breaking news
-
కేసీఆర్ రక్తాన్ని,చెమటను ధారపోశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు తన రక్తాన్ని, చెమటను ధార పోశారు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్ల పాటు శ్రమించి వికాసం వైపు మళ్లించారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘పరిపాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత తక్కువ సమయాన్ని కేటాయించాం. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుని లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ప్రజలను మనల్ని పూర్తిగా తిరస్కరించలేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు పోదాం’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో శిక్షణ తరగతులు ‘బీఆర్ఎస్ను ఊదేస్తామని కొందరంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలో శ్రేణులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. పార్టీ కేడర్‌కు ఇకపై తెలంగాణ భవన్లో సీనియర్ నేతలతో పాటు నేనూ అందుబాటులో ఉంటా. ఇకపై తెలంగాణ భవన్ మా అడ్డా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోంది. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా నిలబడుతుంది. కేసులకు భయపడేది లేదు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలి. పార్టీలో ఎవరిపై కేసులు పెట్టినా పార్టీ యంత్రాంగం అంతా సమష్టిగా స్పందించాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్యారంటీలను గుర్తు చేస్తూనే ఉండాలి ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలతో సహా అన్నీ 420 హామీలనే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి. ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలి. రాజకీయ అక్కసుతో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న పేద గొంతుకలకు మనం అండగా నిలబడాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంపై సమీక్ష జరగనందునే ఓటమన్న శ్రేణులు కాగా ఈ సమీక్షలో పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ఆవేదన వెళ్లగక్కారు. 2014 నుంచీ పార్టీ నిర్మాణంపై ఎలాంటి సమీక్ష జరగనందునే ఓటమి పొందామని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ అధినేతకు చెప్పే ధైర్యం ఎమ్మెల్యేలు చేయలేదని, కాంగ్రెస్‌ను వదిలి బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశానికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన శ్రీనివాస్ కాలుపై నుంచి ఎంపీ కేశవరావు కారు వెళ్లింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి కేశవరావు దగ్గరుండి చికిత్స చేయించారు. గ్యారంటీల అమల్లో అనుమానాలు: కడియం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని, కర్ణాటకలో గ్యారంటీల అమలు సాధ్యం కాదని అక్కడి సీఎం సలహాదారు చెప్పారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మి పథకం తదితరాల అమలుపై సీఎం, డిప్యూటీ సీఎంకే స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా వన్ రేస్ నిధులు దురి్వనియోగమైతే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని, రద్దు చేయడం సరికాదని కడియం అన్నారు. -
కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాగా, తెలంగాణ భవన్లో ఎనిమిదో రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. -
ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని, నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి ఎమోషనల్.. నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో మంత్రి సతీమణి? -
ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో ఎవరెవరంటే?
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది. తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న వారంత కీలకమైన నేతలే. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు వచ్చిన వారంత కీలక నేతలే కావడం విశేషం. డిప్యూటి సీఎం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీగా సీట్లు రావడం వెనుక సైతం ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇక, సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు ఎంపీ టికెట్ రేసులో ఉండటం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచర గణం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని మద్దతుదారులు చెబుతున్నారు. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్‌రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, కేడర్‌కు పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటూ 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ప్రసాద్‌రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్‌రెడ్డి విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధి నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల పోటీ చేసినప్పుడల్లా యుగంధర్ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగేంధర్ కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ కొసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే పార్టీ కొంత వీక్ ఉన్న ప్రాంతంలోనే సొనియాను బరిలో నిలిపాలని భావిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ వంటి బలమైన నేతకు ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే పార్టీకి కొత్తగా లాభం చేకూరేదేమీ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. -
బీఆర్ఎస్లో దడ మొదలైంది: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్‌లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
సీఎం అనే రెండు అక్షరాలకంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్‌కు ప్రమాదం. సీఎం అనే రెండు అక్షరాలకంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే పోరాట పటిమ చూపగలుగుతాం. మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ పోరాట పటిమను ప్రజలు చూశారు. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ‘ప్రస్తుతం పార్టీ పరంగా జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయి. త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రెండు మూడు నెలలకోమారు అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తాం..’అని కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ దళంగా ముందుకు సాగుదాం ‘తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించినా, ఏడాదిన్నరలోనే ప్రజలు ఆ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొనే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్దానాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కాలయాపన చేస్తోంది. హామీల అమల్లో కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. ఈ నేపథ్యంలో హామీల అమలు కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేలా బీఆర్ఎస్ చేసే పోరాటానికి పార్టీ యంత్రాంగం కార్యోన్ముఖులు కావాలి. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించుకోవడంతో పాటు, పార్టీ పరంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. తెలంగాణ గళం, బలం బీఆర్ఎస్ పార్టీయే. రాబోయే ఎన్నికల్లో ‘కేసీఆర్ దళం’గా ఐకమత్యంతో ముందుకు సాగుదాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. దళితబంధు ఇచ్చినా ఓట్లు పడలేదు ‘మధిర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు.. 2019లో ఓడినా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చాం. మధిర మండలం చింతకాని మండలంలో లబ్ధిదారులందరికీ దళితబంధు ఇచ్చినా కమల్‌రాజ్‌కు ఓట్లు పడలేదు. ఆయన నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఆయన గొంతు కోసిందంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నా. ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ టికెట్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు ఇచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం..’అని కేటీఆర్ చెప్పారు. ఇక మీ కోసం మీ దగ్గరకే: మాజీ మంత్రి హరీశ్ ‘బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికం. భవిష్యత్తు అంతా మనదే. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయి. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు గనుక పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారు. కేసీఆర్‌కు అభివృద్ధి తప్ప పగతనం తెలియదు..’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఇకపై మేం హైదరాబాద్‌లో ఉండం. మీ కోసం మీ దగ్గరకే వస్తాం. నాలుగు రోజులు ఓపిక పడితే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తారు..’అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందినా వ్యతిరేక ఫలితాలు: నామా కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెందినా బీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామంటూ, పార్లమెంటు ఎన్నికల కోడ్ వెలువడే లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ నిలిచిందని, గత ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఎంపీ రవిచంద్ర, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మదన్‌లాల్, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు
సాక్షి, హైదరాబాద్: లక్షమంది అసదుద్దీన్లు, లక్ష మంది కేసీఆర్‌లు, లక్ష మంది రాహుల్‌గాంధీలు వచ్చినా నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు రాబోతున్నాయని, వచ్చే ఐదేళ్లలో దేశంలో ఎవరూ ఊహించని మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. 2047లోపు భారత్ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం కాదు.. దేశాభివృద్ధి కోసం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్‌గా మారాలని, నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎల్కే అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని 1990లో బీజేపీ (పాలమూరులో) తీర్మానం చేసిందని, అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. -
ఈ–రేస్‌పై చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ బిజినెస్ రూల్స్‌కి విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఫార్ములా ఈ–రేస్ ఒప్పందం, నిర్వహణపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ విధమైన విధి విధానాలు పాటించకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నెక్స్ జెన్ అనే కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే గతేడాది హైదరాబాద్‌లో ‘ఫార్ములా ఈ–రేస్’ నిర్వహించారని ఆరోపించారు. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రి వర్గం, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవల బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రూ.55 కోట్లను ప్రైవేటు కంపెనీకి చెల్లించారని భట్టి తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు రూ.110 కోట్లతో ఒప్పందం జరగగా, మిగిలిన రూ. 55 కోట్లను చెల్లించాలని సదరు కంపెనీ నోటీసు పంపిందన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ‘ఫార్ములా ఈ–రేసు’ను రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు. మంగళవారం సచివాలయ మీడియా సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ రేస్ వల్ల రాష్ట్రానికి ఏం ఆదాయం వచ్చింది కేటీఆర్? ఫార్మలా ఈ–రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందని సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్‌తో హైదరాబాద్‌కు ఎలాంటి లాభం జరగలేదని, పైగా ప్రభుత్వ నిధులను అప్పనంగా ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో రోజూ నన్ను కలవచ్చు ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి లబ్ధి పొందారన్నారు. ప్రజా భవన్లో ఎవరైనా తనను ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కలవవచ్చుని స్పష్టం చేశారు. విడతల వారీగా రైతుబంధు నిధులు రోజు వారీగా రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు చెల్లించామని, రెండు ఎకరాలున్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామన్నారు. -
ఎమ్మెల్సీలను బ్రోకర్లని అంటారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిని ఇరానీ కేఫ్‌గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరి స్తూ ఓ చానల్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కఠినచర్యలు తీసుకో వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం వ్యాఖ్యలు మొత్తం శాసనమండలి సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ చానల్ వేదికగా పెద్దల సభపై సీఎం మాట్లాడిన తీరు ఎథిక్స్ కమిటీ పరిశీలించాల్సిన రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బ్రోకర్లు, ల్యాండ్ డీలర్లుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. శాసన మండలిలో అనేక మంది నిజాయితీ కలిగిన సభ్యులతో పాటు వివిధ రంగాల్లో సేవలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని పేర్కొ న్నారు. సీఎం వాడిన భాషకు ఎంతో వేదనకు గుర య్యామని, ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సీఎం వ్యా ఖ్యలను పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
దీనిని సెక్యులరిజం అంటారా?
సాక్షి, హైదరాబాద్: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి స్తున్నామని బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు చెప్పారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీ ఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. వీరు కుహ నా లౌకిక వాదులుగా ప్రధాని మోదీని విమర్శించడమే కాకుండా బీజేపీకి ఇది చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వారు మాట్లాడుతున్నారు తప్ప ఆ వర్గాలపై ప్రేమతో మాత్రం కాదని స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణంపై జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే కదా..మరి రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. ఒక్కొక్క కేసులో ఒక్కోలా మాట్లాడటం సెక్యులరిజమా అని రఘునందన్ నిలదీశారు. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి హత్య జరిగినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్‌తో జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లిన జగ్గారెడ్డి 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పోటీ, నెల రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కార్యక్రమం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
TS: రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి,హైదరాబాద్ : ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై నిర్లక్ష్యంగా పడిపోవటంతో కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రజల నుంచి స్వీకరించిన ప్రజాపాలన అప్లికేషన్లను ప్రైవేట్ వ్యక్తులు నిర్లక్ష్యంగా పట్టుకెళ్తున్న వీడియోలను తాను తరచూ చూస్తున్నానని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులలో కోట్లాది మంది తెలంగాణ పౌరుల సున్నితమైన డేటా ఉందని, ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఎవరైనా మీకు పింఛను, ఇల్లు , 6 గ్యారంటీలలో ఏదైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీతో పాటు బ్యాంకు వివరాలను ఇవ్వవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండని సూచించారు. బీఆర్ఎస్కు ఓటు వేశామా లేదా అనే దానితో సంబంధం లేకుండా సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటను తీవ్రంగా పరిగణించి సైబర్ నేరగాళ్ల బారిన పడకండని కేటీఆర్ కోరారు. ఇదీచదవండి..రూ.5 కోట్లు చీటింగ్..బీఆర్ఎస్ నేత చీటింగ్ -
TS: రూ.5 కోట్లు చీటింగ్.. బీఆర్ఎస్ నేత అరెస్టు
సాక్షి,హైదరాబాద్: గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల సంతకాలు ఫోర్జరీ చేసి ఓ కంపెనీని రూ.5 కోట్లు మోసం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిడ్ డే మీల్స్ కాంటట్రాక్టు ఇప్పిస్తానని బీఆర్ఎస్ నేత అరవింద్ తమ వద్ద రూ. 5 కోట్లు తీసుకున్నాడని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బెంగళూరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు అరవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ వద్ద రూ.5 కోట్లు తీసుకుని మిడ్ డే మీల్స్ స్కీమ్‌కు సంబంధించి అరవింద్ ఏకంగా ఒక ఫేక్ జీవోను కూడా తయారు చేశాడు. ఇదీచదవండి.. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ -
TS: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న సోహైల్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద తనపై నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు కేసు కొట్టివేయాలని సోహైల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే తన క్లయింట్‌పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారని సోహైల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సొహైల్ 15 కేసులు ఉన్నట్టు చూపించారన్నారు. అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే సోహైల్ దుబాయ్ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద గత డిసెంబర్ 23న సోహైల్ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహైల్ కారు ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహైల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. దీనిపై విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. అప్పటికే దుబాయ్ పారిపోయిన సోహైల్‌ను అరెస్టు చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ -
TS: ఫార్ములా ఈ రేస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రతీ పైసాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు ‘ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రేసుపై మా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఫార్ములా ఈ-రేస్ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందింది. ఫార్ములా ఈ-రేస్‌లో ముగ్గురు వాటాదారులున్నారు’ అని భట్టి వెల్లడించారు. కాగా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా గత ప్రభుత్వంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఫార్ములా ఈ రేసు ఒప్పందం చేసుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అరవింద్‌కుమార్‌కు మంగళవారం ప్రభుత్వం మెమో జారీ చేసింది. అరవింద్‌కుమార్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఇదీచదవండి.. ఫార్ములా ఈ రేస్.. ఐఏఎస్ అరవింద్‌కుమార్‌కు మెమో -
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్‌యాదవ్?
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్రము నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ పీఠం 2024 లో బీజేపీకె చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రము నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. అదేవిదంగా 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్ కు పోటీచేయడానికి రాష్ట్రము నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రంజిత్ యాదవ్ ఇప్పటి నుంచే నల్ల గొండ నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీలో కొత్తగ చేరినప్పటికీ, ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది. కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి...! నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ.. నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి. బరాబర్ సిద్ధమై ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి...! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు కుందూరు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా... తేరా చిన్నపరెడ్డికి మాత్రమే ఉందనే రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అట్లనే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీ గానూ మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటిపరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈయనతో పాటు ట్రైకార్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి రంజిత్ యాదవ్..! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్.. బీజేపీ పక్షాన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో... జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసి వస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అట్లనే టికెట్ సాధించి బరిలో నిలిచే గెలిచే అభ్యర్థులు ఎవరో.. అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా...బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ‘పొలిటికల్ ఇన్చార్జి’లను నియమించింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా వారందరినీ ఆయా ఎంపీ సీట్లకు ఇన్చార్జులుగా నియమించింది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ను, ఇంకా మిగతా స్థానాలకు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎంపీకి ఇన్చార్జిగా అవకాశం కల్పించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నియామకాలు చేసినట్టు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆరు గ్యారంటీలకు నిధులెలా తెస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో జరిగిన రూ. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారో, ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో, నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసిందని, ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరు గ్యారంటీలు ఇచ్చిందన్నారు. రాష్ట్రం అప్పుల పా లైందని తెలిసీ ఆరు గ్యారంటీలు ఎలా ఇచ్చారు? ఆ అప్పులు ఎలా తీరుస్తారో ప్రజలకు కాంగ్రెస్ వివ రించి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, గతంలోని డ్రగ్స్ కేసు ను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. నయీం అక్రమ ఆస్తులు, వాటి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలని, ఈ కేసును తవ్వితే అన్ని పార్టీల నాయకుల బండారం బయటపడుతుందన్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ తప్పిదాల వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా రని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా కాదా చెప్పా లన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయని, తెలంగాణ సమాజం ఆలోచించి బీజేపీని గెలిపించాలని కోరా రు. కాగా, తనకు ఈటలతో ఎలాంటి విభేదాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విధానాలను ఎండగడతామన్నారు. తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎంపికైన దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న దళితులు, బీసీలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. శ్వేతపత్రాల పేరిట డ్రామా ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం అప్పులు, శ్వేత పత్రాల పేరిట డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశామంటూ కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలన లోపాలను ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులుచేర్పులు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సరళి మేరకు బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యకర్తలను కలవకుండా అడ్డుపడ్డారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధిష్టానంతో కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ పనితీరు, ఓటమికి కారణాలపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కాదు.. బీఆర్ఎస్ ఓటమి : వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడదామని కార్యకర్తలు తమకు భరోసా ఇచ్చారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ది గెలుపు కాదని, బీఆర్ఎస్ ఓటమి మాత్రమేనన్నారు. నిజామాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశ అనంతరం తెలంగాణభవన్‌లో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాదర్బార్ ప్రహసనంగా మారిందని, సీఎం రేవంత్ నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారన్నారు. ప్రజాదర్బార్ ద్వారా నెల రోజుల్లో పరిష్కరించిన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట ప్రజలను బలిపశువులను చేస్తూ దరఖాస్తుల స్వీకరణ పేరిట రోడ్లపైకి తెచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చొప్పున ఇవ్వాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో జిల్లాల సంఖ్య తగ్గించాలని రేవంత్ అనుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు. -
అర్హుల గుర్తింపునకు 'ఇంటింటి సర్వే'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారంటీలను వందరోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజాపాలన దరఖాస్తులు..తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయ మీడియా సెంటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు రాగా, మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్‌కార్డులు, ఉద్యోగాలు, భూసమస్యలపైనా వచ్చాయన్నారు. 30వేల మందికిపైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటాఎంట్రీ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయ్యిందని, మొత్తం పూర్తిచేసేందుకు ఈనెల 25 నుంచి 30వతేదీ వరకు సమయం పడుతుందని, ఆలోపు పూర్తి సమాచారం కంప్యూటరీకరిస్తామన్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని చెప్పారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత అర్హులందరి లిస్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తామన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు వెళ్లి వివరాలు మరోసారి పరిశీలిస్తారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 40 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, మల్లిఖార్జున ఖర్గే, రాహూల్గాందీ, ప్రియాంకగాందీలు సైతం ఎక్కడా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి మంగళవారానికి నెలరోజులు అవుతుందని, ఈలోపే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రతిపక్షాలు, మీడియా సైతం ఓపిక పట్టాలని కోరారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలపై చర్చిస్తామన్నారు. వీటన్నింటిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయని అర్హులైనవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన వెబ్సైట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కమిటీలో ఎవరంటే.. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్‌కమిటీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సబ్‌కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు తాను సభ్యుడిగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. రేషన్కార్డులపైనా త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుతం 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, కార్డులు లేనివారి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 6వ తేదీ నుంచి అధికారులంతా ఓటర్‌లిస్ట్ ప్రక్రియలో ఉన్నారని, అయినా ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా డేటాఎంట్రీ కొనసాగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచి్చన భూములకు సంబంధించిన జీఓలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. -
TS: బీఆర్ఎస్తో పొత్తుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీతో గతంలో తాము ఎప్పుడైనా కలిశామా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ కీలక నేతలతో బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో సోమవారం కిషన్‌రెడ్డి సమామేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పారు. ‘పార్లమెంట్ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంపై చర్చించాం. పార్టీ ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఇంఛార్జ్‌లుగా నియమించాం. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ కన్వీనర్లను నియమిస్తాం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభిస్తాం. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలవనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత తెలంగాణ ప్రజలకు లేదు. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్టకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14 నుంచి 22 వరకు అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. 22న ప్రతీ ఇంటా రామజ్యోతులు వెలిగించాలి. హనుమాన్ సినిమా వాళ్ళు ప్రతి టికెట్ పై 5 రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం అభినందనీయం’అని కిషన్‌రెడ్డి అన్నారు. ఇదీచదవండి.. ప్రజాపాలనపై కేబినెట్ భేటీ -
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం -
TS: స్పీడ్ పెంచిన బీజేపీ.. పొలిటికల్ ఇంచార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంఛార్జ్‌లు వీరే.. ►హైదరాబాద్- రాజసింగ్ ►సికింద్రాబాద్- లక్ష్మణ్ ►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి ►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి ►అదిలాబాద్- పాయాల్ శంకర్ ►పెద్దపల్లి- రామారావు పటేల్ ►కరీంనగర్- ధన్ పాల్ సూర్యనారాయణ ►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి ►జహీరాబాద్- వెంకట రమణ రెడ్డి ►మెదక్- పాల్వాయి హరీష్ ►మహబూబ్ నగర్- రామచందర్ రావు ►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి ►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి ►భువనగిరి - NVSS ప్రభాకర్ ►వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి ►మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు ►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి -
TS: బీజేపీ కీలక భేటీ.. శాసనసభాపక్షనేత ఎన్నిక?
సాక్షి, హైదరాబాద్: నేడు బీజేపీ కీలక సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. వివరాల ప్రకారం.. కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిపై రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చ జరగనుంది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురితో కూడిన జాబితాను సిద్ధం చేసి నేతలు కేంద్ర కమిటీకి పంపించనున్నారు. ఇక, పార్లమెంట్లో పొలిటికల్ ఇంఛార్జ్‌లు, కన్వీనర్లతో సమావేశం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మరోవైపు, బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా నేడు ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్, మహేశ్వర్రెడ్డిలలో ఒకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, పార్లమెంట్ ఎన్నికలు సమన్వయం, రామ మందిర దర్శనం తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్‌బన్సల్, సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్‌లు హాజరయ్యారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే, రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. -
కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగాఉందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహా పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్‌లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటులో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయపారీ్టలతో జరిగే త్రిముఖ పోటీ బీఆర్ఎస్కే అనుకూలిస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిలో పునరాలోచన: అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకుందని, ప్రజల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వారు పునరాలోచనలో పడ్డారని, అప్పులను బూచిగా చూపి హామీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో తొందరపడటం లేదని, బీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని, కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ పదాన్ని కాంగ్రెస్ నిషేధించిందని, బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పారీ్టలు సిద్ధంగా ఉన్నాయని, పారీ్టలకు ఎత్తు పల్లాలు తప్పవన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో అందరికీ దళితబంధు సాయం అందగా, ఇతర వర్గాలు ఓట్లు వేయలేదని, దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు వంటి పథకాల ప్రభావం బీఆర్ఎస్పై పడిందని చెప్పారు. జుక్కల్‌లో షిండే ఓడిపోతారని తాము భావించలేదన్నారు. అధికారం కోల్పోయినా మునుపటి ఉత్సాహమే : హరీశ్‌రావు పార్టీ తరపున తప్పులు ఉంటే మన్నించాలని, అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటమిని దిగమింగుకొని లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల సంఖ్య బలంగా ఉంటేనే లోక్‌సభలో తెలంగాణ గళం వినిపిస్తుందన్నారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండిచేయి, కాంగ్రెస్‌ది తొండిచేయి అని, కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నిస్తే గతంలో బీజేపీతో తాము కుమ్మక్కు అయినట్టు రేవంత్ ఆరోపించారన్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన 1.25 కోట్ల దరఖాస్తులకు మోక్షం కల్పించాలని, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని హరీశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో కాకుండా బీఆర్ఎస్ బలహీనతల వల్లే గెలిచిందని, బీఆర్ఎస్లో కొందరు సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని చెప్పారు. అభివృద్ది ఎజెండాగా కాకుండా, ఇతర అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో కాంగ్రెస్ సఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో గెలుపుపై బీఆర్ఎస్ ధీమా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా బీఆర్ఎస్ బలోపేతమవుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశం అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మీడియాతో మాట్లాడారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యేలు మాణికరావు, చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు