breaking news
-
‘కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది?’
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. హరీష్‌పై కవిత సంచల వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన అద్దంకి దయాకర్.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది. మొన్న కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్‌ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది. కేటీఆర్, హరీష్, కవితల మధ్య ఏదో పంచాయితీ ఉంది’ అంటూ అని పేర్కొన్నారు.కాగా, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. -
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్‌రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్‌గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం. హరీష్‌రావు,సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్‌కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్‌పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు. -
‘కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్-బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్,బీజేపీ తీరును ప్రశ్నిస్తూ సోమవారం తెలంగాణ భవన్లో వేముల మీడియాతో మాట్లాడారు.సీబీఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. బీజేపీ ,సీఎం రేవంత్ రెడ్డి స్నేహ బంధం బయట పడింది. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారు. బీజేపీ సభ్యుడిని కాంగ్రెస్ ఉపయోగించుంది. ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారు. కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ స్క్రిప్ట్‌నే పాల్వాయి హరీష్ మాట్లాడారు. హరీష్‌రావు ప్రసంగాన్ని కాంగ్రెస్,బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. -
తీర్పు పేరుతో భయపెట్టాలని చూశారు.. అది సాధ్యం కాదు: సుదర్శన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ సీనియర్ నేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కర్ణాటక రాజ్యసభ సభ్యుడు నసీర్ హుస్సేన్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు. ఓటు చోరీ జరుగుతున్న ఈ సమయంలో న్యాయ కోవిదుడి గెలుపు అవసరం. మీ ఆత్మప్రబోధానుసారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయండి. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. సుదర్శన్ రెడ్డి గెలుపు తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాం. సుదర్శన్ రెడ్డి రాకతో ఎన్డీయేకు బలమైన పోటీ ఇస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం. ఉపరాష్ట్రపతి రాజీనామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఒవైసీలు మద్దతు ఇవ్వాలని గతంలో విజ్ఞప్తి చేశాను. మళ్ళీ కోరుతున్నాను అని అన్నారు. అనంతరం, అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఇక ముందు కూడా ఉండదు. రాజకీయం అనే ముళ్ల కిరిటాన్ని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది అడిగారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పాను. పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాను. ఒక తీర్పు గురించి చర్చను ప్రారంభించారు. ఆ తీర్పు గురించి చర్చిస్తే నేను భయపడతానని అనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి చర్చ చేసేటప్పుడు ముందు దాన్ని చదవాలి’ అని హితవు పలికారు. -
రేవంత్.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్‌కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
చర్చ లేకుండానే బీసీ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అయితే.. ఈ పరిణామంతో బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. -
ఎర్రవల్లికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. -
డిక్లరేషన్ కాదు.. డెడికేషన్ కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదని, డెడికేషన్ అని అన్నారు. శాసనసభలో ఆదివారం పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీ, ప్రధానమంత్రి అరగంటపాటు మాట్లాడుకుంటే అనుకున్న తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నిజంగా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఎన్ని గంటలు చర్చించినా ఉపయోగం ఉండదు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. తెలిసి కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఐదు నాలుకలు, ఐదు స్వరాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అని ఇంకోసారి, పార్టీ పరంగా అని మరోసారి, రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత అని ఓసారి, ఇప్పుడేమో బిల్లు తెచ్చి చేస్తామని అంటున్నారు. ఇదంతా బీసీలు గమనించటం లేదనుకుంటున్నారా?’అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ గత ప్రభుత్వంలో పెట్టారంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లే రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగులో ఉంది. దాన్ని వెనక్కి తెప్పించి ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఆర్డినెన్స్‌పైనే సంతకం చేయని గవర్నర్, ఇప్పుడు బిల్లుపై సంతకం చేస్తారని ఎలా భావిస్తున్నారు? జిత్నీ ఆబాదీ ఉత్నా హఖ్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ’అని చెప్పే రాహుల్‌గాంధీ బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ నిలదీశారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే న్యాయం.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గిందని తేలినా దానిపై సమీక్షించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడంతోనే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యతతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచి్చన వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రి సన్నిహితుడైన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీఓలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. -
కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలు సుహృద్భావంతో కలిసిపోకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించటం కల్వకుంట్ల కుటుంబానికి ఇష్టంలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అది కల్వకుంట్ల కాదు.. ఎవరినీ కల్వకుండ చూసే కుటుంబం. బీసీలు, ఓసీలు కలవొద్దు.. ఎస్సీలు, ఎస్టీలు కలవొద్దు.. హిందువులు, ముస్లింలు కలవకుండా చూసే కుటుంబం అది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని గంగుల కమలాకర్ అన్నారు. కానీ వాళ్ల నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్ల నాయకులు కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని చెప్పకనే చెప్పారు’అని దుయ్యబట్టారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. హైకోర్టు ఆదేశాలను అనుసరించే రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని సీఎం తెలిపారు. ‘బీసీల గణన బాధ్యతను తొలుత రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించగా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుక్షణమే డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి కుల గణన నిర్వహించాం. ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపి సమాచారాన్ని సేకరించాం. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాం. ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశాం. 365 రోజుల్లోనే పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించాం. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. 5 నెలలుగా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’అని సీఎం గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా లాబీయింగ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని గత ప్రభుత్వం 2018, 2019లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయి. అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపించాం. ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ఆయన (గవర్నర్) ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి (ఈటల రాజేందర్)గా పనిచేసిన ఆయనతో మితృత్వం ఉంది. రాష్ట్రపతికి పంపించాలని తెరవెనుక లాబీయింగ్ చేస్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దకు పోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరంగా ఆ బిల్లును సభలో ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనా, డెడికేటెడ్ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇచ్చాం’అని సీఎం స్పష్టం చేశారు. ఐదుసార్లు కోరినా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. పెండింగ్ బిల్లులపై సంప్రదించేందుకు ఐదుసార్లు ప్రధానికి లేఖ రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే ప్రధాని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గంగలు కమలాకర్ అటువైపు కన్నెత్తి చూడలేదని.. అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరని అర్థమవుతోందని ఆరోపించారు.బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తన పలుకుబడితో ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ‘రాహుల్‌గాంధీ ధర్నాకు రాలేదని గంగుల అన్నారు. రాహుల్‌గాంధీ చెప్పకపోతే ఇంత ముఖ్యమైన పని నేను చేస్తానా? రాహుల్‌గాం«దీకి తెలియకుండా ఏదీ చేయను. వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తే.. కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అభినందించి ఉంటే పెద్దరికం పెరిగి ఉండేది. వారేమో రారుం..వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు’అని సీఎం మండిపడ్డారు. -
నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు..: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో కృషి చేశామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీడబ్ల్యూసీ, నిపుణుల కమిటీ, ఇతర సంస్థలన్నీ ఆ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోవడం వల్లే దానిని మేడిగడ్డకు మార్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు అడ్డు తగిలారు. ఒక సమయంలో హరీశ్‌రావుకు స్పీకర్ మైక్ కట్ చేసి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో హరీశ్‌రావుకు స్పీకర్ కొంత సమయం ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద ఉపయోగం లేదంటేనే.. నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, చాప్రాల్ అభయారణ్యం ఉండటం వంటి కారణాలతోనే తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు ముందుకు సాగలేదని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖలోని మూడో పేజీలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ‘తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా పెరిగింది అని మంత్రి జూపల్లి అంటున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో మహారాష్ట్రలోని 16 వాగులు, తెలంగాణలోని 8 వాగుల నీళ్లు కలుస్తాయి. మేడిగడ్డ దగ్గర అదనంగా 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. మా సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కట్టి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చారని రిటైర్డ్ ఇంజినీర్లు కమిషన్‌కు స్పష్టంగా చెప్పారు. కానీ కమిషన్ వారి రిపోర్ట్‌ను పట్టించుకోలేదు’అని హరీశ్‌రావు వివరించారు. పోలవరం కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా అంటున్నారు. ప్రాణహితకు డీపీఆర్ 2009లో వస్తే, 28 ప్యాకేజీలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం). నారాయణపేట లిఫ్టు ఇరిగేషన్‌కు డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచింది మీరు కాదా? జలయజ్ఞంలో ఎన్నో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు లేకుండానే టెండర్లు పిలిచారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ గురించి గొప్పగా చెపుతున్నారు. దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా? గోదావరి నదిపై కట్టిన పోలవరం 10 సార్లు కూలింది. ఎందుకు ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు? ఎన్డీఎస్ఏ చైర్మన్‌గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఉన్న సమయంలోనే అది 5 సార్లు కూలింది. ఆయన ఇచ్చే రిపోర్టుకు ఇక విశ్వసనీయత ఏముంటది? ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలాయి. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్డీఎస్ఏ రాదు, కమిషన్లు వేయరు. ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్లోకి తేవాలి అని సూచిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?’అని ప్రశ్నించారు. మేడిగడ్డలో మరమ్మతు చేస్తే సరిపోతుంది.. మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకులో మూడు పిల్లర్లు కుంగటం తప్ప వ్యవస్థ అంతా అద్భుతంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా రూ.300 నుంచి రూ. రూ.4 వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒకవైపు కాళేశ్వరం కూలిందని చెబుతూ.. మరోవైపు హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని రూ.7,000 కోట్లతో టెండర్లు వేశారని, కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు ఎక్కడికెళ్లి వస్తాయి?’అని ప్రశ్నించారు. -
కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లోతైన దర్యాప్తు అవసరం.. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్ తేల్చిచెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు ‘కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్‌రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఢిల్లీకి సర్కస్ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలు: అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలుగా మారాయని అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు మారవు కేవలం పాస్ వర్డ్లు మారుతాయి. వైఎస్సార్ మరణం తో జలయజ్ఞం నిర్వీర్యం అయింది. చాలా ప్రాజెక్టులు పెడింగ్‌లో పడ్డాయి.ఉమ్మడి శాసనసభలో ఇరిగేషన్ పై ఆనాడు గంటల పాటు డిబేట్ జరిగేవి. కాళేశ్వరం నుండి చుక్క నీరు తీసుకోలేదు అని మంత్రి ఉత్తమ్ అన్నారు. మెడిగడ్డ అక్కడ కట్టారు... ఇక్కడ నుండి మార్చారు అని సుదీర్ఘంగా చర్చ జరిగింది.కాళేశ్వరం మరమ్మతులు చేస్తారా ఆపేస్తారా క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఇంత తిన్నారు అంత తిన్నారు నేను వాటి జోలికి పోను. కాలేశ్వరంలోని నీటిని ఏం చేయాలనుకుంటున్నారు. క్యాబినెట్ అప్రూవల్ తోనే సభలో కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేశామని ప్రభుత్వం చెప్తుంది..మరి అంతకంటే ముందే కమిషన్ రిపోర్ట్ వివరాలు మీడియాలో ఎలా బహిర్గతం అయ్యాయి. సభలోని సభ్యుల ముందుకు రాకుండానే మీడియాలో రిపోర్టు రావడం సభ సభ్యులను అగౌరపరచడమే. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కాంట్రాక్టు కంపెనీలు ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి..Mim పార్టీ , cpi కి మాత్రమే ఇవ్వలేదు. కాంట్రాక్టర్లు పార్టీకి ఫండింగ్ ఇచ్చే సాంస్కృతి మంచిది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ కాంట్రాక్టు కంపనీ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. మొత్తం ఘోష్ కమిటీ రిపోర్టు లో కాంట్రాక్టు కంపనీ పేర్లు ఎందుకు పేర్కొనలేదు. అన్ని రిపోర్టులు ఉన్నాయి అంటున్నారు మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.అవినీతి పరులను ఎదో చేసేస్తారు అంటూ ప్రజలు అనుకున్నారు కానీ చేసింది ఏమి లేదు. అవినీతి కాంట్రాక్టు చిన్న పెద్ద అని చూడకుండా ప్రతి ఒక్కరిని శిక్షించండి. పెద్ద కాంట్రాక్టు సంస్థలను ఎందుకు కాపాడుతున్నారు. పెద్ద కాంట్రాక్టు కంపనీలు కాంగ్రెస్ పార్టీకి ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి. -
పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి
సాక్షి,హైదరాబాద్: పొన్నం ప్రభాకర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు వేశారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గంగుల చిట్ చాట్ చేశారు.సభలో ఉత్తం, శ్రీధర్ బాబు, సీతక్క బిల్లులను ప్రవేశపెట్టారు.పొన్నం ప్రభాకర్ సభలో ఉండి బిల్లుల పై మాట్లాడం లేదు. పొన్నంతో సంబంధం ఉన్న బిల్లుల గురించి తప్ప..మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి. మళ్ళీ 12ఏండ్ల తర్వాతే పొన్నం గెలిస్తే ..గెలుస్తారు.కరీంనగర్లో నేతలతో పొన్నంకు సఖ్యత ఉండదని ఎద్దేవా చేశారు. -
బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలు డిసైడ్ చేస్తే బిల్లు పాస్ అవుతుందన్నారు. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 31వ తేదీ) జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘ బీసీ రిజర్వేషన్లపై సీఎం నాలుగుసార్లు మాట మార్చారు. మార్చి నాటి బిల్లుకు, ఈ బిల్లుకు తేడా ఏంటో చెప్పాలి. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది. 52సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ ఏం చేశారు. సీఎం రేవంత్ ఎందుకు ప్రధాని మోదీని కలవలేదు. ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేయాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నాంపల్లి బీజేపీ ఆఫీసు వద్ద హైటెన్షన్..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. మహిళా నేతలు గేట్లు ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.మరోవైపు.. కాసేపటి క్రితమే బీజేపీ మహిళా మోర్చా నేతలు బీజేపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా నిరసనలకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు మీద నుంచి దూకి నిరసన తెలిపేందుకు బీజేపీ మహిళా నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
చర్యలన్నీ అప్పుడే.. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్, మున్సిపల్ బిల్లుల సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం రిపోర్టుపై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చర్చ జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం రిపోర్టుపై సాయంత్రం చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హౌస్‌లో ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీ ఇచ్చాం. మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం. సభలో సాయంత్రం చర్చ ఉంటుంది. ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది. కేసీఆర్ తరఫున హరీష్ రావుకి కాపీ ఇచ్చాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటాం. కోర్టు విషయాలపై మాట్లాడను. సభలోనే అన్ని మాట్లాడతాం. చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటి దానిపై నిర్ణయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
ఎజెండాను రాత్రికి రాత్రే డిసైడ్ చేస్తామంటే ఎలా?: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రెండు రోజులే అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. శనివారం బీఏసీ సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన ఆయన.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో వరదల పై చర్చించాలని కోరాం. ఫీజ్ రీయింబర్స్‌మెంటుపై మాట్లాడాలని కోరాం. యూరియా కొరత పై మాట్లాడాలి కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏపై మాట్లాడాలనీ కోరాం. ప్రజా సమస్యలు మాట్లాడకుండా రెండు రోజులే సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. మేం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరాం. వరదపై మాట్లాడకుండా బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎరువులపై చర్చించాలని ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాం. ప్రజా పాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమా..?. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేకుండా పోయింది. రేపటి ఎజెండా ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాత్రికి చెబితే ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వాలి. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం అని హరీష్‌రావు అన్నారు. ఇదిలా ఉంటే.. సభ ఎన్నిరోజులపాటు నిర్వహించాలన్నది రేపు(ఆదివారం) నిర్ణయిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంటున్నారు. ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం. బీఆర్ఎస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం ,వరదల నేపథ్యంలో.. మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని శ్రీధర్‌బాబు మీడియాకు తెలిపారు. -
అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేపటి(ఆదివారం) నుంచి కాళేశ్వరంపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీతానేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. భయపడే కేసీఆర్ మళ్లీ కోర్టుకు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు.కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు.. ఆయన హయాంలోనే కూలింది. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి.. సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న న్యాయమూర్తి ఆయన. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానికి భయపడే కేసీఆర్, హరీష్‌రావు కోర్టుకెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు.. బాధ్యత ఆయనపై ఉంటది. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు.కాళేశ్వరం పూర్తి నివేదిక.. కంప్లీట్‌గా చర్చ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే.. కాళేశ్వరం విషయంలో తప్పైతే తప్పని బాధ్యతగా ఒప్పుకోవాలి. కేసీఆర్ అసెంబ్లీకి.. వస్తాడని అనుకుంటున్నాం. కాళేశ్వరంపై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?. ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ 10 ఏళ్లు డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలేదు?’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. -
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో మహమ్మద్ అజహరుద్దీన్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేర్లకు కేబినెట్ శనివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ముహమ్మద్ అజహరుద్దీన్.. 2009 ఫిబ్రవరి 19వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజహరుద్దీన్ ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు అధిష్టానం వద్ద మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారా? అనే సస్పెన్స్ కొనసాగనుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటు కోసం కాంగ్రెస్ నుంచి మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్.. ఈసారి తానే పోటీ చేస్తానంటూ ప్రకటించుకుంటూ వచ్చారు. మరోవైపు.. అభ్యర్థి ఎంపిక అంత ఆషామాషీగా జరగదని.. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధిష్టానం తొలి నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చింది. -
తెలంగాణ పాలిటిక్స్‌లో ‘యూరియా’ వార్
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్‌రావు హెచ్చరించారు.మరో వైపు, బీఆర్ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్‌రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్‌పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లకు తెలంగాణ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీఖాన్‌ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్.ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి కేబినెట్లో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఈ మధ్యే సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. ఇక.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ధీమాగా ప్రకటించుకున్నారు. మరోవైపు అధిష్టానం వద్ద మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారా? అనే సస్పెన్స్ కొనసాగనుంది. -
సచివాలయం వద్ద బీఆర్ఎస్ నేతల మెరుపు ధర్నా.. హరీష్ పరుగులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..యూరియా రైతుల హక్కు... అది అందకుండా చేయడం కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. -
ఇది కదా అసలు నిజం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇… pic.twitter.com/6vKlTipJbF— KTR News (@KTR_News) August 29, 2025రూ.3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు.