దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హవా వీటిదే! | 5 biggest smartphone brands in India during Q1 2017 | Sakshi
Sakshi News home page

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హవా వీటిదే!

Apr 28 2017 6:47 PM | Updated on Sep 5 2017 9:55 AM

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది.

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. వరుసగా రెండో క్వార్టర్ ఈ చైనా కంపెనీలే టాప్ మోడల్స్ గా నిలిచాయి. టాప్-5 ఒక్క దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండు కూడా లేకపోవడం గమనార్హం. అయితే  దేశంలో రాజ్యమేలుతున్న స్మార్ట్ ఫోన్లేమిటో ఓ సారి చూద్దాం...
శాంసంగ్..
స్మార్ట్ ఫోన్ల రారాజు శాంసంగ్ కంపెనీనే మరోసారి దేశీయ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండుగా నిలిచింది. 2017 తొలి క్వార్టర్ సరుకు రవాణాలో 6 మిలియన్ యూనిట్లను ఈ కంపెనీ నమోదుచేసింది. 2016 క్యూ 4లో ఈ షిప్ మెంట్లు 6.2 మిలియన్లగా ఉన్నాయి. బడ్జెట్ సిరీస్ లో తీసుకొచ్చిన జే సిరీస్ బ్రాండు ఈ ఫోన్ ను టాప్-స్పాట్ లో నిలిపాయి. 
 
షియోమి..
ఇటీవల అమ్మకాల్లో సంచనాలు రేపుతున్న షియోమి స్మార్ట్ ఫోన్లు, దేశంలో 2017 క్యూ1లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తం షిప్మెంట్లలో ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు 14 శాతం నమోదుచేశాయి. 2014 క్యూ4లో మూడు మిలియన్లుగా ఉన్న కంపెనీ షిప్ మెంట్లు, 2017 తొలి క్వార్టర్లో 4 మిలియన్ యూనిట్లగా ఉన్నాయి. ఆన్ లైన్ గో-టూ-మార్కెట్ వ్యూహంతో షియోమి భారత్ లో అత్యంత స్కోరు నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
 
వివో.. 
మొదటి, రెండు స్థానాల్లో గత క్వార్టర్ కు, ఈ క్వార్టర్ కు పెద్దగా తేడా లేనప్పటికీ, మూడు స్థానంలో మాత్రం ఈ సారి కొత్త కంపెనీ వచ్చి చేరింది. వివో రెండు స్థానాలు పైకి ఎగిసి, టాప్-3లో నిలిచింది. ఈ కంపెనీ మొత్తం సరుకు రవాణా ఈ క్వార్టర్ లో 36 శాతం పెరిగినట్టు కానల్స్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్ లో 2.1 మిలియన్లుగా ఉన్న వివో స్మార్ట్ ఫోన్ల సరకు రవాణా, 2017 క్యూ1లో 3 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.  
 
లెనోవో...
లెనోవో కంపెనీ ఒక్క స్థానం పైకి ఎగిసి, టాప్-4స్థానాన్ని దక్కించుకుంది. అయితే కంపెనీ షిప్ మెంట్లు ఎన్ని ఉన్నాయో కానల్స్ రీసెర్చ్ వెల్లడించనప్పటికీ, టాప్-4లో లెనోవో ఉన్నట్టు పేర్కొంది. లెనోవో సొంతం చేసుకున్న మోటోరోలా కంపెనీ బ్రాండుకు సంబంధించిన మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఈ క్వార్టర్ లో లాంచ్ చేసింది. వాటితో పాటు కొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను ఈ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
 
ఒప్పో...
చైనాకి చెందిన మరో దిగ్గజం ఒప్పో, రెండు స్థానాలను కోల్పోయి టాప్-5లో చోటు దక్కించుకుంది. గత క్వార్టర్ లో ఈ కంపెనీ మూడో స్థానంలో ఉండగా.. కంపెనీ షిప్ మెంట్లు తగ్గి, ఈ సారి ఐదు స్థానంలోకి వచ్చింది. ఒప్పో 2017 తొలి క్వార్టర్ లో ఓప్పో ఏ57 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement