స్పెషల్‌ ఫీచర్లతో నుబియా స్మార్ట్‌ఫోన్‌ | Nubia N1 Lite With Front Flash Launched in India at Rs. 6,999 | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఫీచర్లతో నుబియా స్మార్ట్‌ఫోన్‌

May 22 2017 11:27 AM | Updated on Sep 5 2017 11:44 AM

స్పెషల్‌ ఫీచర్లతో నుబియా స్మార్ట్‌ఫోన్‌

స్పెషల్‌ ఫీచర్లతో నుబియా స్మార్ట్‌ఫోన్‌

నుబియా ‘ఎన్‌ 1 లైట్‌’ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను సోమవారం విడుదల చేసింది.

న్యూఢిల్లీ: నుబియా తన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను భారత మార్కెట్లో  లాంచ్‌ చేసింది. ఎన్‌ 1 సిరీస్‌ కొనసాగింపులో ‘ఎన్‌ 1  లైట్‌’ పేరుతో ఈ  డివైస్‌ను సోమవారం విడుదల చేసింది.  ఈ ఫోన్లు నేటి మధ్నాహ్నం 12 గం.లనుంచి వినియోగదారులకు అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.  ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌, సాఫ్ట్ లైట్‌ ఫ్రంట్‌ ఫ్లాష్ తో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.6,999గా నిర్ణయించింది.

ఎన్‌1 లైట్‌ ఫీచర్స్‌
5.5 ఇంచెస్‌  హెచ్‌ డీడిస్‌ప్లే
720x1280  రిజల్యూషన్‌
2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌,
8ఎంపీ రియర్‌ కెమెరా
 5 ఎంపీ సెల్ఫీ  కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
భారతదేశంలో వినియోగదారులందరికీ  అన్ని ధరల  శ్రేణిలో  క్లాస్‌ టెక్నాలజీలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించడానికి   తాము కట్టుబడి ఉన్నామని నుబియా ఇండియా హెడ్‌  ఎరిక్ హు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement