టీడీపీ కుట్ర: తెలంగాణలో ఓట్లను ఏపీలో చేర్చే యత్నం!

TDP Plans  Vote Conspiracy With Voter Verification Drive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత ఎన్నికల్లో ఘోర ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో టీడీపీ ‘నకిలీ ఓట్ల’ దందాకు తెరలేపింది. ఇప్పటివరకూ ఏపీలో నకిలీ ఓటర్లంటూ అనవరసర రాద్దాంతం చేస్తూ వస్తున్న టీడీపీ.. ఈసారి వేరే రాష్ట్రంలోని ఓట్లను ఏపీలో చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్‌ మొదలుపెట్టేసింది టీడీపీ.  అది కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లను ఏపీ జాబితాలో చేర్చడానికి కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కుట్ర పూరిత ఓట్ల రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందుకు నిజాంపేట్‌ విజ్ణాన్‌ స్కూల్‌లో ఏకంగా కౌంటర్‌ తెరిచింది టీడీపీ. దాంతో పాటు పలు కాలనీల్లో టీడీపీ ఓటర్‌ కౌంటర్లను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలను షురూ చేసింది టీడీపీ

‘మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్‌ చేసుకోవాలా?  అంటూ నకిలీ ఓట్లను చేర్చేందుకు యత్నాలు చేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్రలకు పాల్పడుతోంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా చేసి ఎన్నికల రోజు వీరందర్నీతరలించి టీడీపీకి ఓటేయించే కుట్రలకు వ్యూహ రచన చేసింది టీడీపీ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top