తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy takes on cm chandrababu naidu behalf kona people | Sakshi
Sakshi News home page

తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్‌ జగన్‌

Dec 1 2016 5:01 PM | Updated on Jul 25 2018 4:09 PM

తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్‌ జగన్‌ - Sakshi

తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్‌ జగన్‌

ఇష్టం లేకుండా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

కోన: ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అలాంటిది పోర్టు పేరుతో బలవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివాడని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరే రాష్ట్రానికి ఉండడని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం బందర్‌ పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన సభలో  వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement