20 పైసలకే టీ షర్ట్‌, క్యూ కట్టిన జనం

20 Paise T Shirt In Thiruttani, Readymade Shop New Year Offer - Sakshi

సాక్షి, తిరుత్తణి: న్యూ ఇయర్‌ బంపర్‌ ఆఫర్‌తో తమిళనాడులోని తిరుత్తణిలో ఓ షాప్‌ వద్ద జనాలు క్యూ కట్టారు. చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్‌ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్‌ షోరూమ్‌ వినూత్న ప్రకటన చేసింది. చలామణిలో లేని పాత 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసే టీషర్ట్‌ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే తొలి వందమందికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున దుకాణం ముందు క్యూ కట్టారు. టీ షర్ట్‌ దక్కినవాళ్లు ఆనందం వ్యక్తం చేయగా, దక్కని వాళ్లు నిరుత్సాహంతో వెనుతిరిగారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top