తెలంగాణాలో కాంగ్రెస్‌ జోరు: సీతక్క ట్వీట్ల జోరు | Telangana Assembly Election Results 2023: MLA Seethakka In Lead, Her Satirical Tweets Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Telangana Election Results 2023: తెలంగాణాలో కాంగ్రెస్‌ జోరు, సీతక్క ట్వీట్ల జోరు

Dec 3 2023 12:09 PM | Updated on Dec 3 2023 2:21 PM

telangana election results seethakka lead her tweets viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్‌ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్‌లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ ఫలితాల్లో తన  జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత  ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్‌పైనా, బీఆర్‌ఎస్‌ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క  ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌ వెనుకంజలో ఉన్నారు.

ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌ వెనుకంజలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement