జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు! | JioPhone will not be supporting popular messaging app Whatsapp: Report | Sakshi
Sakshi News home page

జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు!

Jul 24 2017 8:10 PM | Updated on Sep 5 2017 4:47 PM

జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు!

జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు!

రిలయన్స్‌ జియో ఫోన్‌ మార్కెట్లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తోంది.

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో ఫోన్‌ మార్కెట్లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తోంది. అయితే భారత్‌లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఒక యాప్‌ మాత్రం జియో ఫోన్‌లో పనిచేయదు. అదే వాట్సాప్‌. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, ఆ ఫోన్‌లో వాట్సాప్‌ లేనిదో ప్రస్తుతం యూజర్లు ఉండలేకపోతున్నారు. మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ సంపాదించుకున్న స్థానం అంత విశిష్టమైనది. కానీ ఈ యాప్‌ ప్రస్తుతం జియో ఫోన్‌లో పనిచేయదని తాజా రిపోర్టులలో తెలిసింది. ప్రీ-లోడెడ్‌గా జియో యాప్స్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ సపోర్టుతో వస్తున్న జియో ఫోన్‌, వాట్సాప్‌ను సపోర్టు చేయకపోవడం యూజర్లకు కొంత నిరాసక్తికి గురిచేస్తోంది. అయితే ఏదైనా అప్‌డేట్‌ ఉండొచ్చని లేదా వాట్సాప్‌ సపోర్టు చేయడం కోసం ఈ ఫీచర్‌ని తర్వాత దశలో ప్రవేశపెడతారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌కు 200 మిలియన్ పైగా యూజర్లున్నారు. 
 
గతవారంలో జరిగిన  వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్‌ అంబానీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్‌ డేటా అందుబాటులోకి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement