగ్రెస్ 26306

  ఇల్లండు 12th
  కాంగ్రెస్ 35 241

  కొత్తగూడెం 6వ
  CPI లీడ్ 13,820

 • మంచిర్యాల్లో నాల్గవ రౌండు ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌కు 10,107 మెజార్టీ

 • హుస్నాబాద్ లో 8 వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు 6235 లీడ్
   
 • ఖానాపూర్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి.. బీజేపీ 700 ఓట్ల లీడ్‌
   
 • సనత్ నగర్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 11658 ఓట్ల ఆధిక్యం
   

 • భువనగిరిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత

 • కంటోన్మెంట్‌లో ఐదు రౌండ్లు ముగిసేసరికి..  21 వేల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లాస్య నందిత సాయన్నఈసీ ట్రెండ్స్‌ ప్రకారం ఆధిక్యంలో.. 
కాంగ్రెస్‌ 59
బీఆర్‌ఎస్‌ 37
బీజేపీ 9
ఎంఐఎం 1

 

 • తుమ్మలకు 8 వేల లీడ్‌
   
 • మహబూబ్‌నగర్‌లో 65 ఓట్ల ఆధిక్యంలో శ్రీనివాస్‌గౌడ్‌
   
 • ఆరుగురు మంత్రులు ఓటమి బాటలో?
  ఆధిక్యంలో ఘోరంగా వెనుకబడిన ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల

   
 • ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఐదు వేల ఓట్ల ఆధిక్యం
   
 • కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్‌ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం

   
 • భూపాలపల్లి నాలుగవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యo 9285
 • మేడ్చల్‌లో 11వ రౌండ్‌ ముగిసేసరికి 17,856 ఆధిక్యంలో మల్లారెడ్డి లీడ్‌
 • దుబ్బాకలో ఆరో రౌండు ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 20,799 ఓట్ల ఆధిక్యం

   
 •  పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి  విజయ రమణారావు  ఆధిక్యం 11,791 లీడ్‌
   

హుజురాబాద్‌లో ఈటల మూడో ప్లేస్‌

 • మూడు రౌండ్లు ముగిసేసరికి కౌశిక్‌రెడ్డి లీడ్‌
 • రెండో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణవ్‌
 • మూడోస్థానంలో కొనసాగుతున్న ఈటల
   
 • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌ లీడ్‌

 • మానకొండూరులో  కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకి 10590 ఆధిక్యం
 • ఖమ్మం అశ్వారావుపేట 8 రౌండ్లకు కాంగ్రెస్16125 ఆధిక్యత

 • సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనుకంజ
 • బోథ్ నియోజకవర్గం లో 4వ రౌండ్ లో బీ అర్ ఎస్ అభ్యర్థి అనిల్ 3,353 లీడ్
 • పాలేరు లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2164 ఓట్ల ఆధిక్యం

కరీంనగర్‌లో బండి సంజయ్‌ ముందంజ

 • ఐదో రౌండ్‌ ముగిసేసరికి ఆధిక్యంలోకి వచ్చిన బండి సంజయ్‌
 • కరీంనగర్‌లో 943 ఓట్లతో బండి లీడ్‌
 • నిజామాబాద్ రూరల్‌లో ఏడో రౌండ్ ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి 8521 ఓట్ల ఆధిక్యం
 • రాజేంద్ర నగర్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 68 లోని ఈవీఎం మొరాయిo చడంతో నిలిచిన కౌంటింగ్

 • పటాన్‌చెరులో మూడో రౌండ్  ముగిసేసరికి 369 ఓట్ల తో లీడ్
 • మూడు రౌండ్లు ముగిసే సరికి గజ్వేల్‌లో కేసీఆర్ లీడ్.. 3020
 • నల్గొండలో ఎనిమిది రౌండ్స్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 25వేల ఓట్ల అధిక్యం
   

 • ఆసిఫాబాద్‌లో ఐదో రౌండ్‌ ముగిసేసరికి 7 వేల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ కోవ లక్ష్మి
 • మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి 2440ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు
 • సూర్యాపేటలో నాలుగో రౌండ్‌ ముగిసేసరికి.. 2657 బీఆర్‌ఎస్‌ జగదీశ్వర్‌రెడ్డి లీడ్‌
 • పటాన్‌చెరులో 264 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌
 • బహదూర్‌పూర్‌లో700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
 • ఆర్మూర్‌లో బీజేపీకి 2 వేల ఓట్ల ఆధిక్యం
 • గద్వాల్‌లో 5,700 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌
 • శేరిలింగంపల్లిలో 7 వేల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌


 

 • ఖమ్మంలో తుమ్మలకు 4 వేల ఓట్ల ఆధిక్యం

   
 • ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
  కాంగ్రెస్‌-53
  బీఆర్‌ఎస్‌-31
  బీజేపీ-6
  సీపీఐ-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 


   

 • భూపాలపల్లిలో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొత్తం 6511 ఓట్ల మెజారిటీ
   
 • పటాన్‌ చెరు రెండో రౌండ్ ఆధిక్యంలో కాంగ్రెస్‌..  264 ఓట్ల ఆధిక్యం
   
 • కామారెడ్డిలో ఆధిక్యంలోకి వచ్చిన కేసీఆర్‌ 
 • 600 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్‌
 • సిరిసిల్లలో 3,749 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్‌
   
 • భూపాలపల్లిలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌
   
 • కార్వాన్‌, బహదూర్‌పురాలో బీజేపీ లీడ్‌
   
 • మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ మైనంపల్లి వెనుకంజ
 • మెదక్‌లో మైనంపల్లి కొడుకు రోహిత్‌ ముందంజ
   
 • జూబ్లీహిల్స్‌లో 900 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
 • నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు 7 వేల ఓట్ల ఆధిక్యం
   
 • కొడంగల్‌లో నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 4 వేల ఓట్ల లీడ్‌లో రేవంత్‌రెడ్డి
   
 • వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ముందంజ

   
 • గజ్వేల్‌లో రెండో రౌండ్‌ ముగిసేసరికి 920 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్‌

 • కొల్లాపూర్‌లో బర్రెలక్కకు కేవలం 400 ఓట్లు మాత్రమే!
   
 • చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం

   
 • భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 4 వేల ఓట్ల ఆధిక్యం
 • సికింద్రాబాద్‌లో పద్మారావు ఆధిక్యం
   
 • సిరిసిల్ల మూడో రౌండ్‌లో 2,621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్‌
 • మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెనుకంజ
 • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. ఆసిఫాబాద్ సెగ్మెంట్ మూడవ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి 2,420 ఓట్ల ఆదిక్యం

   
 • మంథని నియోజకవర్గంలో 3వ  రౌండ్ పూర్తయ్యేసరికి  కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు 3425 లీడ్‌
 • ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ నాలుగో రౌండు మూసేసరికి 6245 కోట్ల ఆధిక్యం
 • ములుగు నియోజకవర్గంలో ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 7461 ఓట్ల ఆదిక్యం

   
 • నిజామాబాద్‌ అర్బన్‌లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ  


  ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
 • కాంగ్రెస్‌ 47
 • బీఆర్‌ఎస్‌ 26
 • బీజేపీ 3

   
 • హుస్నాబాద్ మూడో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 74 4 ఆధిక్యత. .. మొత్తం ఆధిక్యత 2250
 • ఖమ్మం పాలేరులో 3 వ రౌండ్ అయిపోయే సరికి పొంగులేటి సుమారు  7000 లీడ్
   
 • మూడో రౌండ్లు ముగిసేసరికి.. కొడంగల్‌, కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి ఆధిక్యం
   
 • కల్వకుర్తిలో 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి
   
 • రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 4
   
 • తాండూరులో 139 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌
   
 • బెల్లంపల్లిలో మూడో రౌండ్‌ ముగిసేసరికి 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వినోద్‌
 • సత్తుపల్లిలో మూడో రౌండ్‌ ముగిసేసరికి 2 వేల ఓట్లకు పైగా లీడ్‌

   
 • హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం

   
 • కొరుట్లలో బీఆర్‌ఎస్‌ సంజయ్‌కి ఆధిక్యం
 • నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ లీడ్‌
 • పరకాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌

   
 • ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ ముందంజ
 • మేడ్చల్‌లో మల్లారెడ్డికి 2 వేలకు పైగా లీడ్‌
   
 • నల్గొండలో ఐదో రౌండ్‌ ముగిసేసరికి 17 వేల ఆధిక్యంలో కోమటిరెడ్డి
 • హుజూర్‌ నగర్‌లో 12 వేల ఆధిక్యంలో ఉత్తమ్‌ కుమార్‌
   
 • హుజూరాబాద్‌లో ఈటల వెనుకంజ
 • రెండో రౌండ్‌లోనూ కౌశిక్‌ మందంజ
   
 • కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్‌
 • గజ్వేల్‌లో కేసీఆర్‌ వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యం

   
 • గోషామహల్‌లో రాజాసింగ్‌ వెనుకంజ
   
 • నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • నర్సంపేటలో మూడో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ ఆధిక్యం

   
 • ఖమ్మం నియోజకవర్గంలో మూడో రౌండ్ ముగిసే నాటికి తుమ్మల 796 ఆధిక్యం
 • పినపాకలో రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • డోర్నకల్‌లో మూడో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ ముందంజ
   
 • కామారెడ్డిలో 1162 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి
 • మెదక్‌లో 7 బీఆర్‌ఎస్‌, 2 చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యం
 • నిర్మల్‌లో బీజేపీ ఆధిక్యం
 • ఆలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు లీడ్‌
 • ఆశ్వారావుపేటలో ఐదో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌
 • సూర్యాపేటలో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం.. లీడ్‌ కొచ్చిన జగదీశ్‌రెడ్డి
 • పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు ఆధిక్యం
 • ఖైరతాబాద్‌లో దానం ముందంజ
   
 • రామగుండంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ 12 వేలకు పైగా లీడ్‌
 • కూకట్‌పల్లిలో మాధవరం లీడ్‌ 7 వేలకు ఓట్లకు పైనే
 • కొత్తగూడెంలో కూనంనేనికి 3వేలకు పైగా(3,350) ఓట్ల ఆధిక్యం
 • కొడంగల్‌లో మూడో రౌండ్‌ ముగిసేసరికి 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌
 • సిరిసిల్లలో కేటీఆర్‌కు 1500 వందల ఓట్లకు పైగా లీడ్‌
 • అంబర్‌పేట రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం
 • సత్తుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌
 • కుత్బుల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లీడ్‌
 • సంబరాల్లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు
 • వరంగల్‌ కాంగ్రెస్‌ 9, బీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో ముందంజలో..
 • రంగారెడ్డి కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 2
 • నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఐదు, బీఆర్‌ఎస్‌ 3, బీఆజేపీ 3
 • ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ 4, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 2
 • ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు అనూహ్య ఫలితాలు
   
 • మహేశ్వరంలో రెండో రౌండ్‌లో సబితా ఇంద్రారెడ్డి మందంజ
 • నారాయణపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి మందంజ
 • ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
 • కరీంనగర్‌లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో ముందంజ
 • భువనగిరి రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం  ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
 • కాంగ్రెస్‌ 18, బీఆర్‌ఎస్‌ 12, బీజేపీ 1 స్థానాల్లో ముందంజ
 • ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ వెనుకంజ
 • తొమ్మిది కాంగ్రెస్‌, ఒకటి సీపీఐ

   
 • నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 2 స్థానాల్లో ఆధిక్యం

   
 • రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి.. సీతక్కకు 3 వేల ఓట్లకు పైగా లీడ్‌
 • మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ముందంజ
 • జనగామలో బీఆర్‌ఎస్‌ లీడ్‌
 • రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌

   
 • నల్గొండ నాలుగో రౌండ్‌ పూర్తయ్యే సరికి.. 12 వేల ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
   
 • కొడంగల్‌లో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి ఆధిక్యం
 • 4,389 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌

   
 • హుజూరాబాద్‌ తొలి రౌండ్‌లో కౌశిక్‌రెడ్డి ముందంజ
 • వెనుకబడిన ఈటల
   
 • వికారాబాద్‌లో మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం
   
 • కరీంనగర్‌లో గంగుల ముందంజ
 • 1145 ఓట్ల ఆధిక్యంలో గంగుల

   
 • బాల్కొండలో బీఆర్‌ఎస్‌ ముందంజ

   
 • బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ ముందంజ

   
 • రెండో రౌండ్‌లో ఆధిక్యంలోకి వచ్చిన కేటీఆర్‌
 • జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ ముందంజ
 • గజ్వేల్‌లో ఈటల వెనుకంజ
 • పటాన్‌చెరులో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం


   
 • సత్తుపల్లిలో 2,240 ఓట్ల ఆధిక్యంలో కాం‍గ్రెస్‌  సిరిసిల్లలో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • తొలి రౌండ్‌లో కేటీఆర్‌ వెనుకంజ
 • 265 ఓట్లతో వెనుకబడిన కేటీఆర్‌
   
 • సిర్పూర్‌లో బీజేపీ ముందంజ

   
 • ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజ


  రెండో రౌండ్‌లో.. 
 • రెండో రౌండ్‌లోనూ కామారెడ్డిలో  రేవంత్‌రెడ్డి ముందంజ
 • 1962 ఓట్లతో ముందంజలో రేవంత్‌
   
 • దుబ్బాకలో తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం
 • తొలి రౌండ్‌లో వెనుకబడ్డ పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ ప్రముఖులు  వెనుకంజ వీళ్లే.. 
 • మానుకొండూరులో రసమయి
 • పాలకుర్తిలో ఎర్రబెల్లి
 • తుంగతుర్తిలో గాదరి వెనుకంజ
 • ఆదిలాబాద్‌ జోగురామన్న
 • కేటీఆర్‌

   
 • చార్మినార్‌లో తొలిరౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
 • జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • కొత్తగూడెంలో సీపీఐ ముందంజ
 • పాలేరులో పొంగులేటి ముందంజ
 • కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్‌ ముందంజ
 • సనత్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని ముందంజ
 • బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం
 • ములుగులో కాంగ్రెస్‌ సీతక్క ముందంజ
 • మెదక్‌లో 5 వేలపై ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్‌
 • పొంగులేటికి 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం

   
 • ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం
 • హైదరాబాద్‌లో ఎక్కువ స్థానాల్లో బీఆర్‌ఎస్‌
   
 • స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ
 • సత్తుపల్లిలో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • మానుకొండూరులో కాంగ్రెస్‌ ముందంజ
 • నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ ముందంజ
 • నాగర్‌కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌ ముందంజ
 • తాండూర్‌లో బీఆర్‌ఎస్‌ ముందంజ
 • బెల్లంపల్లిలో గడ్డం వినోద్‌ ముందంజ  బీజేపీ తొలి రౌండ్‌ ఇలా..
 • మహేశ్వరంలో బీజేపీ ఆధిక్యం
 • నిర్మల్‌లోనూ బీజేపీ లీడ్‌
 • కరీంనగర్‌లో బండి సంజయ్‌ లీడ్‌

   
 • ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ ముందంజ
 • ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ దానం నాగేందర్‌ ముందంజ
 • వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ ముందంజ
 • మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్‌ ముందంజ


  బీఆర్‌ఎస్‌ తొలి రౌండ్‌లో.. 
 • నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం
 • సనత్‌ నగర్‌లో తలసాని
 • జుక్కల్‌లో ముందంజ
 • గజ్వేల్‌ తొలిరౌండ్‌లో కేసీఆర్‌కు 300 ఓట్ల ఆధిక్యం
 • పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ
 • సిరిసిల్లలో కేటీఆర్‌ లీడ్‌
 • శేరిలింగంపల్లిలో గాంధీ
 • సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్‌లో..
 • ముషీరాబాద్‌లో 
 • భూపాలపల్లిలో  తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ సత్తా 
 • ఈవీఎం లెక్కింపు తొలి రౌండ్‌లో.. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజ
 • మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ ముందంజ
 • ఉమ్మడి కరీనగర్‌లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌, రెండు చోట్ల బీజేపీ ముందంజ
 • మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్‌
 • నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యం
 • అశ్వారావుపేట తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
 • కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ
 • మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజ  ఈవీఎం ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్‌లో..
 • భువనగిరి లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముందంజ
 • నల్లగొండ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్
 • మిర్యాలగూడ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్
 • భట్టి విక్రమార్క మొదటి రౌండ్‌లో 2022 ఓట్ల మెజార్టీ
 • ఇల్లందులో కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య ఆధిక్యం 
 • ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం
 • ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 800 ఆధిక్యం

   
 • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌లో ఇండిపెండెంట్‌ బర్రెలక్క ముందంజ  పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు..
 • ఉమ్మడి వరంగల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ ముందంజ
 • పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో.. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజ
 • హుజురాబాద్‌ పోస్టల్‌ కౌంటింగ్‌లో ఈటల ముందంజ
 • మంచిర్యాల, బెల్లంపల్లి కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ
 • కామారెడ్డి పోస్టల్‌ కౌంటింగ్‌లో అనూహ్యంగా ముందంజలోకి వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి


  కౌంటింగ్‌పై సీఈవో స్పందన
 • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నడుస్తోంది
 • 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతోంది
 • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది
 • ఈవీఎం లెక్కింపు ప్రారంభం అయ్యింది
 • ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు...ప్రశాంతంగా కౌంటింగ్ నడుస్తోంది
 • ఇబ్రహంపట్నం ఘటనలో ఫిర్యాదులు వచ్చాయి
 • డీఈవో వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు 
 • ఇబ్రహీంపట్నం ఘటన సమసిపోయింది... అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ చూపించాం
 • ఇబ్రహీంపట్నంలోనూ  కౌంటింగ్ ప్రారంభం అయింది

  పోస్టల్‌ బ్యాలెట్‌
 • కామారెడ్డి, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ
 • నల్గొండలో కాంగ్రెస్‌ ముందంజ
 • చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్‌(ఎంఐఎం) ముందంజ
 • ఖమ్మం, మధిరలో కాంగ్రెస్‌ అభ్యర్థులు తుమ్మల, భట్టి ముందంజ
 • హుజూరాబాద్‌లో ఈటల ముందంజ
 • కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి ముందంజ
 • పరిగి, వికారాబాద్‌, తాండూరులో ముందంజలో కాంగ్రెస్‌ అభ్యర్థులు
 • వేములవాడలో కాంగ్రెస్‌ ముందంజ
 • సిరిసిల్లలో కేటీఆర్‌ ముందంజ
 • పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

   
 • ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిలో.. ఇంకా మొదలుకాని పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు


 


 

 • ప్రగతి భవన్ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

  అధికారం మాదే: మాణిక్‌రావ్‌ ఠాక్రే
 • తెలంగాణలో 70 సీట్లు కచ్చితంగా గెలుస్తాం
 • ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలే నిజం కాబోతున్నాయి
 • మీడియాతో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేనేతల్లోనే కాదు.. అందరిలో ఉత్కంఠ

 • తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల నిరీక్షణకు నేటితో తెర
 • రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం
 • హోరాహోరీ రాజకీయపోరులో తలపడుతున్న 2,290 మంది
 • అసెంబ్లీలో అడుగుపెట్టబోయే ఆ 119 మంది ఎవరో అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర
 • మొత్తం 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
 • అధికార కైవసానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 60.
 • ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో గెలుపుపై హస్తం పార్టీ ధీమా
 • మళ్లీ అధికారం మాదేనని బీఆర్‌ఎస్‌
 • కచ్చితంగా కింగ్‌ మేకర్‌ అవుతామంటున్న బీజేపీ
 • ఇండిపెండెంట్ల ప్రభావం ఎంత?
 • పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం
  ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
 • తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
 • పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రారంభించిన అధికారులు
 • మొత్తం 2.20 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు
 • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 12వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
 • 1లక్ష 80వేల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
 • అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్‌
 • ఉదయం 8.30గం.కి ప్రారంభం కానున్న ఈవీఎంల కౌంటింగ్‌

   
 • సంగారెడ్డి జిల్లా అందోల్ (36) స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఓపెన్ చేసిన ఎన్నికల అధికారులు


  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
 • కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
 • పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కోసం 131 టేబుళ్ల ఏర్పాటు
 • పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 2.20 లక్షల ఓట్లు
 • ఉదయం 8గం. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌
 • అరగంట నుంచి గంట లోపు పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ముగింపు
 • ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభం

  ఖమ్మంలో..  
 • మొత్తం 14,378 పోలైన పోస్టల్ బ్యాలెట్లు
 • ఆన్ లైన్ ద్వారా 150 మంది దరఖాస్తు చేసుకుని బ్యాలెట్ పంపించారు
 • వయో వృద్ధులు, దివ్యాంగులు 2290 మంది ఇంటి వద్ద ఓటు వేశారు
 • విధులలో పాల్గొన్న సిబ్బంది
 • ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్‌ బ్యాలెట్లు
 • ఖమ్మం 5,567
 • పాలేరు 2,163
 • మధిర 1,790
 • వైరా 2,074
 • సత్తుపల్లి 2,779
 • మొత్తం 14,373


   
 • క్యాంపు రాజకీయాల ప్రచారం అవాస్తం: భట్టి 
 • కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయా ప్రచారం అవాస్తవం.
 • మేము 70 నుంచి 80 సీట్లు గెలుస్తాం. 
 • తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని కోరుకుంటున్నారు. 
 • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. 
 • సీఎంగా ఎవరిని చేయాలన్నది అధిష్టానం చూసుకుంటుంది. 

  మాకు సైలెంట్‌ ఓటింగ్‌ జరిగింది: జోగు రామన్న
 • తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుంది. 
 • మాకు సైలెంట్‌ ఓటింగ్‌ జరిగింది. 
 • సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. 
 • నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. 


 

పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు..

 • వరంగల్‌లో పోస్టల్‌ బ్యాలెట్లను కౌంటింగ్‌ సెంటర్‌కు తరలిస్తున్న అధికారులు. 
  పోటాపోటీ ధీమా
 • హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0 అంటూ కేటీఆర్‌ ట్వీట్‌
 • ఎగ్జిట్‌పోల్స్‌తో అయోమయానికి గురికావొద్దని భరోసా
 • రాబోయే ప్రభుత్వం మనదేనంటూ కాంగ్రెస్‌ పోస్టర్లు

 • కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్న పార్టీల ఏజెంట్లు(అభ్యర్థులు)
 • తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, ఆపై ఈవీఎంల ఫలితాలు
 • ఉదయం తొమ్మిది గంటలకే ఈవీఎం తొలి ఫలితం?

   
 • పోస్టల్‌బ్యాలెట్‌ ఓటింగ్‌లో.. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌, తర్వాత మేడ్చల్‌

   
 • పెద్దపెల్లి జిల్లాలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మొత్తం 4164..
 • పెద్దపెల్లిలో 1356
 • మంథనిలో 993
 • రామగుండంలో 1815


   
 • ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్‌ బ్యాలెట్లు
 • ఖమ్మం 5,567
 • పాలేరు 2,163
 • మధిర 1,790
 • వైరా 2,074
 • సత్తుపల్లి 2,779
 • మొత్తం 14,373

   
 • ఆదిలాబాద్‌ కౌంటింగ్  కేంద్రాలకు చేరుకుంటున్న ఏజెంట్లు
 • అభ్యర్థితో పాటు పదహారు మందికి అనుమతి
 • కౌంటింగ్ కేంద్రానికి  చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే జోగురామన్న, స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి


  ప్రధాన నేతలు
 • గజ్వేల్‌, కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ
 • కొడంగల్‌, కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి పోటీ
 • గజ్వేల్‌, హూజురాబాద్‌ నుంచి ఈటల పోటీ
 • గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటల, కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ
 • సిర్పూర్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
 • మధిరలో భట్టి విక్రమార్క
 • హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 • కరీంనగర్‌లో బండి సంజయ్‌
 • కొరుట్లలో ధర్మపురి అర్వింద్‌
 • దుబ్బాకలో రఘునందన్‌
 • నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి
 • మల్కాజ్‌గిరిలో మైనంపల్లి, మెదక్‌లో మైనంపల్లి తనయుడు రోహిత్‌
 • కంటోన్మెంట్‌లో గద్దర్‌ కూతురు వెన్నెల
 • చంద్రాయగుట్టలో అక్బరుద్దీన్‌ పోటీ
 • సిరిసిల్ల కేటీఆర్‌
 • సిద్ధిపేట హరీష్‌రావు
   
 • బరిలో కొల్లాపూర్‌ బర్రెలక్క(కర్నె శిరీష), రామగుండం సోమారపు సత్యనారాయణ, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్‌ తదితరులు కూడా..


  లెక్కింపు కేంద్రంలో..
 • ఓట్ల లెక్కింపునకు.. 14 టేబుళ్లు (పోలింగ్‌ కేంద్రాలు 350కి మించిన చోట 28 టేబుళ్లు)
 • ఒక్కో టేబుల్‌ వద్ద..    సూపర్‌వైజరు, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్‌, పోటీలోని అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటు
 • సెల్‌ఫోను.. ఆర్వో, పరిశీలకులు, ప్రత్యేక అధికారుల ఫోన్లకే అనుమతి

   
 • తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్‌
 • చివరిగా శేరిలింగంపల్లి ఫలితం
 • ఎక్కువ మంది పోటీ చేయడంతో.. సిద్ధిపేట గజ్వేల్‌ ఆలస్యమయ్యే అవకాశం

   
 • కౌంటింగ్‌ ఇలా.. 
 • ఉదయం 5: 00 లెక్కింపు కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది
 • ఉదయం 7: 00 టేబుళ్ల వద్ద పని మొదలు
 • ఉదయం 8: 00 తపాలా ఓట్ల లెక్కింపు ప్రారంభం
 • ఉదయం 8: 30 మొదటి రౌండు తపాలా ఓట్ల ఫలితం
 • ఉదయం 9:00 ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు, కొన్ని చోట్ల ఉదయం 8.30 నుంచి
 • ఉదయం 9: 30 మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం
 • ప్రతి 15-20నిమిషాల నుంచి అరగంటకోసారి ఒక్కో రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం
  కౌంటింగ్‌.. టిక్‌ టిక్‌
 • కాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌
 • ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్‌
 • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు 
 • పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 500 ఓట్ల కోసం ఒక టేబుల్‌
 • పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 131 టేబుల్స్‌
 • అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు
 • తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్‌ కేంద్రాలు
 • 1,798 టేబుల్స్‌, మొత్తం 2417 రౌండ్లలో లెక్కింపు పూర్తి
 • ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుల్స్‌
 • 11 గంటల వరకు ఫలితాల సరళిపై రానున్న స్పష్టత

   
 • ప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది
 • కౌంటింగ్‌ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌
 • తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119, మ్యాజిక్‌ ఫిగర్‌ 60
 • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
 • ప్రతీ 15-20 నిమిషాలకు రౌండ్‌ ఫలితం

  కీలకంగా ఫలితాలు
 • ఇవాళ తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
 • లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలువడనున్న ప్రజా తీర్పు కావడంతో కీలకంగా భావిస్తున్న పార్టీలు
 • బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ స్వయంగా 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం
 • కాంగ్రెస్‌ తరఫున అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు
 • బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారం
 • బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం
 • అన్ని పార్టీలు ప్రత్యేకంగా మ్యానిఫెస్టోల విడుదల


  నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
 • రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ
 • కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చి.. మిగిలిన 118 నియోజకవర్గాల్లో పోటీ 
 • భాజపా అభ్యర్థులు 111, ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ
 • బీఎస్పీ 107, సీపీఎం 19 స్థానాల్లో పోటీ
 • మొత్తం 104 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, అయిదుగురు ఎమ్మెల్సీలు
 • పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరి బరిలో దిగగా.. పలువురు స్వతంత్రులూ.. 
 • బీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేటీఆర్‌, హరీష్‌రావు, 
 • కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
 • బీజేపీ నుంచి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, 
 • సీపీఐ, సీపీఎంల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం,
 • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సహా పలువురు కీలక నేతలు
  నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
 • ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో గెలుపుపై ధీమాగా హస్తం పార్టీ
 • మళ్లీ అధికారం మాదేనంటున్న బీఆర్‌ఎస్‌
 • కింగ్‌ మేకర్‌ అవుతామంటున్న బీజేపీ
 • వీడనున్న శాసనసభ ఎన్నికల ఉత్కంఠ
 • 2.36 కోట్ల మంది తెలంగాణ ఓటర్ల తీర్పు వెలువడేది నేడే
 • నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement