వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడుకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
వైఎస్సార్సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి
Dec 9 2016 4:59 PM | Updated on Jul 30 2018 8:29 PM
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడుకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రత్యర్ధి వర్గం వారే రామిరెడ్డిని హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, లారీ ఢీ కొట్టడం వల్లే మరణించి ఉంటారని మరో వర్గం వారు చెబుతున్నారు. దీంతో హత్యకు సంబంధించి కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పులివెందుల నియోజక వర్గంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు కావడంతో.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసి ప్రమాదంలా చిత్రించేందుకు ప్రత్యర్ధులు యత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామిరెడ్డి మృతి వార్త విన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేంపల్లి ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Advertisement
Advertisement