ఇంటర్నెట్‌ సృష్టికర్త ఇకలేరు | Robert Taylor, internet and computer pioneer, dies aged 85 | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ సృష్టికర్త ఇకలేరు

Apr 16 2017 11:58 AM | Updated on Sep 5 2017 8:56 AM

ఇంటర్నెట్‌ సృష్టికర్త ఇకలేరు

ఇంటర్నెట్‌ సృష్టికర్త ఇకలేరు

నేడు ప్రపంచం అంతా అరచేతిలో ఉందంటే అది ఇంటర్నెట్‌ మహిమే.

నేడు ప్రపంచం అంతా అరచేతిలో ఉందంటే అది ఇంటర్నెట్‌ మహిమే. ఏవిషయం ఎప్పుడు కావాలన్నా , దేనిగురించైనా సమాచారం కావాలంటే ముందు మనం వెతికేది ఇంటర్నెట్లోనే. మనకు కావాల్సిన సినిమాలు, ఆటలు, పాటలు ఇలా ఏదికావాలన్న ఇంటర్నెట్‌ నుంచే డౌన్లోడ్‌ చేసుకుంటాం. ప్రపంచం నలుమూలల్లో ఏమూలన ఉన్నా స్మార్టఫోన్‌తో లాప్‌టాప్‌తో వీడియోకాల్‌లో చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇదంతా ఇంటర్నట్‌ మహత్యమే.

కానీ ఈ ఇంటర్నెట్‌ 60ఏళ్లకింద సృష్టించబడింది. కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్‌ టేలర్‌ దీనికి బీజం వేశారు. నేటి ఆధునికి సమాజానికి పునాది వేసిన రాబర్ట్‌ టేలర్‌ 85ఏళ్ల వయస్సులో శనివారం మరణించారు. 1960 దశాబ్దంలో టేలర్‌ పెంటగాన్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు ఏజెన్సీలో సైంటిస్ట్‌గా పనిచేశారు. ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు సమాచారం చేరవేయడానికి ప్రత్యేకమైన ఇంటర్‌ కనెక్ట్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ని సృష్టించారు. 1969 అక్టోబర్‌ 29న టేలర్‌ శాన్‌ఫర్డ్‌లోని శాన్‌ఫర్డ్‌ రీసెర్చ్‌ ఇస్టట్యూట్‌ కి తొలి ఎలక్ట్రానిక్‌ సందేశం పంపించారు. అలా ఆరోజు మొదలైన నెట్‌వర్క్‌నే ఈరోజు మనం వాడుతున్న ఇంటర్నెట్‌. అనంతరం తన పరిశోధనలకు 1999లో బిల్‌క్లింటన్‌ నేషనల్‌ మోడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అవార్డు వచ్చినా టేలర్‌ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement